Saturday, 23 July 2016

పెన్షన్ బాధ్యత ప్రభుత్వానికి 60 శాతమే అనే నిర్ణయాన్ని ఉపసంహరిస్తూ ఆర్డర్సు -మన ఐక్య పోరాటం సాధించిన ఘన విజయం

బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు, పెన్షనర్లు అనేక పోరాటాలు చేసిన అనంతరం ఎట్టకేలకు ప్రభుత్వము పెన్షన్ ఖర్చు విషయం లో తన బాధ్యత బి ఎస్ ఎన్ ఎల్ పన్నులు, ఛార్జీలు రూపం లో తనకు చెల్లించే మొత్తం లో 60 శాతమే ననే ఆర్డరును రద్దు చేసింది. ఇది ఐక్య పోరాటం సాధించిన ఘన విజయం. ఈ పోరాటం లో బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు మరియు ఏ ఐ బి డి పి ఏ లు కీలక పాత్ర వహించాయి. ఈ 60 శాతం ఆర్డరు రద్దు వలన డి ఓ టి మరియు బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్ల పెన్షన్ ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. బి ఎస్ ఎన్ ఎల్ సర్వీసులో వున్న ఉద్యోగులకు పెన్షన్ కంత్రీబ్యూషన్ చెల్లిస్తే సరిపోతుంది. పెన్షన్ రివిజన్ చేయాల్సిన సందర్భముగా పెన్షన్ ఖర్చు 60 శాతం దాటిందా లేదా అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రశ్నలు వేసి పెన్షన్ రివిజన్ త్వరగా జరగకుండా చేసే పరిస్తితి, పెన్షన్ చెల్లింపుకు ఇబ్బంది కలిగే పరిస్తితి ఇక వుండదు. ఈ ఆర్డరు కాపీని ఇక్కడ క్లిక్ చేసి చూడండి
.https://drive.google.com/file/d/0BztXX1SBCx0tTlJ1VjZCQllfWFk/view?usp=sharing

Friday, 22 July 2016

27.7.2016న విజయోత్సవం జరపండి

పెన్షనర్లకు 78.2% డి ఏ మెర్జర్ పై పెన్షన్ చెల్లింపుకు ఆర్డర్సు

పెన్షన్ చెల్లింపుకు ఇబ్బంది కలిగించే  60 శాతం ఆర్డరు రద్దుకు అంగీకారం

ఉద్యోగుల, పెన్షనర్ల ఐక్య పోరాటానికి ఘన విజయం

1.10.2000 నుండి 9.6.2013 వరకు రిటైరయిన బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సు (డి ఓ టి నుండి బి ఎస్ ఎన్ ఎల్ లో విలీనమయిన తరువాత రిటైరయిన వారు) మరియు ఫ్యామిలీ పెన్షనర్సుకు  78.2 శాతం డి ఏ మెర్జర్ పై పెన్షన్ చెల్లింపుకు 5.7.2016న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. ఇందుకనుగుణముగా డిఓటి, 18.7.2016న ఆర్డర్సు ఇచ్చింది. ఈ ఆర్డర్సు ప్రకారం డిఓటి నుండి బి ఎస్ ఎన్ ఎల్ లో విలీనమయిన అనంతరం 1.10.2000 నుండి 1.1.2007 లోగా రిటైరయిన పెన్షనర్లు/ఫ్యామిలీ పెన్షనర్లకు 1.1.2007 నాటి పెన్షన్/ఫ్యామిలీ పెన్షన్(కమ్యూటెడ్ పోర్షన్ తో కలిపి) కు 78.2శాతం డియర్నెస్ రిలీఫ్ కలిపి ఆ మొత్తం పై 30 శాతం కలిపి ఆ విధముగా వచ్చిన మొత్తాన్ని రివైజ్డ్ పెన్షన్ గా లెక్కించాలి. అయితే 1.1.2007 నుండి 9.6.2013 వరకు ఈ పెరుగుదల నోషనల్ గా జరుగుతుంది. 10.6.2013 నుండి ఎరియర్సు చెల్లించబడతాయి. 1.1.2007 నుండి 9.6.2013 లోగా రిటైరయిన పెన్షనర్లు/ఫ్యామిలీ పెన్షనర్లకు  1.1.2007 నుండి వారి ప్రిరెవైజ్డ్ బేసిక్ పే కి 78.2 శాతం డి ఏ కలిపి ఆ మొత్తం పై 30 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వారి బేసిక్ పే ని రివైజ్ చేసి దానికి అనుగుణముగా పెన్షన్ ను రివైజ్ చేయాలి. ఇది 1.1.2007 నుండి 9.6.2013 వరకు నోషనల్ గా అమలు జరుగుతుంది. 10.6.2013 నుండి ఎరియర్సు చెల్లించబడతాయి.

5.7.2016 న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం, డి ఓ టి మరియు బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరించేందుకు అంగీకరించింది.  బి ఎస్ ఎన్ ఎల్ మేనేజిమెంటు  ఉద్యోగి తరఫున  ప్రభుత్వానికి ప్రతి నెలా పెన్షన్ కంట్రిబ్యూషన్ చెల్లిస్తే సరి పోతుంది. అంతకు మించి బి ఎస్ ఎన్ ఎల్ భరించాల్సిన అవసరం లేదని మంత్రి వర్గం నిర్ణయించింది. అంతకు ముందు 2006 లో ప్రభుత్వము డి ఓ టి ద్వారా విడుదల చేసిన ఆర్డరు ప్రకారం బి ఎస్ ఎన్ ఎల్ మరియు ఎం టి ఎన్ ఎల్ లు ప్రభుత్వానికి చెల్లించే లైసెన్సు ఫీజు మరియు డివిడెండు తో పాటు బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వానికి చెల్లించే కార్పొరేట్ పన్ను, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీసు ట్యాక్స్—ఈ చెల్లింపుల  మొత్తం లో 60 శాతం వరకే డి ఓ టి మరియు బి ఎస్ ఎన్ ఎల్ లో రిటైరయిన వారి పెన్షన్ ఖర్చు కోసం ప్రభుత్వం భరిస్తుంది. పెన్షన్ ఖర్చు అంతకు మించితే ఆ మించిన మొత్తాన్ని బి ఎస్ ఎన్ ఎల్ ప్రభుత్వానికి చెల్లించాలి. ఇది ప్రభుత్వానికి బి ఎస్ ఎన్ ఎల్ చెల్లించే పెన్షన్ కంట్రిబ్యూషన్ కు అదనం. పెన్షన్ ఖర్చు 2011-12 నుండి ఈ 60 శాతం పరిమితి దాటి పోయింది. కాబట్టి ఆర్థిక మంత్రిత్వ శాఖ 78.2 శాతం డిఎ మెర్జర్ పై పెన్షన్ రివిజన్ విషయం లో అభ్యంతరం లేవనెత్తింది. ఈ ఆర్డరు కొనసాగితే 1.1.2017 నుండి జరిగే వేతన సవరణ ప్రకారం పెన్షన్ రివిజన్ కు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఈ 60 శాతం ఆర్డరు రద్దుకు  ఇప్పుడు ప్రభుత్వము అంగీకరించింది కాబట్టి ఈ ఇబ్బందులుండవు. బి ఎస్ ఎన్ ఎల్ పై పెన్షన్ ఖర్చులో కొంత భరించాల్సిన బాధ్యత కూడా వుండదు. పెన్షన్ ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది.

ఈ విధముగా 78.2 శాతం డి ఎ మెర్జర్ పై పెన్షన్ రివిజను మరియు పెన్షన్ కు ఇబ్బంది కలిగించే 60 శాతం ఆర్డరు రద్దు—ఈ రెండు ఘన విజయాలు సాధించాము. అయితే ఈ ఘన విజయాలు ఉద్యోగుల, పెన్షనర్ల  ఐక్య పోరాటం సాధించిన ఘన విజయాలు.  ఇందులో బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ మరియు ఎ ఐ బి డి పి ఎ (ఆల్ ఇండియా బి ఎస్ ఎన్ ఎల్/డి ఓ టి పెన్షనర్స్ అసోసియేషన్) కీలక పాత్ర వహించాయి.

ఇతర యూనియన్లు కలిసి రానప్పటికి 2009 ఆగస్టు 19,20 తేదీలలో బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ రెండు రోజులు సమ్మె చేసి నాన్-ఎగ్జిక్యూటివ్సు మరియు ఎగ్జిక్యూటివ్సు కు 78.2% డి ఎ మెర్జర్ ప్రకారం వేతన సవరణ జరిపే విషయం సానుకూలముగా పరిశీలించేందుకు మేనేజిమెంటునుండి ఒక హామీని వేతన సవరణ ఒప్పందం లో సాధించింది. ఆ తరువాత ఫోరం ఆద్వర్యం లో నిరవధిక సమ్మెకు నాన్-ఎగ్జిక్యూటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ యూనియన్లు సమైక్యముగా  నోటీసునిచ్చిన అనంతరం 2012 లో మేనేజిమెంటు 78.2 శాతం డి ఎ మెర్జర్ పై వేతన సవరణకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు అంగీకరించింది. చివరికి 10.6.2013 నుండి సర్వీసులో వున్న ఉద్యోగులకు ఎరియర్సు చెల్లించే విధముగా 78.2 శాతం డి ఎ మెర్జర్ ప్రకారం వేతన సవరణకు ప్రభుత్వము ఆర్డర్సు ఇచ్చింది. వెంటనే బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ మరియు ఎ ఐ బి డి పి ఎ లు 10.6.2013 లోగా రిటైరయిన పెన్షనర్లకు  కూడా 78.2 శాతం డి ఎ మెరర్జర్  పై పెన్షన్ రివైజ్ చేయాలని డిమాండ్ చేశాయి. 60 శాతం ఆర్డరు రద్దుకు డిమాండ్ చేశాయి. బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగుల అధికారుల సంఘాల ఐక్య వేదిక ఫోరం కూడా ఈ డిమాండ్స్ ను లేవనెత్తింది. ఇంతేగాక బి ఎస్ ఎన్ ఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ల జె ఎ సి 27.11.2014 న చేసిన సమ్మె డిమాండ్స్ లో కూడా 78.2 శాతం డి ఏ మెర్జర్ పై పెన్షన్ చెల్లించాలనే డిమాండ్ వున్నది. . ఫోరం ఆధ్వర్యం లో బి ఎస్ ఎన్ ఎల్ పరిరక్షణకు 21,22 ఏప్రిల్ 2015న చేసిన మహత్తరమయిన రెండు రోజుల సమ్మె కి సంబంధించిన డిమాండ్స్ లో పెన్షన్ కు సంబంధించిన ఈ రెండు డిమాండ్స్ కూడా వున్నాయి. ఈ సమ్మెకి మద్దతుగా ఏ ఐ బి డి పి ఏ ప్రదర్శనలు నిర్వహించింది. ఈ సమ్మె అనంతరం 1.5.2015న డి ఓ టి సెక్రెటరీ ఫోరం నాయకులతో జరిపిన చర్చలలో 78.2 శాతం డి ఎ మెర్జర్ పై పెన్షన్ రివిజన్ కు కేబినెట్ నోట్ త్వరలో ఫైనలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తామని, 60 శాతం ఆర్డరు రద్దు చేయాలనే డిమాండ్ ను కూడా సానుకూలముగా పరిష్కరిస్తామని హామీ యిచ్చారు. ఆ తరువాత బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియను, ఫోరం నాయకులు మరియు ఏ ఐ బి డి పి ఏ నాయకులు అనేక సార్లు డి ఓ టి అధికారులను, మంత్రిని కలిసి ఈ డిమాండ్స్ త్వరగా పరిష్కరించాలని ఒత్తిడి చేశారు. చివరికి ఈ రెండు డిమాండ్స్ ను 5.7.2016 న జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఆమోదించింది. ఈ విధముగా 78.2 శాతం డి ఎ మెర్జర్ కు హామీని ఒంటరిగా పోరాడి బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ సాధించింది. ఆ తరువాత ఫోరం ఆద్వర్యం లో ఈ డిమాండ్స్ సాధనకు జరిగిన పోరాటం లో కీలక పాత్ర వహించింది.

