Monday, 8 February 2016

కా.ఎస్.కె.వ్యాస్ సంస్మరణ దినోత్సవం 13.2.2016




ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 13ను  కా.ఎస్.కె.వ్యాస్ సంస్మరణ దినం గా పాటించాలని నవంబరు 2015 లో కలకత్తాలో జరిగిన ఎన్ సి సి పి ఏ (నేషనల్ కొ ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్) అఖిల భారత మహాసభ పిలుపునిచ్చింది. 7వ వేతన సంఘం సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించబడిన ఈ సందర్భములో కా.ఎస్.కె.వ్యాస్ మన మధ్య లేకపోవటం దురదృష్టకరం. మొదటి వేతన సంఘం నుండి 7వ వేతన సంఘం వరకు అన్నీ వేతనసంఘాలతో కా.ఎస్.కె.వ్యాస్ అనుబంధం కలిగి వున్నారు. వేతన సంఘాలతో మరియు పాలకులతో కా.ఎస్.కె.వ్యాస్ తన సహజ మేధాశక్తితో, విజ్ఞతతో  చర్చించారు. భారత దేశ కేంద్ర ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు కా.ఎస్.కె.వ్యాస్ తిరుగులేని నాయకుడు. వారికి ఆయన చేసిన సేవలు చాలా గొప్పవి. కేంద్ర ప్రభుత్వాలు డి ఏ ని లేదా వేతనాలని  స్తంభింపజేయాలని చూసినప్పుడు జె సి ఏం స్టాండింగ్ కమిటీలో కా. ఎస్.కె.వ్యాస్ ఒంటరి కంఠ స్వరం ఇప్పటికీ మన చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నది, మనల్ని ప్రభుత్వ దాడులకు వ్యతిరేకముగా పోరాడేందుకు ప్రోత్సహిస్తున్నది. కేంద్ర ప్రభుత్వోద్యోగుల ఉద్యమాన్ని కార్మికోద్యమముతో మిళితం చేసేందుకు కా.ఎస్.కె.వ్యాస్ నిర్వహించిన పాత్ర అమోఘం. నయా ఉదారవాద ఆర్థిక విధానాల దాడులకు వ్యతిరేకముగా కార్మిక వర్గ కేంద్ర ట్రేడ్ యూనియన్లతోపాటు కేంద్ర ప్రభుత్వోద్యోగుల సంఘాలను ఒకే వేదిక పైకి  తీసుకు రావటం లో కా.వ్యాస్ నిర్వహించిన పాత్ర ఎల్లప్పుడు గుర్తుంచుకోతగినది.  కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల అత్యున్నత సంస్థ ఎన్ సి సి పి ఏ ని ఏర్పాటు చేసినది కా.ఎస్.కె.వ్యాస్.
13.2.2016న కా.ఎస్.కె.వ్యాస్ సంస్మరణ దినాన్ని సమావేశాలు నిర్వహించటం ద్వారా అమలు చేయాలని ఎన్ సి సి పి ఏ పిలుపునిస్తున్నది.
కె.కె.ఎన్.కుట్టి
సెక్రెటరీ జనరల్, ఎన్ సి సి పి ఏ
13.2.2016న కా. ఎస్.కె.వ్యాస్ సంస్మరణార్థం సమావేశాలు జరిపి ఆయన చేసిన సేవలను సంస్మరించుకోవాలని, దానితోపాటు తిరుపతిలో ఫిబ్రవరి 2,3 తేదీలలో జరిగిన ఏ ఐ బి డి పి ఏ అఖిల భారత మహాసభ పై నివేదికను ఇచ్చి మహాసభ చేసిన తీర్మానాలను వివరించాలని ఏ ఐ బి డి పి ఏ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ శాఖ అన్ని జిల్లా శాఖలకు విజ్ఞప్తి చేస్తున్నది
అభినందనలతో
రామచంద్రుడు, సర్కిల్ కార్యదర్శిఏ ఐ బి డి పి ఏ

No comments:

Post a Comment