ఏఐబిడిపిఏ ఎడ్వైజర్ కా.నంబూదిరి, డిఓటి సెక్రెటరీ శ్రీ జె.ఎస్. దీపక్ ను 31.3.2016 న కలిసి 10.6.2013 కి ముందు రిటైరయిన పెన్షనర్సుకు 78.2% డి ఏ మెర్జర్ అమలు చాలా ఆలస్యమయిందని, వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కేబినెట్ నోట్ తన టేబుల్ పై వున్నదని, త్వరలో పంపిస్తామని సెక్రెటరీ అన్నారు. పెన్షన్ రివిజన్ విషయంలో ఇబ్బంది కలిగిస్తున్న 60:40ఆర్డరును రద్దు చేసేందుకు తగిన చర్య తీసుకోవాలని కా. నంబూదిరి విజ్ఞప్తి చేశారు.
78.2 శాతం డిఎ మెర్జర్ పై మార్చి నెల లో కా.నంబూదిరి డిఓటి సెక్రటరీనికలవటం ఇది రెండవ సారి. ఇంతేగాక 9.3.2016 న ఈ సమస్య పై కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ ను కూడా కా.నంబూదిరికలిశారు.
ఈ చర్చల ఫలితంగా కేబినెట్ నోట్ ను డిఓటి సెక్రెటరీ త్వరలో మంత్రి/ కేబినెట్ ఆమోదానికి ఇంకా ఆలస్యం చేయకుండా త్వరలో పంపిస్తారని ఆశిస్తున్నాము.
No comments:
Post a Comment