ఫోరం చేసిన  పోరాటాలలో  ఎ ఐ బి డి పి ఎ కూడా పాల్గొన్నది. ఇంతేగాక ఏ ఐ బి డి పి ఏ స్వతంత్రముగా అనేక పోరాటాలు నిర్వహించింది. 29.8.2013న ధర్నాలు, 25.10.2013న నిరసన దినం తో పాటు మంత్రికి టెలిగ్రాములు, 20.11.2014 న మార్చ్ టు సంచార్ భవన్ మరియు డి ఓ టి సెక్రెటరీకి మెమోరాండం, మే 2014న ప్రధాన మంత్రికి పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్, 21,22 జులై 2015న సి జి ఏం ఆఫీస్/సీసీఏ ఆఫీసుల వద్ద రిలే నిరాహార దీక్షలు, 10.3.2016న ధర్నాలు తదితర కార్యక్రమాలు నిర్వహించింది. 7వ పే కమిషన్ కు పెన్షనర్ల సమస్యలపై సమర్పించిన మెమోరాండం లో ఏ ఐ బి డి పి ఏ, ఇతర అనేక డిమాండ్స్ తో పాటు  ఈ రెండు డిమాండ్స్  ను కూడా సమర్పించింది.

ఈ విధముగా ఉద్యోగులు అధికారులు మరియు పెన్షనర్ల ఐక్య పోరాటాల వలన ఈ రెండు ఘనవిజయాలు సాధించగలిగాము.ఈ సందర్భముగా 27.7.2016న సమావేశాలు జరిపి ఈ ఘన విజయం ప్రాముఖ్యతని  వివరించటం, మిఠాయిలు పంచతం తదితర రూపాలలో  విజయోత్సవం నిర్వహించాలని బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ తో పాటు ఏ ఐ బి డి పి ఏ కూడా పిలుపునిచ్చింది. కాబట్టి 27.7.2016 న అన్ని జిల్లాలలో ఈ విజయోత్సవాన్ని బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ తో కలిసి  ఘనముగా నిర్వహించాలని ఏ ఐ బి డి పి ఏ జిల్లా కార్యదర్శులందరికి విజ్ఞప్తి చేస్తున్నాము.


రామ చంద్ర్రుడు, సర్కిల్  కార్యదర్శి, ఏ ఐ బి డి పి ఏ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ 

DoT's Orders on 78.2% DA merger for pensioners

Orders issued by DoT on 78.2% DA merger for pensioners

Monday, 18 July 2016

Orders issued on 78.2% DA merger for pensioners

Orders issued by DoT today on allowing the benefit of 78.2% DA merger for the BSNL pensioners retired between 1.10.2000 to 10.6.2013. Arrears will be paid from 10.6.2013. It is a great achievement of the United struggle organised by the Forum of BSNL Unions of non-executives and executives in which BSNL Employees Union has played the key role as its Convener and also the contribution of AIBDPA( All India BSNL/ DoT Pensioners Association) is significant in this achievement. 

Thursday, 7 July 2016

WE ARE REALLY HUMBLED; THANKS A LOT COMRADES


After the news on cabinet approval of 78.2% IDA merger to the BSNL pensioners retired prior to 10-06-2013 was flashed on 05-07-2016, Com.V.A.N.Namboodiri, Advisor and Com.K.G.Jayaraj, General Secretary are overwhelmed with telephone calls, mobile, sms messages ,whatsup and email from hundreds of comrades through out the country conveying their joy ,congratulations and thanks for the historical achievement. Though they have tried to respond individually initially,it became absolutely difficult later as the number became so high. So they request all such comrades to bear with them for this unavoidable lapse and to please treat this as an individual response.

AIBDPA is of the firm opinion that the genuine demand was achieved through sustained struggles and crucial interventions at the right time. AIBDPA itself has conducted seven country wide struggles on this demand including the massive and impressive Sanchar Bhawan March on 20-11-2014. The employees’organisations under the leadership of BSNLEU supported the demand greatly by including this demand also for their two strikes, one by the Joint Action Committee of Non-Executive employees unions on 27-11-2014 and another two days strike by Forum of BSNL unions/Associations on April 21,22, 2015.   

AIBDPA started pursuing the issue right from 14-06-2013 itself by meeting the top officers and demanding early extension of this benefit to the BSNL pensioners retired before 10-06-2013. But the efforts were confronted with so many twists and turns some of them quite unexpected too. So we had to  resort to agitational path and to meet the hon’ble Minister for Communications twice.   Coms.M.B.Rajesh and Shankar Prasad Dutta both MPs of the Lok Sabha also discussed the issue with the Minister. We had met the DoT Secretary ,Shri.Rakesh Garg many times and after his transfer the new DoT Secretary Shri.J.S.Deepak twice at crucial junctures.

The achievement is of double delight, as the 60:40 ratio for payment of pensionary benefits to absorbed BSNL pensioners is also waived by the cabinet. At the time of our struggle for pension revision for the pre 2007 BSNL pensioners itself AIBDPA had demanded scrapping of this condition since it will be a road block and head ache every time when ever the demand of pension revision is raised. AIBDPA also took up the issue in the memorandum to the 7th Pay Commission for their intervention to get it scrapped. At a particular stage, it was Ms.Annie Moraes, Member(Finanace), DoT who initiated to include the proposal of  waiving  60:40 condition in the cabinet note. But it attracted strong objection from the Department of Expenditure and  therefore delayed the issue the maximum. Still it proved to be quite advantageous with the approval of the proposal by the union cabinet.And now, the entire responsibility rather liability for payment of pension and pensionary benefits to absorbed BSNL pensioners rests with the Central Government which is the significant achievement.

So Comrades, it was no magic or individual heroism but the fruit for the joint efforts by all of us and the credit also goes to all the comrades who have contributed what ever little they could. We have more to be achieved and let us march forward with unity and added vigour. Unity for struggla and struggle for unity. Red Salute, Comrades.
..... K.G.Jayaraj GS AIBDPA

Tuesday, 5 July 2016

ఎట్టకేలకు 78.2% డి ఎ మెర్జర్ కు కేబినెట్ ఆమోదం

10.6.2013 కు ముందు రిటైరయిన బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్స్ కు అనేక పోరాటాల అనంతరం కేబినెట్  ఆమోదం లభిస్తుందని. మరి ముఖ్యంగా, పెన్షన్ చెల్లింపు కు ఇబ్బంది కలిగించే 60:40 ఆర్డర్ రద్దుకు కూడా అంగీకరించింది. దీని వలన పెన్షన్ ఖర్చు మొత్తం  ప్రభుత్వమే భరించటానికిఅంగీకరించినట్లే. ఈ డిమాండ్స్ పరిష్కారానికి ఏఐబిడిపిఏ, బి ఎస్ ఎన్ ఎల్ ఇ యు మరియు ఫోరం ల పిలుపులననుసరించి సమ్మెలు మరియు అనేక ఇతర పోరాటాలలో పాల్గొన్న అందరికీ అభినందనలు. మన పోరాటానికి సహకరించిన సి పి ఎం పార్టీ పార్లమెంటు సభ్యులు కా. శంకర ప్రసాద్ దత్తా, ఎం.బి.రాజేష్ లకు, సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు.  
10.6.2013 నుండి పెరిగిన పెన్షన్ ఎరియర్స్ చెల్లించబడతాయి.

Press Information Bureau
Government of India
Cabinet
05-July-2016 17:20 IST
Cabinet approves Revision of pension of BSNL Pensioners Removing Anomalies
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the revision of pension of BSNL pensioners and family pensioners, who retired prior to 10.06.2013 by allowing the benefit of merger of 50% DA/DR with Basic Pay/ Pension, effectively amounting to 78.2% DA/DR for the purpose of fitment, and (ii) Modifying the liability of BSNL towards the payment of pensionary benefits to the retired employees.The pension of BSNL pensioners/family pensioners, who retired prior to 10.06.2013 has been revised w.e.f. 01.01.2007 notionally with actual benefit w.e.f. 10.06.2013, by allowing the benefit of merger of 50% DA/DR with Basic Pay/ Pension, effectively amounting to 78.2% DA/DR for the purpose of fitment at par with the serving employees of BSNL. However, increase in the amount of DCRG, leave encashment and commutation of pension in respect of these pensioners shall not be increased on this account.The pension liability in respect of employees of Department of Telecommunications (DOT) / Department of Telecom Services (DTS) / Department of Telecom Operations (DTO) who retired prior to 01.10.2000 is solely borne by Government of India and the BSNL will have no liability in respect of these employees. In respect of employees who are absorbed in BSNL, the liability on account of pensionary benefits shall be fully borne by Government while BSNL will continue to discharge pension liability by way of pension contribution in accordance with FR-116 for the period they so work/worked.The revision entails an estimated recurring annual expenditure of approximately Rs 129.63 crore for pensioners and Rs 24.93 crore for family pensioners and arrears from 2013-14 would be Rs 239.92 crore approximately for pensioners and Rs 44.62 Crore approximately for family pensioners. Approximately118500 pensioners all over India will be benefitted by this revision.This revision will fulfill the long pending demand of revision of pension of BSNL absorbed employees who retired prior to 10.06.2013 and will bring the pensioners at par with the serving employees of BSNL by removing the anomalies. It will help in reducing the financial burden of BSNL and removing prospects of industrial unrest in BSNL while fulfilling the commitment of Government.

Background: 

The decision of the Cabinet has come in the wake of an anomalous situation created in the difference of pension formula among the BSNL retirees who retired before and after 10.06.2013. Further, the decision regarding pensionary liability is on persistent demand from various quarters and a series of deliberations at different  levels to fulfill the assurance given by the Government before corporatization i.e. before formation of BSNL.


Monday, 20 June 2016

78.2 శాతం డి ఏ మెర్జర్ - కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపించబడిన కేబినెట్ నోట్

78.2 శాతం డి ఏ మెర్జర్ పై రివైజ్డ్ కేబినెట్ నోట్ ను 17.6.2016 న కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపించినట్లు కా.నంబూదిరికి డి ఓ  టి అధికారులు తెలియజేశారు. ఆలస్యమయినప్పటికి ఇది మంచి పరిణామం. కేబినెట్ ఆమోదానికి ఇంకా ఎటువంటి ఆటంకాలు ఉండవని ఆశించుదాం. 

Tuesday, 14 June 2016

జోహార్ కా.ఎం.పి.కున్హనందన్

ఏఐబిడిపిఏ మాజీ ట్రెజరర్ కా. ఎం.పి.కున్హనందన్ కొజికోడ్ లో ఈ రోజు (14.6.2016) మరణించారు తెలియజేయుటకు చింతిస్తున్నన్నాము. తిరుపతి లో 2,3 ఫిబ్రవరి 2016 న జరిగిన ఏఐబిడిపిఏ మహాసభలోనే అనారోగ్యం వలన తాను ఆల్ ఇండియా ట్రెజరర్ గా కొనసాగలేనని కా. కున్హనందన్ అన్నారు. ఏఐబిడిపిఏ కి, టెలికం కార్మికోద్యమానికి కా. కున్హనందన్ విశిష్టమయిన సేవలందించారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను. కా. కున్హనందన్ కు అరుణాంజలి సమర్పిస్తున్నాము. జోహార్ కా. కున్హనందన్! 

Monday, 13 June 2016

78.2 శాతం డి ఎ మెర్జర్- కేబినెట్ నోట్ పై సంతకం చేసిన డి ఓ టి సెక్రెటరీ- కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపించేందుకు జరుగుతున్న సన్నాహం

ఈ రోజు ( 13.6.2016) ఏఐబిడిపిఏ జనరల్ సెక్రెటరీ కా.కె.జి.జయరాజ్ , డి ఓ టి లో డిడిజి   ఎస్టాబ్లిష్మెంట్ శ్రీ ఎస్.కె.జైన్ తో 78.2 శాతం డి ఎ మెర్జర్ విషయం మాట్లాడారు. 

కేబినెట్ సెక్రెటేరియట్ సూచన మేరకు మార్పు చేయబడిన కేబినెట్ నోట్ ను డి ఓ టి సెక్రెటరీ శ్రీ జె.ఎస్.దీపక్ ఈ రోజు ఆమోదించారని శ్రీ జైన్ తెలియజేశారు. మార్చబడిన ఈ కేబినెట్ నోట్ కు  హిందీ అనువాదం, అదనంగా పంపించాల్సిన కాపీలు తదితరాలను తయారు చేస్తున్నామని, ఈ పని అయినతరువాత కవరింగ్ లెటరు సంతకానికి డి ఓ టి సెక్రెటరీకి పంపిస్తామని, ఆ తరువాత కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపిస్తామని శ్రీ జైన్ అన్నారు. 

ఇప్పటికే 3 సంవత్సరాలయిందని, కొంతమంది పెన్షనర్లు  ఈ బెనిఫిట్ లభించకుండానే చనిపోవటం కూడా జరిగిందని, కాబట్టి ఇంకా ఆలస్యం జరగకుండా చూడాలని కా. జయరాజ్, శ్రీ జైన్ కు విజ్ఞప్తి చేశారు. పని త్వరగాఅయ్యేందుకు సాధ్యమయినదంతా చేస్తామని శ్రీ జైన్ హామీ యిచ్చారు. 

 

Wednesday, 8 June 2016

సెక్రెటరీ డి ఓ టి ఢిల్లీలో లేనందున ఆగిన 78.2 శాతం డి ఏ ఫైలు

10.6.2013 కి ముందు రిటైరయిన వారికి 78.2 శాతం డి ఏ మెర్జర్ ప్రకారం పెన్షన్ చెల్లింపుకు సంబంధించి కేబినెట్ సెక్రెటేరియట్ సూచన ప్రకారం మార్పు చేయబడిన ఫైలు డిఓటి సెక్రెటరీ టేబుల్ పైవున్నట్లు తెలుస్తున్నది. ఈ రోజు (8.6.2016) ఏఐబిడిపిఏ ఎడ్వైజర్ కా. నంబూదిరి డిఓటి సెక్రెటరీ శ్రీ జె.ఎస్.దీపక్ తోమాట్లాడేందుకు ప్రయత్నించగా వారు ఢిల్లీలో లేరని, 13.6.2016 న వస్తారని, వచ్చిన తరువాత ఫైలు పై సంతకం చేస్తారని, వారి పి ఏ తెలియజేశారు. డిఓటి సెక్రెటరీ సంతకం తరువాత ఫైలు కేబినెట్ ఆమోదానికి పంపిస్తారు. 

Wednesday, 1 June 2016

7వ వేతన సంఘం సిఫార్సులపై ప్రభుత్వ వైఖరి-పెన్షనర్లు

7వ వేతన సంఘం సిఫార్సుల అమలు పై ప్రభుత్వము కేబినెట్ సెక్రెటరీ అధ్యక్షతన సెక్రెటరీల కమిటీని నియమించింది. కానీ ఈ కమిటీ వైఖరి సానుకూలముగా లేదు. 1.1.2016 నాటి బేసిక్ పే కి 2.57 రేట్లు వుండే విధముగా కొత్త బేసిక్ పే వుండాలని 7వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫార్ములా సిఫార్సు చేసింది. దీని ప్రకారం 1.1.2016 నాటి పే ప్లస్ డి ఏ పై పెరుగుదల కేవలం 14.29 శాతమే వుంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు 1.1.2016 నాటి బేసిక్ పే ని 3.7 రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. 1.1.2016 నాటికి కేంద్ర ప్రభుత్వ గ్రూప్ డి కనీస బేసిక్ రు.7000 .కాగా దానిని 7 వ వేతన సంఘం రు.18000 చేసి (2.57 రెట్లు) అందరికీ అదే విధముగా బేసిక్ పే 2.57 రెట్లు పెరుగుదల జరిగే విధముగా ఫిట్మెంట్ ఫార్ములా (బేసిక్ X 2.57) సిఫార్సు చేసింది. కానీ ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక కనీస వేతనం రు.7000 ను రు.26000 కు పెంచి ఆ ప్రకారం బేసిక్ పే ని అందరికీ 3.7 రెట్లు పెంచాలని డిమాండ్ చేసింది. పెన్షన్ ను కూడా ఇదే విధముగా 3.7 రెట్లు పెంచాలని డిమాండ్ చేసింది.

26.5.2016 న కేబినెట్ సెక్రెటరీని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు ( కా. శివ గోపాల్ మిశ్రా, కా. గుమన్ సింగ్, కా.కె.కె.ఎన్.కుట్టి) కలిశారు. కేబినెట్ సెక్రెటరీ తో జరిపిన ఈ చర్చలు నిరాశాజనకముగా వున్నాయి. ప్రభుత్వము  కనీస వేతనం ను రు.18000 నుండి స్వల్పముగా పెంచేందుకు సిద్ధముగా వున్నది.  కానీ ఫిట్మెంట్ ఫార్ములాని 2.57 నుండి పెంచేందుకు సిద్ధముగా లేదు.

ఇంతేగాక 7 వ వేతన సంఘం పాత పెన్షనర్ల పెన్షన్ కొత్త పెన్షనర్లతో సమముగా వుండాలని సిఫార్సు చేసినప్పటికీ ఇందుకు అంగీకరించేందుకు ప్రభుత్వము సిద్ధముగా లేదు. ఈ సిఫార్సు అమలు చేయటం సాధ్యం కాదని, పాత పెన్షనర్ల రికార్డులు దొరకటం కష్టం కాబట్టి సాధ్యము కాదని పెన్షన్ డిపార్ట్మెంటు మరియు రక్షణ శాఖ అన్నట్లు కేబినెట్ సెక్రెటరీ  అన్నారు. కానీ ఇది అర్థం లేని వాదన. పెన్షనర్ల రికార్డులు సంబంధిత డిపార్ట్మెంట్సు వద్ద వుంటాయి. ఇంతే గాక పెన్షనర్ల వద్ద కూడా చాలా వరకు వుంటాయి. రికార్డులు దొరకటం కష్టమనే పేరుతో పెన్షన్ సమానతను నిరాకరించే ప్రయత్నం ను మనం ఆమోదించ కూడదు.
ప్రభుత్వ వైఖరి సానుకూలముగా లేనందున డిమాండ్స్ పై కూలంకషముగా చర్చించేందుకు స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు కోరారు. పాత పెన్షనర్లకు కొత్త పెన్షనర్లతో సమానత వుండాలని 7వ వేతన సంఘం సిఫార్సు చేసినా అంగీకరించకపోవటం సమంజసం కాదని ఉద్యోగుల ప్రతినిధులన్నారు. తాను ఈ విషయములో పునఃపరిశీలనకు సిద్ధమేనని, ఒక సారి పెన్షన్ డిపార్ట్మెంటు మరియు రక్షణ శాఖ అధికారులతో చర్చించండని కేబినెట్ సెక్రెటరీ సలహా యిచ్చారు.
3.6.2016 న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఢిల్లీ లో సమావేశమై పరిస్థితిని సమీక్షించి తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తుంది.

పెన్షనర్లకు ఈ విషయాలు తెలియ జెసి అవసరమయిన సందర్భములో పోరాటానికి సంసిద్ధం చేయాలని ఎన్ సి సి పి ఏ (నేషనల్ కొ ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్  అసోసియేషన్స్) సెక్రెటరీ జనరల్ కా. కె.కె.ఎన్.కుట్టి పిలుపునిచ్చారు. ఎన్ సి సి పి ఏ లో ఏ ఐ బి డి పి ఏ భాగస్వామి. కాబట్టి ఈ పిలుపుననుసరించి ఈ విషయాలు పెన్షనర్ల దృష్టికి తీసుకెళ్లాలి.

78.2 శాతం డి ఏ మెర్జర్ --1.6.2016 నాటి పరిస్థితి

కేబినెట్ సెక్రెటేరియట్ అడిగిన దాని ప్రకారం కేబినెట్ నోట్ లో తగు మార్పులు చేసి తుది రూపం ఇచ్చామని, 31.5.2016 నాటికి కేబినెట్ సెక్రెటేరియట్ కు తిరిగి పంపించే అవకాశం వున్నదని ఏ ఐ బి డి పి ఏ జనరల్ సెక్రెటరీ కా. కె.జి.జయరాజ్ కు  డి ఓ టి  అధికారి డి డి జి (ఎస్టాబ్లిష్మెంట్) 27.5.2016 న తెలియాజేశారు. ఫైలు డి ఓ టి సెక్రెటరీ కి చేరినట్లు తెలుస్తున్నది. ఈ రోజు (1.6.2016) డి ఓ టి సెక్రేటరీ సంతకం చేస్తే రేపు 2.6.2016న కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపే అవకాశం వున్నది.

Saturday, 14 May 2016

78.2 శాతం డి ఏ మెర్జర్

కేబినెట్ నోట్ ఫైలును గతవారం ప్రధానమంత్రి కార్యాలయానికి డిఓటి పంపించిందని, అక్కడినుండి తిరిగి వచ్చిన తరువాత కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపిస్తామని డిఓటి డైరెక్టర్ ( ఎస్టాబ్లిష్మెంట్) శ్రీ ప్రాచీస్ ఖన్నా 13.5.2016న ఏఐబిడిపిఏ జనరల్ సెక్రెటరీ కా. కె.జి.జయరాజ్ తో అన్నారు.




Thursday, 21 April 2016

78.2% డి ఎ మెర్జర్- కేబినెట్ ఆమోదానికి పంపంచేందుకు తయారు చేయబడుతున్న కేబినెట్ నోట్

ఏఐబిడిపిఏ జనరల్ సెక్రెటరీ కా. కె.జి.జయరాజ్ 21.4.2016 న డి ఓ టి లో డిడిజి ఎస్టాబ్లిష్మెంట్ శ్రీ ఎస్.కె.జైన్ ను కలిసి 78.2% డి ఎ మెర్జర్ పై చర్చించారు. మంత్రి నుండి కేబినెట్ నోట్ ఫైలు తిరిగి వచ్చిందని , ఆ కేబినెట్ నోట్ కు అనుబంధంగా పంపించాల్సిన పత్రాలను ( కేబినెట్ నోట్ కు హిందీ అనువాదం మరియు సంబంధిత డాక్యుమెంట్లుఒక్కొక్కటి 50 కాపీలు)  తయారు చేస్తున్నామని, డి ఓ టి లో వున్న పెన్షన్ సెక్షన్ ఈ పనిచేస్తున్నదని శ్రీ జైన్ అన్నారు. హిందీ అనువాదాన్ని హిందీ సెక్షన్ చేస్తున్నదని అన్నారు. 

 కేబినెట్ నోట్ తయారీ మొదటినుండీ  చూస్తున్న  డైరెక్టర్ ( ఎస్టాబ్లిష్మెంట్) శ్రీ ప్రాచిస్ ఖన్నా సెలవులో వున్నారు. 28.4.2016 న జాయిన్ అవుతారు. కాబట్టి కా. జయరాజ్, ఏడిజి పెన్షన్ ను కలిసి కేబినెట్ నోట్ ను త్వరగా పంపించామని కోరారు. పని ఇప్పటికే ప్రారంభించామని, కొద్ది రోజులలో పూర్తి అవుతుందని అన్నారు. అనంతరం కా.జయరాజ్, హిందీ అధికారులను కలిశారు. హిందీ అనువాదం 25 వ తేదీ నాటికి పూర్తి కావచ్చని  వారు తెలియజేశారు. 

కాబట్టి  ఏఐబిడిపిఏ కృషి వలన కొద్ది రోజులలోనే కేబినెట్ నోట్ ను  డి ఓ టి ఆమోదానికిపంపించే పరిస్థితి ఏర్పడింది.  

Tuesday, 12 April 2016

శుభ వార్త- 78.2% డి ఏ మెర్జర్ పై నిర్ణయం ఈ నెల ఆఖరులో గా వెలువడవచ్చు


బిఎస్ ఎన్ ఎల్ ఇ యు ప్యాట్రన్ మరియు ఏఐబిడిపిఏ బి డి పి ఏ ఎడ్వైజర్ కా. నంబూదిరి ఈ రోజు ( 12.4.2016) డి ఓ టి సెక్రెటరీ శ్రీ జె.ఎస్. దీపక్ ను కలిసి పెన్షనర్సు కు 78.2% డి ఏ మెర్జర్ పై చర్చించారు. ఫైలును ఆమోదించి పంపించానని డి ఓ టి సెక్రెటరీ అన్నారు. ఏప్రిల్ ఆఖరులోగా నిర్ణయం వస్తుందని డి ఓ టి సెక్రెటరీ అన్నారు

Sunday, 3 April 2016

8.2% డి ఏ మెర్జర్ పై డి ఓ టి సెక్రటరీతో సమావేశం


ఏఐబిడిపిఏ ఎడ్వైజర్ కా.నంబూదిరి, డిఓటి సెక్రెటరీ శ్రీ జె.ఎస్. దీపక్ ను 31.3.2016 న కలిసి 10.6.2013 కి ముందు రిటైరయిన పెన్షనర్సుకు 78.2% డి ఏ మెర్జర్ అమలు చాలా ఆలస్యమయిందని, వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.  కేబినెట్ నోట్ తన టేబుల్ పై వున్నదని, త్వరలో పంపిస్తామని సెక్రెటరీ అన్నారు. పెన్షన్ రివిజన్ విషయంలో ఇబ్బంది కలిగిస్తున్న 60:40ఆర్డరును రద్దు చేసేందుకు తగిన చర్య తీసుకోవాలని కా. నంబూదిరి విజ్ఞప్తి చేశారు. 
78.2 శాతం డిఎ మెర్జర్ పై మార్చి నెల లో కా.నంబూదిరి డిఓటి సెక్రటరీనికలవటం ఇది రెండవ సారి. ఇంతేగాక 9.3.2016 న ఈ సమస్య పై కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ ను కూడా  కా.నంబూదిరికలిశారు. 

ఈ చర్చల ఫలితంగా కేబినెట్ నోట్ ను డిఓటి సెక్రెటరీ త్వరలో మంత్రి/ కేబినెట్ ఆమోదానికి ఇంకా ఆలస్యం చేయకుండా త్వరలో పంపిస్తారని  ఆశిస్తున్నాము. 

Monday, 7 March 2016

78.2 శాతం డి ఏ మెర్జర్ పై పెన్షన్ రివిజన్ కు 10.3.2016న ప్రదర్శనలు నిర్వహించండి

డి ఓ టి మరియు ప్రభుత్వము  78.2 శాతం డి ఏ మెర్జర్ పై పెన్షన్ రివిజన్ ను అనవసరముగా జాప్యం చేస్తున్నాయి. ఈ జాప్యానికి కారణం లేదు. ఫైలు డి ఓ టి లో ఒక డెస్క్ నుండి మరో డెస్క్ కు తిరుగుతూ వున్నది. ఫైలును కేబినెట్ ఆమోదానికి త్వరలో పంపిస్తామనే హామీలు పుష్కలముగా లభిస్తున్నాయి. కానీ ప్రతి సారి ఏదో ఒక కొత్త సందేహాన్ని లేవనెత్తి ఫైలును డి ఓ టి లోనే అటు ఇటు తిప్పుతున్నారు. ఈ వివక్షతకి అన్యాయానికి ముగింపు పలకాలి. 10.6.2013 ముందు రిటైరయిన పెన్షనర్లకు 78.2 శాతం డి ఏ మెర్జర్ ప్రకారం పెన్షన్ రివిజన్ వెంటనే జరగాలి. ఫిబ్రవరి 2,3 తేదీలలో తిరుపతిలో జరిగిన  ఏ ఐ బి డి పి ఏ అఖిల భారత మహాసభ మార్చి 10 న ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. మార్చి 10 న బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లు పెద్ద ఎత్తున బి ఎస్ ఎన్ ఎల్ జిల్లా కార్యాలయాల వద్దా జరుగు ప్రదర్శనలో పాల్గొనాలి. బి ఎస్ ఎన్ ఎల్ యూనియన్ల అసోసియేషన్ల ఫోరం కూడా అదే రోజు ప్రభుత్వ కార్మిక విధానాలను వ్యతిరేకించేందుకు, బి ఎస్ ఎన్ ఎల్ పరిరక్షణకు మరియు 78.2 శాతం డి ఏ మెర్జర్ కు ప్రదర్శనలు నిర్వహిస్తున్నది. కాబట్టి పెన్షనర్లు కూడా ఈ ప్రదర్శనలలో పాల్గొని జయప్రదం చేయాలి.   

Tuesday, 1 March 2016

78.2% డి ఎ మెర్జర్


 ఈ రోజు ( 1.3.2016) జనరల్ సెక్రెటరీ కా.కె.జి.జయరాజ్, ట్రెజరర్ కా. ఆర్.అరవిందాక్షన్ నాయర్ లు డిఓటి లో మెంబర్(ఫైనాన్స్) శ్రీమతిఅన్నీ మొరియాస్,  మెంబర్ ( సర్వీసెస్) శ్రీ ఎన్.కె.యాదవ్, డిడిజి( ఎస్టాబ్లిష్మెంట్) శ్రీ ఎస్.కె.జైన్, డైరెక్టర్ ( ఎస్టాబ్లిష్మెంట్) శ్రీ ప్రాచిస్ ఖన్నా లను కలిసి 78.2% డి ఎ మెర్జర్ పై చర్చించారు.

మెంబర్ ( సర్వీసెస్) , డిడిజి( ఎస్టాబ్లిష్మెంట్)  మరియు డైరెక్టర్ ( ఎస్టాబ్లిష్మెంట్) లు డిఓటి సెక్రటరీని కలిసి 78.2% డి ఎ మెర్జర్ పై ఆయన అడిగిన పాయింట్ల కు వివరణయిచ్చారు. డిఓటి సెక్రెటరీ 78.2 % డిఎ  మెర్జర్ ఫైలును క్లియర్ చేసి మంత్రిగారికి పంపిస్తారనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. 
డీఓటి సెక్రెటరీ శ్రీ జె.ఎస్.దీపక్ ను కా.కె.జయరాజ్ రేపు కలిసే అవకాశం వుంది.


Monday, 29 February 2016

డి ఓ టి పెన్షన్ ఖర్చు

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 29.2.2016 న పార్లమెంటుకు సమర్పించిన 2016-17 బడ్జెట్ ప్రకారం డి ఓటి లో మరియు బి ఎస్ ఎన్ ఎల్ లో రిటైరయిన వారికి పెన్షన్ చెల్లింపుకు అయ్యే ఖర్చు:
2015-16 బడ్జెట్ అంచనా: రు. 6833.02 కోట్లు
2015-16  సవరించిన అంచనా--రు.7700 కోట్లు
2016-17 బడ్జెట్ అంచనా-----రు.8932 కోట్లు
2006-07 లో ఈ ఖర్చు ఆర్‌యూ. 1395 కోట్లు కాగా  2011-12 లో రు .3959 కోట్లు అయింది. రిటైరయిన  వారి సంఖ్య పెరుగుతున్నందున పెన్షన్ ఖర్చు పెరుగుతున్నది.
2011-12 నుండి పెన్షన్ ఖర్చు డి ఓ టి కి బి ఎస్ ఎన్ ఎల్ చెల్లించే పన్నులు, డివిడెండ్లు లో 60 శాతం దాటిందని డి ఓ టి అన్నది. కేబినెట్ ఆదేశం తో గతం లో డి ఓ టి ఇచ్చిన ఆర్డరు ప్రకారం డి ఓ టి కి బి ఎస్ ఎన్ ఎల్ పన్నులు, డివిడెండ్లు రూపం లో చెల్లించే మొత్తం లో పెన్షన్ ఖర్చు 60 శాతం మించితే మించిన భాగాన్ని బి ఎస్ ఎన్ ఎల్ భరించాలి. దీనిని వ్యతిరేకిస్తున్నాము. మొత్తం ఖర్చు డి ఓ టి యే (ప్రభుత్వమే) భరించాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ ఆర్డర్ ను రద్దు చేయాలని కోరుతూ కేబినెట్ కు రాసేందుకు డి ఓ టి అంగీకరించింది.


Tuesday, 23 February 2016

78.2% డి.ఏ మెర్జర్

జనరల్ సెక్రెటరీ కా. కె.జి.జయరాజ్ ఈ రోజు(23.2.2016) డిఓటి డైరెక్టర్ ( ఎస్టాబ్లిష్మెంట్) శ్రీ ప్రాచీస్ ఖన్నా తో మాట్లాడారు. 78.2% డి ఏ మెర్జర్ ఫైలు ఇంకా డిఓటి సెక్రెటరీ వద్దనే వున్నదని, డిఓటి సెక్రెటరీ విదేశీ పర్యటనలోవున్నారని, వచ్చే వారం తిరిగి వస్తారని శ్రీ ఖన్నా అన్నారు. 

Friday, 19 February 2016

బి ఎస్ ఎన్ ఎల్ ఇయు విస్తృత కేంద్ర కార్యవర్గ సమావేశం

అహమ్మద్ నగర్ ( మహరాష్ట్ర) లో ఈ రోజు ( 19.2.2016) బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ అఖిలభారత కార్యవర్గ విస్తృత సమావేశం ప్రారంభమయింది. ప్రారంభ సమావేశంలో కేంద్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాకార్యదర్శులతో పాటు మహారాష్ట్ర సర్కిల్ నుండి మొత్తం 1000 మంది పాల్గొన్నారు. మహారాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి కా.కరడ్ కార్మికవర్గమే దేశభక్తి యుత వర్గమని, మతం పేరుతో దేశాన్ని మత రాజ్యంగా మార్చాలని  హిందూత్వ శక్తులు మోడీ ప్రభుత్వ మద్దతుతో ప్రయత్నిస్తున్నాయని, మరో వంక మోడీ ప్రభుత్వము కాంగ్రెస్ అనుసరించిన కార్మిక వ్యతిరేక, ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల ఆర్థికవిధానాలనే మరింత ఉధృతంగా అనుసరిస్తున్నదని  అన్నారు. లౌకిక తత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని, కార్మిక హక్కులను కాపాడేందుకు, ప్రజానుకూల ఆర్థిక విధానాలకోసం కార్మిక వర్గ ఐక్య పోరాటాలు మరింత బలపడాలని, ఇందుకోసం బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ మరింత బలపడాలనిఅన్నారు. బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు కా. బల్బీర్ సింగ్ ప్రసంగీంచారు. బి ఎస్ ఎన్ ఎల్ ఇయు ప్యాట్రన్ కా.నంబూదిరి ప్రసంగీంచారు. 
బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కా.పి.అభిమన్యు, గత 3 సంవత్సరాలలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూనియన్ చేసిన కృషిని వివరించారు. మే 10న జరుగు యూనియన్ గుర్తింపు ఎన్నికలలో బి ఎస్ ఎన్ ఎల్ ఇ యు ని అత్యధిక శాతం ఓట్లతో గెలిపించాల్సిన అవసరాన్ని వివరించారు. 

Monday, 15 February 2016

NCCPA & NJCA CIRCULARS


NATIONAL CO-ORDINATION COMMITTEE OF PENSIONERS
Website: nccpahq.blogspot.in. 
E mail: nccpahq@gmail.com
13.c Feroze Shah Road,m
 New Delhi. 110 001
11th Feb. 2016.
President:                           Com. Shiv Gopal Misra.
Secretary General:          Com. K.KN. Kutty.
NATIONAL SECRETARIAT MEETING
The National secretariat of NCCPA met at AIRF Library hall, AIRF office, New Delhi as scheduled on 7.02.2016 at 2 PM. Com. Shiv Gopal Misra, President chaired the meeting. Com. Rakal DasGupta, President AIRF was the honoured Guest. 12 of the secretariat members could be present in the meeting. The comrades from Kerala Com. Sudhakaran and Com. Parameswaran had informed of their inability to attend the meeting. So was the case with the R.L. Bhattacharya and VAN. Namboodiri, Patrons and Com. K.G.Jayaraj &   Com. Dhaklhod had also informed of the difficulties in attending the meeting. In short quite a number of Secretariat members had not been able to be present at the meeting though intimation of the meeting had been given two months back. The meeting felt the debilitating impact of the absence of a large number of members. In this communication, we convey the decision taken on various agenda items. The minutes of the meeting will be circulated latter.
Agenda No.1
Com. Pavitra Chakraborty enumerated the various decisions taken in the last conference and indicated that most of them have been acted upon.
Agenda No. 2
The meeting noted that the note prepared and given to NJCA touches upon important issues. Though various other issues were raised, which are of concern to pensioners, most of the members felt the need to ensure that the party with the past and present pensioners as suggested by 7th CPC has  got to be  implemented with modification as sought for by us through the NJCA charter. The meeting also decided that in the light of the Supreme Court decision, the question of allowing full pension in the case of those who have completed 20 years is another issue, which must be pursued. To raise the FMA from Rs 500 to Rs 2000/ must also receive priority.
Agenda No.3
Com. President after hearing the views of all members stated that he would get in touch with all Railway Pension Organizations to enlist them as affiliates of NCCPA. . It was also felt that some contact must     be established with defence Civilian pensioners. During the discussion, Com. Secretary General suggested for holding a National convention on NPS and PFRDA inviting all Pensioner organizations. The demand for rolling back of the Contributory Pension scheme, he added will receive wider appreciation and response, apart from giving an opportunity for all Pensioners organisation to come together on one platform.   The modus operandi will be worked out and the convention will be held at New Delhi. This suggestion was accepted by the house.
Agenda No.4. Finance
Com. Pavitra Chakraborty will make available list of organizations who are in arrears of payment of subscriptions. Secretary General stated that priority must be given to collect arrears and then setup a working fund for day to day functioning apart from the annual subscription.   Com. Secretary General informed the house that a Savings Bank Account in the joint names of the Secretary General and the Treasurer has been opened in the Syndicate Bank Indra Park Branch, New Delhi. (Account No. 918820100n 26870)
AgendaNo. 5. Journal.
Com. Pavitra Chakraborty said that the grant of postal registration for the journal is in the final stage  of approval and the same will be obtained in a few day’s time.  The meeting felt that the grant of postal registration would reduce the dispatch expenditure considerably. The meeting also discussed the need to widen the subscriber base of the journal.  All constituents would be requested to increase the number of subscribers.  Certain complaint of the non receipt of the journal and the non regularity was also made.  The necessity to publish the journal regularly was emphasised.
Agenda No. 6. Any other matter with the permission of the Chair.
It was decided that the next meeting of the Secretariat must be held on 21st May, 2016.  In the light of the availability of three months, all Secretariat Members will ensure that they attend the meeting without fail.   The need for a separate bank account at Kolkata was raised by the Assistant Treasurer.  The meeting authorised Com. Pavitra Chakraborty to open a joint account with the Assistant Treasurer or convert the existing account.
With greetings,
Yours fraternally, 
K.K.N. Kutt6y
Secretary General.
We reproduce hereunder the National JCA circular letter dated 9.2.2016, which conveys the decision of the meeting of 8th February 2016. One of the programmes taken by the NJCA is to organise a massive rally in the State capitals, where all The NJCA members will take part. It is one programme in which the pension comrades can contribute immensely for its success. The discontent emanating from the 7th CPC recommendations is needed to be demonstrated     for an effective negotiation. The 7th CPC , as you are aware , has totally disregarded the health care requirement of pensioners. They have not even found if right to raise the fixed medical allowances. We know the CGHS recognized hospitals are there only for the name sake and complaints are galore of even these hospitals closing door to pensioners for the Government does not pay the bills to them in time . While we appreciate the difficulties and inconvenience of our pensioner comrades to undertake travel and participate in the rally and demonstration, if has become unfortunately inevitable. We appeal to all our constituents to embark upon a series of meetings in different places to convey to our comrades the need to take part in the Central rally.
On 11th March 2016, the NJCA has decided to organize a massive    rally at Jantar Mantar, New Delhi to submit the Strike Notice. No separate rally is proposed  for Delhi. A good number of pensioners are required to take part in the rally. We appeal to pensioners residing   in and around  Delhi to take  the trouble of being at Janter Manter on 11.03.2016. The Confederation  of CGEs have decided to organize demonstration in front of all offices on 11.03.2016 to serve strike notices on the concerned heads of offices.  Pension comrades are requested  to please participate in that programme at offices nearby their  residence.
                NJCA
National Joint Council of Action
4, State Entry Road, New Delhi – 110055
No.NJC/2015/7th CPC                                                                                                 February 9, 2016
To
All Constituents of NJCA
Dear Comrade
The NJCA met on 08.02.2016 as scheduled. The meeting after taking into account various factors decided that the proposed indefinite strike will commence from 11.04.2016 if no settlement is brought about on the charter of demands by that time. The meeting also took the following decisions.
1.  Strike notice will be served by the NJCA and all its constituents on 11.03.2016 by holding massive demonstration.
2.     There will be a massive Rally on 11.03.2016 at Delhi and leaders of NJCA will make it possible to attend the said rally and the strike notice will be served on Cabinet Secretary, Government of India.
3.     All the National JCA leaders will attend Rally at the State Capitals/big industrial centres during the month March and April, 2016. Dates will be finalised in consultation with the concerned State JCA.
4.   To strengthen the campaign, the NJCA will place on the website a pamphlet explaining the demands.
5.   Posters will be centrally designed and kept in the website for State JCAs and constituents to adopt.
6.  All Constituents will undertake independent campaign programmes in the month of March 2016 to popularize the demands.
7.      29th March will be observed as solidarity day throughout the country unitedly by all the Constituents of NJCA.
8.    The indefinite strike will commence at 6 am on 11.04.2016.
9.     The updated Charter of Demands on which the indefinite strike is to be organized is enclosed.
10.  The Constituent organizations may add sectional demands as Part B of the Charter of Demands of the NJCA
The National JCA appeals all constituents to make intensive campaigns to make the strike an unprecedented success.
With greetings,
Yours fraternally,
(Shiva Gopal Mishra)
Convener
Charter of Demands
1.     Settle the issues raised by the NJCA on the recommendations of the 7 CPC sent to Cabinet Secretary vide letter dated 10th December 2015
2.      Remove the injustice done in the assignment of pay scales to technical/safety categories etc. in Railways& Defence, different categories in other Central Govt establishments by the 7 CPC
3.     Scrap the PFRDA Act and NPS and grant Pension/family Pension to all CG employees under CCS (Pension) Rules, 1972 & Railways Pension Rules, 1993
4.      No privatization, /outsourcing/contractorisation of governmental functions
ii) Treat GDS as Civil Servants and extend proportional benefit on pension and allowances to the GDS
5.   No FDI in Railways & Defence; No corporatization of Defence Production Units and Postal Department.
6.     Fill up all vacant posts in the government departments, lift the ban on creation of posts; Regularise the casual/contract workers
7.     Remove ceiling on compassionate ground appointments
8.     Extend the benefit of Bonus Act,1965 amendment on enhancement of payment ceiling to the adhoc Bonus/PLB of Central Government employees with effect from the Financial year 2014-15
9.   Ensure Five promotions in the service career of an employee
10.  Do not amend Labour Laws in the name of Labour Reforms which will take away the existing benefits to the workers
11.  Revive JCM functioning at all level

Saturday, 13 February 2016

కా.ఎస్.కె.వ్యాస్ ప్రథమ వర్థంతి


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల అగ్ర నాయకులు కా. ఎస్. కె.వ్యాస్ ప్రథమ వర్థంతి సభ 13.2.2016 న హైదరాబాద్ లో ఏఐబిడిపిఏ హైదరాబాద్ జిల్లా శాఖ అధ్వర్యంలో జరిగింది. కా.ఎస్.కె.వ్యాస్ కు సభ శ్రద్ధాంజలి సమర్పించింది. ఏఐబిడిపిఏ జాతీయ ఉపాధ్యక్షులు కా. పి.అశోకబాబు, సర్కిల్ కార్యదర్శి కా.రామచంద్రుడు, జిల్లా కార్యదర్శి కా. టి.శేషయ్య ప్రసంగీంచారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల ఉద్యమానికి కా. ఎస్.కె.వ్యాస్ చేసిన సేవలను వివరించారు. తిరుపతిలో జరిగిన ఏఐబిడిపిఏ అఖిల భారత మహాసభ తీర్మానాలను వివరించారు.

Thursday, 11 February 2016

782.శాతం డి ఏ మెర్జర్ ప్రకారం పెన్షన్ రివిజన్ కు ఆర్డర్సు ఇవ్వాలని కోరుతూ మార్చి 10 న ప్రదర్శనలు నిర్వహించండి

78.2 శాతం డి ఏ మెర్జర్ ప్రకారం పెన్షన్ రివిజన్ కు ఆర్డర్సు ఇవ్వాలని కోరుతూ మార్చి 10 న ప్రదర్శనలు జరపాలని ఫిబ్రవరి 2,3 తేదీలలో తిరుపతిలో జరిగిన ఏ ఐ బి డి పి ఏ అఖిల భారత మహాసభ పిలుపునిచ్చింది. న్యాయ మంత్రిత్వ శాఖ నుండి కేబినెట్ నొత్ డి ఓ టి కి వచ్చింది. దాని పై ప్రాసెస్ జరుగుతున్నది. డి ఓ టి సెక్రెటరీ మరియు మంత్రి ఆమోదం అనంతరం కేబినెట్ కు పంపిస్తామని హామీ యిచ్చారు. ఫైలు త్వరగా వెళ్ళి కేబినెట్ ఆమోదం లభించేందుకు ఏ ఐ బి డి పి ఏ ప్రయత్నిస్తున్నది. డి ఓ టి మరియు ప్రభుత్వము పై ఒత్తిడి కొనసాగించేందుకు మార్చి 10న ప్రదర్శనలకు ఏ ఐ బి డి పి ఏ పిలుపునిచ్చింది. ఈ ప్రదర్శనలను జయప్రదముగా నిర్వహించండి. 

Wednesday, 10 February 2016

7వ వెరిఫికేషన్ లో బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కు అఖండ విజయం చేకూర్చేందుకు ఏ ఐ బి డి పి ఏ శాఖలు, సభ్యులు కృషి చేయాలి

2016 మే 10 న బి ఎస్ ఎన్ ఎల్ లో 7వ సారి యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దేన్నికలలో బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కు అఖండ విజయం చేకూర్చేందుకు కృషి చేయాలని తిరుపతి లో ఫిబ్రవరి 2,3 తేదీలలో జరిగిన ఏ ఐ బి డి పి ఏ అఖిలా భారత మహాసభ పిలుపునిచ్చింది. ఏ ఐ బి డి పి ఏ శాఖలు, సభ్యులు అందరూ ఇందుకు తగిన విధముగా బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కు అన్నీ విధాలా మద్దతునివ్వాలి. బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులలో తమకి తెలిసిన వారందరికి బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు కి వోటు వేయాలని చెప్పాలి. బి ఎస్ ఎన్ ఎల్ ను, పెన్షన్ ను కాపాడేందుకు ఐక్యపోరాటం మరింత బలపడాలన్నా, కార్మిక వర్గాన్ని, పెన్షనర్లను ఇబ్బందులపాలు చేస్తున్న సరళీకృత ఆర్థిక విధానాలకు వ్యతిరేకముగా కార్మిక వర్గ ఐక్య పోరాటం బలపడాలన్నా, బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు 1 మరియు పెన్షనర్లకు 1.1.2017 నుండి వేతన సవరణ, పెన్షన్ సవరణ జరగాలన్నా మే 10న జరుగు యూనియన్ గుర్తింపు ఎన్నికలలో బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కు 50 శాతం పైగా వోట్లు వచ్చి ఏకైక గుర్తింపు యూనీయంగా గెలవటం అవసరం. ఇందుకు పెన్షనర్లందరు కృషి చేయాలి. 

Tuesday, 9 February 2016

బి ఎస్ ఎన్ ఎల్ ను, పెన్షన్ ను కాపాడుకునేందుకు ఉద్యమించుదాం


తిరుపతి లో ఫిబ్రవరి 2,3 తేదీలలో జరిగిన ఆల్ ఇండియా బి ఎస్ ఎన్ ఎల్-డి ఓ టి పెన్షనర్స్ అసోసియేషన్ అఖిల భారత మహాసభ పిలుపు
టెలికాం డిపార్ట్మెంటు నుండి పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్య దేశ వ్యాపితముగా 2 లక్షలమంది పైనే వుంటుంది. వీరిలో టెలికాం డిపార్ట్మెంటులో చేసి 1.10.2000 లోగా  రిటైరయిన వారు, ఆ తరువాత బి ఎస్ ఎన్ ఎల్ లో రిటైరయిన వారు వున్నారు. అత్యధికులు బి ఎస్  ఎన్ ఎల్ లో రిటైరయిన  వారే. వీరి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ (ఆంధ్ర మరియు తెలంగాణ కలిపి) లో 23000  మంది వున్నారు. ఇది దాదాపు బి ఎస్ ఎన్ ఎల్ లో సర్వీసులో వున్న వారితో సమానం. పెన్షనర్ల సంఖ్య పెరుగుతుండటం తో పాటు ప్రభుత్వ విధానాల వలన వారి సమస్యలు కూడా పెరుగుతున్నాయి.
వాజపాయి ప్రభుత్వము 1.10.2000 న అప్పటి వరకు టెలికాం డిపార్ట్మెంటు అధీనం లో నడుస్తున్న టెలికాం సర్వీసులను నిర్వహించేందుకు బి ఎస్ ఎన్ ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) పేరుతో ఒక ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేసింది. సమాజ శ్రేయస్సు రీత్యా  అందించే సేవలకు వచ్చే నష్టాలకు పూర్తి పరిహారం చెల్లించి బి ఎస్ ఎన్ ఎల్ ను నష్టాలపాలు కాకుండా కాపాడతామని హామీ యిచ్చింది. అప్పటివరకూ డి ఓ టి లో ప్రభుత్వ ఉద్యోగులుగా వుండి  1.10.2000 నుండి బి ఎస్ ఎన్ ఎల్ లో విలీనమై ప్రభుత్వ ఉద్యోగి హోదాను కోల్పోయిన ఉద్యోగులందరికి డి ఓ టి  మరియు బి ఎస్ ఎన్ ఎల్ సర్వీసు మొత్తం కలిపి ప్రభుత్వ రూల్సు  ప్రకారం ప్రభుత్వమే పెన్షన్ చెల్లిస్తుందని హామీ యిచ్చింది.
కానీ వెంటనే ఈ రెండు హామీలకు తూట్లు పొడిచే కార్యక్రమం ప్రారంభించింది. గ్రామీణ ల్యాండ్ లైన్స్ పై బిఎస్ఎన్ఎల్ కు వచ్చే నష్టాలకు ఇచ్చే పరిహారాన్ని కొద్ది సంవత్సరాలకే పరిమితం చేసే “ప్యాకేజి” విధానాన్ని ప్రకటించింది. మరో వంక ప్రయివేటు టెలికాం కంపెనీలకు మొబైల్ సర్వీసుల నిర్వహణకు 1994 నుండే లైసెన్సులిచ్చిన ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ కు మొబైల్ సర్వీసులందించేందుకు 2002 నుండి మాత్రమే  అనుమతించి వెనుకబడేలా చేసింది. మొబైల్ సర్వీసులకు అవసరమయిన స్పెక్ట్రమ్ కేటాయింపులలో ప్రయివేటు టెలికాం కంపెనీలకు అనేక అక్రమ రాయితిలిచ్చింది. బి ఎస్ ఎన్ ఎల్ ను దెబ్బ తీసేందుకు వాజపాయి ప్రభుత్వము అనుసరించిన ఈ విధానాలను ఆ తరువాత వచ్చిన యు పి ఏ ప్రభుత్వము కొనసాగిస్తూ వచ్చింది. వాజపాయి హయాములో ప్రయివేటు టెలికాం కంపెనీలకు స్పెక్ట్రమ్ కేటాయింపులలో జరిగిన అక్రమాలు మరింత పెద్ద ఎత్తున పెరిగి యు పి ఏ హయాములో నాటి కమ్యూనికేషన్సు మంత్రి ఏ.రాజా ద్వారా జరిగి “2 జి కుంభకోణం” గా పేరొందాయి. ఇంతేగాక మొబైల్ రంగం లో కొద్ది కాలం లోనే ఎయిర్టెల్ తో పోటీగా సర్వీసులిస్తున్న బి ఎస్ ఎన్ ఎల్ ను దెబ్బతీసేందుకు మొబైల్ సర్వీసుల విస్తరణకు అవసరమయిన ఎక్విప్మెంటు కొననీయకుండా బి ఎస్ ఎన్ ఎల్ కు అనేక ఆటంకాలు సృష్టించి 5వ స్థానానికి దిగజారేలా చేసింది. వాజపాయి ప్రభుత్వము ప్రకటించిన “ప్యాకేజీ” విధానాన్ని దాని కాల పరిమితి ముగియగానే 2006-07 నుండి ఆపు చేసి గ్రామీణ ల్యాండ్ లైన్స్ పై వచ్చే నష్టాలకు పరిహారం చెల్లించటం ఆపి వేసింది. బి ఎస్ ఎన్ ఎల్ కు స్పెక్ట్రమ్ ఉచితముగా ఇవ్వాలనే విధాన నిర్ణయానికి భిన్నముగా 3జి మరియు బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ పేరుతో బి ఎస్ ఎన్ ఎల్ నుండి ఋ.18500 కోట్లు వసూలు చేసి దాని వద్ద వున్న నగదు నిల్వలను హరించి వేసింది. దీనికి తోడు బి ఎస్ ఎన్ ఎల్ మేనేజిమెంటు నిర్వాకం తోడయింది. 2013-14 లో బి ఎస్ ఎన్ ఎల్ కు ల్యాండ్ లైన్స్ పై వచ్చిన నష్టం రు. 14000 కోట్లు కాగా నికర నష్టం రు.7019 కోట్లే. ఇందులో గ్రామీణ ల్యాండ్ లైన్స్ పై వచ్చిన నష్టం సుమారు రు.10000 కోట్లు వుంటుంది. ఇచ్చిన హామీ ప్రకారం ఈ నష్టానికి పరిహారం ఇస్తే బి ఎస్ ఎన్ ఎల్ కు నష్టాలు వచ్చే సమస్య వుండదు. ఈ విధముగా ప్రభుత్వ విధానాల కారణముగా బి ఎస్ ఎన్ ఎల్ 2009-10 నుండి నష్టాలతో నడుస్తున్నది. మోడి ప్రభుత్వాము బి ఎస్ ఎన్ ఎల్ కు నష్టాలు కలిగించే ఈ  విధానాలు కొనసాగించటమే గాక బి ఎస్ ఎన్ ఎల్ నుండి 62000 మొబైల్ సర్వీసుల టవర్సు విడగొట్టి విడిగా ఒక టవర్ కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. క్రమముగా దానిని ప్రయివేటు పరం చేయటమే  అసలు ఉద్దేశం. డిజిటల్ ఇండియా కార్యక్రమం లో భాగముగా బి ఎస్ ఎన్ ఎల్ కు అప్పగించిన నేషనల్ ఆప్టిక్ ఫైబర్ లేయింగ్ పనిని దానినుండి తప్పించి ప్రయివేటు కంపెనీలకు అప్పగించేందుకు పావులు కడుపుతున్నది.
బి ఎస్ ఎన్ ఎల్ కు నష్టాలు రావాటం వలన  డి ఓ టి లో ఆ తరువాత బి ఎస్ ఎన్ ఎల్ లో రిటైరయిన పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపు విషయములో కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వాజపాయి ప్రభుత్వ హయాములోనే డి ఓ టి మరియు బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపుకు  కావాల్సిన నిధుల  భారాన్ని బి ఎస్ ఎన్ ఎల్ పై మోపే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చివరికి 2006 లో ప్రభుత్వము ఈ విషయములో కేబినెట్ ఆమోదముతో ఒక ఆర్డరు జారీ చేసింది. దీని ప్రకారం బి ఎస్ ఎన్ ఎల్ మరియు ఎం టి ఎన్ ఎల్ ల నుండి  ప్రభుత్వానికి లభించే లైసెన్సు ఫీజు, డివిడెండ్లు మరియు బి ఎస్ ఎన్ ఎల్ నుండి లభించే కార్పొరేట్ పన్ను, ఎక్సైజ్ డ్యూటీ, మరియు సర్వీసు పన్ను—వీటన్నింటి మొత్తము లో  60 సాతమే  పెన్షన్ ఖర్చుగా ప్రభుత్వము భరిస్తుందని, అంతకు మించిన మొత్తాన్ని బి ఎస్ ఎన్ ఎల్ భరించాలని  ఈ ఆర్డర్ లో ఆదేశించింది. 2011-12 నుండి పెన్షన్ ఖర్చు ఈ 60 శాతం మించి పోయింది.
మరో వంక వాజపాయి ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు వేతన సవరణ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్స్ కు పెన్షన్ సవరణ జరుగుతుందనే ఆర్డర్ ఇవ్వలేదు. కాబట్టి 1.1.2007నుండి  బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు 68.8 శాతం డి ఏ మెర్జర్ ప్రకారం వేతన  సవరణ అమలులోకి వచ్చిన అనంతరం పెన్షనర్సుకు ఆ ప్రకారం పెన్షన్ సవరణ చేసేందుకు నాటి యు పి ఏ ప్రభుత్వము మొదట అంగీకరించలేదు. ఆ పరిస్థితిలో బి ఎస్ ఎన్ ఎల్ మరియు డి ఓ టి పెన్షనర్సు కు  ఎదురవుతున్న సమస్యలపై పోరాడేందుకు బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ చొరవతో 21.10.2009 న న్యూ ఢిల్లీలో జరిగిన అఖిల భారత మహాసభలో ఆల్ ఇండియా బి ఎస్ ఎన్ ఎల్-డి ఓ టి పెన్షనర్స్ అసోసియేషన్” (ఏ ఐ బి డి పి ఏ) ఏర్పడింది. బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ మరియు ఏ ఐ బి డి పి ఏ ల చొరవతో జరిగిన  ఉద్యమం వలన చివరికి ప్రభుత్వము 15.3.2011న 1.1.2007 కి ముంది రిటైరయిన బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సుకు 1.1.2007 నుండి బేసిక్ పెన్షన్ కు 68.8 శాతం డి ఏ కలిపి ఆ మొత్తం పై  30 శాతం వెయిటేజి కలిపి పెన్షన్ రివైజ్ చేసేందుకు  ఆర్డర్సు ఇచ్చింది.
ఇతర ప్రభుత్వ రంగ సంస్థలలో 1.1.2007 నుండి జరిగిన వేతన సవరణ 78.2 శాతం డి ఏ మెర్జర్ ప్రకారం జరగగా బి ఎస్ ఎన్ ఎల్ మేనేజిమెంటు,  నష్టాలు వస్తున్నాయనే సాకుతో 68.8 శాతం డి ఏ మెర్జర్ పై మాత్రమే మొదట వేతన సవరణ చేసింది. చివరికి బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ చొరవతో జరిగిన ఐక్య ఉద్యమం వలన 78.2 శాతం డి ఏ మెర్జర్ పై వేతన సవరణకు అంగీకరిస్తూ 10.6.2013న ఆర్డర్సు ఇచ్చింది. కానీ 1.1.2007 నుండి 9.6.2013 వరకు చెల్లించాల్సిన బకాయిలను సంస్థకు నష్టాలు వస్తున్నాందున చెల్లించలేమని అన్నది.  ఇది 10.6.2013 తరువాత రిటైరయిన పెన్షనర్సుకు కూడా వర్తించింది. ఎందుకంటే వారికి రిటైరయ్యే ముందు  మూల వేతనం 78.2 శాతం డి ఏ మెర్జర్ ప్రకారం చెల్లించబడింది గనుక. కానీ 1.1.2007నుండి 78.2 శాతం డి ఏ మెర్జరు అమలులోకి వచ్చినా 10.6.2013 లోగా రిటైరయిన వారికి వారు రిటైరయ్యేనాటికి  వున్న మూల వేతనం 78.2 శాతం డి ఏ మెర్జర్ ప్రకారం చెల్లించబడలేదు కాబట్టి,  చెల్లించబడని మూల వేతనం పై పెన్షన్ రాదు కాబట్టి,  వారి విషయములో కేబినెట్ అనుమతి అవసరమని ప్రభుత్వము నిర్ణయించింది. ఇంతేగాక పెన్షన్ ఖర్చు,  పైన తెలియజేసిన 60 శాతం కు మించినందున ఆ విధముగా మించిన ఖర్చును బి ఎస్ ఎన్ ఎల్ చెల్లించాలి కాబట్టి అది ఏ విధముగా చెల్లిస్తుందో చెప్పాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభ్యంతరం తెలియజేసింది. ఈ  విధముగా బి ఎస్ ఎన్ ఎల్ లో 1.10.2000 నుండి 9.6.2013 వరకు రిటైరయిన వారికి 78.2 శాతం డి ఏ మెర్జర్ ప్రకారం పెన్షన్ రివిజన్ ప్రధాన సమస్యగా ముందుకు వచ్చింది.  ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంఘాలు  చేసిన పోరాటం ఫలితముగా అందుకు మంత్రి వర్గ అనుమతి కోసం తయారు చేయబడిన “కేబినెట్ నోట్”న్యాయ మంత్రిత్వ శాఖ నుండి ఇటీవలే డి ఓ టి కి వచ్చింది. దీనిని వెంటనే కేబినెట్ కు పంపించి ఆమోదింపజేయాలని పెన్షనర్లు,  ఉద్యోగులు కోరుతున్నారు.
బి ఎస్ ఎన్ ఎల్ నష్టాలతో నడుస్తున్నందున ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అవుట్ పేషెంట్  ట్రీట్మెంటు కోసం మూడు మాసాలకొకసారి చెల్లించే మెడికల్ అలవెన్సును బి ఎస్ ఎన్ ఎల్ మేనేజిమెంటు ఆపు చేసింది. అవుట్ పేషెంట్  ట్రీట్మెంటుకు  బిల్సు పెడితే రూల్సు  లో వున్న పరిమితికి లోబడి చెల్లిస్తామని మేనేజిమెంటు అన్నది. కానీ రిటైరయిన  వారు ఎప్పటికప్పుడు ఆ విధముగా బిల్సు సమర్పించటం కష్టం కాబట్టి అలవెన్సు చెల్లింపు విధానాన్ని పునరుద్ధరించాలని పెన్షనర్లు కోరుతున్నారు.
పై సమస్యలకి తోడు బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సుకు మరో ముఖ్య సమస్య ఎదురవుతున్నది. 1.1.2017 నుండి బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు వేతన సవరణ జరగాలి. ఆ ప్రకారమే  పెన్షనర్సుకు పెన్షన్ సవరణ జరగాలి. కానీ ప్రభుత్వము ఆ విధముగా వేతన సవరణ తో పాటు పెన్షన్ సవరణ జరిగే విధముగా ఇంతవరకు అంగీకరించలేదు. ఇంతేగాక నష్టాలు కొనసాగితే వేతన సవరణ సాధ్యం కాదని ఇటీవలే బి ఎస్ ఎన్ ఎల్ సి ఎం డి ఒక ప్రకటన చేశారు.  ఉద్యోగులకు వేతన సవరణ చేయకపోతే పెన్షనర్సుకు పెన్షన్ సవరణ కూడా జరగని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయివేటీకరణ విధానాలలో భాగముగా బి ఎస్ ఎన్ ఎల్ ఏర్పడినందున ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక వంక కేంద్ర ప్రభుత్వోద్యోగులకు మరియు పెన్షనర్సుకు  ఏడవ వేతన సంఘం సిఫార్సులు 1.1.2016 నుండి అమలు జరుగుతుండగా గతం లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా వున్న బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 1.1.2017 నుండి జరగాల్సిన వేతన మరియు పెన్షన్ సవరణ విషయం లో అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
బి ఎస్ ఎన్ ఎల్ ను నష్టాలపాలు చేసే విధానాలను యజమానిగా వున్న ప్రభుత్వము అనుసరిస్తుండగా అందుకు వ్యతిరేకముగా పొరాడి నష్టాలనుండి బయటపడే ప్రయత్నాన్ని ఉద్యోగులు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ వారితో పాటు పెన్షనర్లు చేసిన ఐక్య పోరాటాల ఫలితముగా కొంత మేరకు మొబైల్ సర్వీసుల విస్తరణకు అవసరమయిన ఎక్విప్మెంటు కొనటం జరిగింది. ఇటీవల కాలం లో కొత్తగా మొబైల్ సర్వీసు కనెక్షన్లు ఇచ్చే విషయములో బి ఎస్ ఎన్ ఎల్ చెప్పుకోతగిన పురోగతిని సాధించింది. 2014-15 లో బి ఎస్ ఎన్ ఎల్ కు నిర్వహణ లాభం ( వర్తమాన సంవత్సరపు ఆదాయం వ్యయం కన్నా ఎక్కువ) రు.672 కోట్లు వచ్చింది. కానీ ఎక్విప్మెంటు భవనాలు తదితరాల అర్రూగుదల ఖర్చు లెక్క అధికముగా చూపాల్సి వచ్చినందున రు. 8200 కోట్లు నికర నష్టం వచ్చింది. ఏమయినప్పటికి ప్రభుత్వ విధానాలు కొంత మారిటే బి ఎస్ ఎన్ ఎల్ లాభాలబాట పడుతుంది. కాబట్టి వేతన సవరణను పెన్షన్ సవరణను నిరాకర్రించే ఆలోచనను ప్రభుత్వము మరియు మేనేజిమెంటు విరమించాలి.
బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సు కు ప్రత్యేకముగా ఏర్పడిన పై సమస్యలతో పాటు అసలు పెన్షన్ చెల్లించే బాధ్యతనుండి ప్రభుత్వాలు తప్పుకునే విధానం ప్రారంభం కావటం మరో పెద్ద సమస్య. ఇప్పటికే 1.1.2004 నుండి రిక్రూటయిన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వము పెన్షన్ చెల్లించే విధానం రద్దయింది. కాంగ్రెస్, బి జె పి లు కలిసి చేసిన పని ఇది. ఇంతేగాక కాంగ్రెస్ మరియు బి జె పి లు కలిసి పారమెంటులో ఆమోదించిన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ దేవలప్మెంట్ అథారిటీ చట్టం ప్రకారం భవిష్యత్తులో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రభుత్వము తన పెన్షనర్సుకు పెన్షన్ చెల్లించే బాధ్యతనుండి తప్పుకుని ఆ పనిని ప్రయివేటు పెన్షన్ ఫండ్ కంపెనీలకు అప్పగించవచ్చు. ఈ విధముగా ప్రభుత్వము పెన్షన్ చెల్లించే విధానానికి ముప్పు ఏర్పడింది. పెన్షన్ నిధులను ప్రయివేటు పరం, విదేశీ పరం చేయటమే ఈ విధానాల సారాంశం.
ఈ సమస్యలన్నింటి పై తిరుపతి లో 2016 ఫిబ్రవరి 2, 3 తేదీలలో జరిగిన ఆల్ ఇండియా బి ఎస్ ఎన్ ఎల్-డి ఓ టి పెన్షనర్స్ అసోసియేషన్ 2వ అఖిల భారత మహాసభ సమీక్షించింది. ఈ మహాసభ కు దేశ వ్యాపితముగా అన్ని  రాష్ట్రాల నుండి 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మహాసభకు ఏ ఐ బి డి పి ఏ అఖిల భారత అధ్యక్షులు కా.ఏ.కె.భట్టాచార్జీ అధ్యక్షత వహించారు. సి ఐ టి యు అఖిల భారత ఉపాధ్యక్షులు మరియు పార్లమెంటు సభ్యులు కా.టి.కె.రంగరాజన్ మహాసభను ప్రారంభించారు. ఏ ఐ బి డి పి ఏ ప్రధాన కార్యదర్శి కా. కె.జి.జయరాజ్ సమర్పించిన నివేదిక పై అన్ని  రాష్ట్రాలనుండి ప్రతినిధులు చర్చలలో పాల్గొన్నారు. బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కా. పి.అభిమన్యు మరియు ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్ (పెన్షనర్స్& రిటైరీస్) తరఫున కా.వి.ఏ.ఎన్.నంబూదిరి, ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ ఎం ఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కా.కె.రాఘవేంద్రన్  పాల్గొని సందేశం ఇచ్చారు. బిఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ మరియు ఏ ఐ బి డి పి ఏ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ (ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా కలిపి) మరియు చిత్తూరు జిల్లా శాఖలు ఈ మహాసభ జయప్రదమయ్యేందుకు తగిన ఏర్పాట్లు చేశాయి. చిత్తూరు జిల్లా సి ఐ టి యు కార్యకర్తలు కూడా మహాసభ ఏర్పాట్లకు తోడ్పడి  కార్మిక వర్గ ఐక్యతను ఆచరణలో ప్రదర్శించారు. 

బి ఎస్ ఎన్ ఎల్ ను నష్టాలపాలు చేసే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకముగా ఉద్యోగులతో కలిసి ఉద్యమించి బి ఎస్ ఎన్ ఎల్ ను కాపాడుకోవాలని,  78.2 శాతం డి ఏ మెర్జర్ పై ప్రభుత్వము వెంటనే ఆర్డర్సు ఇవ్వాలని, మార్చి 10 న ఇందు కోసం ప్రదర్శనలు నిర్వహించాలని, 1.1.2017 నుండి బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు పెన్షనర్సుకు వేతన సవరణ మరియు పెన్షన్ సవరణ కు ప్రభుత్వము అంగీకరించాలని, ఈ లోగా డి ఏ ని బేసిక్ పెన్షన్ తో మెర్జీ చేయాలని,  మూడు నెలలకొకసారి చెల్లించే మెడికల్ అలవెన్సును పునరుద్ధరించాలని, పెన్షన్ ప్రయివేటీకరణ విధానాలను విరమించాలని, 60 సంవత్సరాలు దాటిన అన్నీ రంగాల కార్మికులకు ప్రజలకు  భద్రతతో కూడిన  పెన్షన్ సౌకర్యం కల్పించాలని, మోడి హయాములో పెరుగుతున్న మతోన్మాదాన్ని వ్యతిరేకించి మత సామరస్యాన్ని లౌకిక తత్వాన్ని కాపాడాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక ప్రజావ్యతిరేక సరళీకరణ విధానాలకు వ్యతిరేకముగా కార్మిక వర్గం చేసే ఐక్య పోరాటాలలో బి ఎస్ ఎన్ ఎల్ మరియు డి ఓ టి పెన్షనర్లు భాగస్వాములవ్వాలని, సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మె లో కార్మిక వర్గం ల్చేసిన 12 డిమాంద్సు పై పెన్షనర్సులో విస్తృత ప్రచారం చేయాలని  మహాసభ తీర్మానించింది. పెన్షనర్లకు సంబంధించిన అనేక ఇతర సమస్యలపై తీర్మానాలను ఆమోదించింది. 

11.4.2016 నుండి కేంద్ర ప్రభుత్వోద్యోగుల నిరవధిక సమ్మె

7 వ వేతన సంఘం వేతనం మరియు పెన్షన్ విషయములో చేసిన సిఫార్సులను మెరుగుపరచాలని కోరుతూ 11.4.2016 నుండి నిరవధిక సమ్మె చేయాలని రైల్వే, పోస్టల్, డిఫెంసు తదితర  అన్నీ రంగాల కేంద్ర  ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది. 

Monday, 8 February 2016

కా.ఎస్.కె.వ్యాస్ సంస్మరణ దినోత్సవం 13.2.2016




ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 13ను  కా.ఎస్.కె.వ్యాస్ సంస్మరణ దినం గా పాటించాలని నవంబరు 2015 లో కలకత్తాలో జరిగిన ఎన్ సి సి పి ఏ (నేషనల్ కొ ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్) అఖిల భారత మహాసభ పిలుపునిచ్చింది. 7వ వేతన సంఘం సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించబడిన ఈ సందర్భములో కా.ఎస్.కె.వ్యాస్ మన మధ్య లేకపోవటం దురదృష్టకరం. మొదటి వేతన సంఘం నుండి 7వ వేతన సంఘం వరకు అన్నీ వేతనసంఘాలతో కా.ఎస్.కె.వ్యాస్ అనుబంధం కలిగి వున్నారు. వేతన సంఘాలతో మరియు పాలకులతో కా.ఎస్.కె.వ్యాస్ తన సహజ మేధాశక్తితో, విజ్ఞతతో  చర్చించారు. భారత దేశ కేంద్ర ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు కా.ఎస్.కె.వ్యాస్ తిరుగులేని నాయకుడు. వారికి ఆయన చేసిన సేవలు చాలా గొప్పవి. కేంద్ర ప్రభుత్వాలు డి ఏ ని లేదా వేతనాలని  స్తంభింపజేయాలని చూసినప్పుడు జె సి ఏం స్టాండింగ్ కమిటీలో కా. ఎస్.కె.వ్యాస్ ఒంటరి కంఠ స్వరం ఇప్పటికీ మన చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నది, మనల్ని ప్రభుత్వ దాడులకు వ్యతిరేకముగా పోరాడేందుకు ప్రోత్సహిస్తున్నది. కేంద్ర ప్రభుత్వోద్యోగుల ఉద్యమాన్ని కార్మికోద్యమముతో మిళితం చేసేందుకు కా.ఎస్.కె.వ్యాస్ నిర్వహించిన పాత్ర అమోఘం. నయా ఉదారవాద ఆర్థిక విధానాల దాడులకు వ్యతిరేకముగా కార్మిక వర్గ కేంద్ర ట్రేడ్ యూనియన్లతోపాటు కేంద్ర ప్రభుత్వోద్యోగుల సంఘాలను ఒకే వేదిక పైకి  తీసుకు రావటం లో కా.వ్యాస్ నిర్వహించిన పాత్ర ఎల్లప్పుడు గుర్తుంచుకోతగినది.  కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల అత్యున్నత సంస్థ ఎన్ సి సి పి ఏ ని ఏర్పాటు చేసినది కా.ఎస్.కె.వ్యాస్.
13.2.2016న కా.ఎస్.కె.వ్యాస్ సంస్మరణ దినాన్ని సమావేశాలు నిర్వహించటం ద్వారా అమలు చేయాలని ఎన్ సి సి పి ఏ పిలుపునిస్తున్నది.
కె.కె.ఎన్.కుట్టి
సెక్రెటరీ జనరల్, ఎన్ సి సి పి ఏ
13.2.2016న కా. ఎస్.కె.వ్యాస్ సంస్మరణార్థం సమావేశాలు జరిపి ఆయన చేసిన సేవలను సంస్మరించుకోవాలని, దానితోపాటు తిరుపతిలో ఫిబ్రవరి 2,3 తేదీలలో జరిగిన ఏ ఐ బి డి పి ఏ అఖిల భారత మహాసభ పై నివేదికను ఇచ్చి మహాసభ చేసిన తీర్మానాలను వివరించాలని ఏ ఐ బి డి పి ఏ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ శాఖ అన్ని జిల్లా శాఖలకు విజ్ఞప్తి చేస్తున్నది
అభినందనలతో
రామచంద్రుడు, సర్కిల్ కార్యదర్శిఏ ఐ బి డి పి ఏ

పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ ను ఇంటర్నెట్ ద్వారా పంపించవచ్చు- 2.2.2016న ప్రభుత్వము ఇచ్చిన ఆర్డర్సు

Now Life Certificate for Pensioners can be provided by digital process. The Press Release issued by the Ministry of Communications and IT dated 02-02-2016 is reproduced below:

Government of India

Ministry of Communications & Information Technology
02-February-2016 15:00 IST
Jeevan Pramaan- A Hit With Pensioners 
Jeevan Pramaan (https://jeevanpramaan.gov.in/) provides a big relief to all pensioners. A pensioner can now digitally provide Annual Life Certificate to the authorities for continuity of pension instead of presenting himself physically or through a Life Certificate issued by specified authorities every year. Lakhs of pensioners on various schemes are already benefitting from it.
             Launched by the Prime Minister on 10th Nov 2014, nearly 12.5 Lakhs pensioners have registered for Digital Life Certificate (DLC) in about a year. Interestingly the enrolled pensioners come from different districts of the country showing the interest the facility has generated all over the country including in far flung rural and hilly districts. Started with Civil pensioners of Central Government only, several other pensioner schemes have adopted Jeevan Pramaan and provide this facility of Digital Life Certificate to these pensioners. Presently apart from civil Central Government employees, Defence services, Employees’ Provident Fund Organization (EPFO), Post Offices, Railways, Defence Pensioners Disbursement Office (DPDOs), several PSUs including Mumbai Port Trust, Chennai Port Trust and New Delhi Municipal Council are providing this service.
State Governments have also recognized the potential of Jeevan Pramaan and adopted the service. State Governments of Haryana, Himachal Pradesh, Telangana, Madhya Pradesh, Maharashtra, Punjab, Pondicherry, Odisha, Andaman & Nicobar, Rajasthan and Jharkhand have already started providing these services.
Jeevan Pramaan service is provided by NIC through a Central Portal developed on Open source. The platform is highly scalable. Developed using in-house manpower, the portal has been developed and maintained free of cost to all the user agencies and is also free for pensioners. 
            In Jeevan Pramaan a pensioner can digitally show that he or she is alive using his/her biometrics. Biometric devices are available in CSC’s, Bank branches, Pensioner associations, Govt. offices etc. More over any citizen can also purchase a finger print scanner and do the identification from home. A typical finger print scanner currently costs around Rs. 2600/- only and the prices are expected to come down in future. The usefulness of Jeevan Pramaan will increase even further as the biometric authentication device gets integrated with mobile phones.
            All pension disbursing organizations, which have a requirement of periodic life certificate to continue disbursing pension are welcome to join this free offering.
            For more details they are required contact Ms Nandita Chaudhri, DDG, NIC (Email: )