పెన్షనర్లకు
78.2% డి ఏ మెర్జర్ పై పెన్షన్ చెల్లింపుకు ఆర్డర్సు
పెన్షన్
చెల్లింపుకు ఇబ్బంది కలిగించే 60 శాతం
ఆర్డరు రద్దుకు అంగీకారం
ఉద్యోగుల, పెన్షనర్ల ఐక్య పోరాటానికి ఘన విజయం
1.10.2000 నుండి 9.6.2013 వరకు రిటైరయిన బి ఎస్ ఎన్ ఎల్
పెన్షనర్సు (డి ఓ టి నుండి బి ఎస్ ఎన్ ఎల్ లో విలీనమయిన తరువాత రిటైరయిన వారు) మరియు
ఫ్యామిలీ పెన్షనర్సుకు 78.2 శాతం డి ఏ
మెర్జర్ పై పెన్షన్ చెల్లింపుకు 5.7.2016న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం
ఆమోదించింది. ఇందుకనుగుణముగా డిఓటి, 18.7.2016న ఆర్డర్సు ఇచ్చింది. ఈ ఆర్డర్సు ప్రకారం డిఓటి నుండి బి ఎస్
ఎన్ ఎల్ లో విలీనమయిన అనంతరం 1.10.2000 నుండి 1.1.2007 లోగా రిటైరయిన
పెన్షనర్లు/ఫ్యామిలీ పెన్షనర్లకు 1.1.2007 నాటి పెన్షన్/ఫ్యామిలీ
పెన్షన్(కమ్యూటెడ్ పోర్షన్ తో కలిపి) కు 78.2శాతం డియర్నెస్ రిలీఫ్ కలిపి ఆ మొత్తం
పై 30 శాతం కలిపి ఆ విధముగా వచ్చిన మొత్తాన్ని రివైజ్డ్ పెన్షన్ గా లెక్కించాలి.
అయితే 1.1.2007 నుండి 9.6.2013 వరకు ఈ పెరుగుదల నోషనల్ గా జరుగుతుంది. 10.6.2013
నుండి ఎరియర్సు చెల్లించబడతాయి. 1.1.2007 నుండి 9.6.2013 లోగా రిటైరయిన
పెన్షనర్లు/ఫ్యామిలీ పెన్షనర్లకు 1.1.2007
నుండి వారి ప్రిరెవైజ్డ్ బేసిక్ పే కి 78.2 శాతం డి ఏ కలిపి ఆ
మొత్తం పై 30 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వారి బేసిక్ పే ని రివైజ్ చేసి దానికి
అనుగుణముగా పెన్షన్ ను రివైజ్ చేయాలి. ఇది 1.1.2007 నుండి 9.6.2013 వరకు నోషనల్ గా
అమలు జరుగుతుంది. 10.6.2013 నుండి ఎరియర్సు చెల్లించబడతాయి.
5.7.2016 న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం, డి ఓ టి మరియు బి ఎస్
ఎన్ ఎల్ పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా
భరించేందుకు అంగీకరించింది. బి ఎస్ ఎన్
ఎల్ మేనేజిమెంటు ఉద్యోగి తరఫున ప్రభుత్వానికి ప్రతి నెలా పెన్షన్ కంట్రిబ్యూషన్
చెల్లిస్తే సరి పోతుంది. అంతకు మించి బి ఎస్ ఎన్ ఎల్ భరించాల్సిన అవసరం లేదని
మంత్రి వర్గం నిర్ణయించింది. అంతకు ముందు 2006 లో ప్రభుత్వము డి ఓ టి ద్వారా
విడుదల చేసిన ఆర్డరు ప్రకారం బి ఎస్ ఎన్ ఎల్ మరియు ఎం టి ఎన్ ఎల్ లు ప్రభుత్వానికి
చెల్లించే లైసెన్సు ఫీజు మరియు డివిడెండు తో పాటు బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వానికి
చెల్లించే కార్పొరేట్ పన్ను, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీసు ట్యాక్స్—ఈ చెల్లింపుల మొత్తం
లో 60 శాతం వరకే డి ఓ టి మరియు బి ఎస్ ఎన్ ఎల్ లో రిటైరయిన వారి పెన్షన్ ఖర్చు
కోసం ప్రభుత్వం భరిస్తుంది. పెన్షన్ ఖర్చు అంతకు మించితే ఆ మించిన మొత్తాన్ని బి
ఎస్ ఎన్ ఎల్ ప్రభుత్వానికి చెల్లించాలి. ఇది ప్రభుత్వానికి బి ఎస్ ఎన్ ఎల్
చెల్లించే పెన్షన్ కంట్రిబ్యూషన్ కు అదనం. పెన్షన్ ఖర్చు 2011-12 నుండి ఈ 60 శాతం
పరిమితి దాటి పోయింది. కాబట్టి ఆర్థిక మంత్రిత్వ శాఖ 78.2 శాతం
డిఎ మెర్జర్ పై పెన్షన్ రివిజన్ విషయం లో అభ్యంతరం లేవనెత్తింది. ఈ ఆర్డరు
కొనసాగితే 1.1.2017 నుండి జరిగే వేతన సవరణ ప్రకారం పెన్షన్ రివిజన్ కు కూడా
ఇబ్బంది కలుగుతుంది. ఈ 60 శాతం ఆర్డరు రద్దుకు ఇప్పుడు ప్రభుత్వము అంగీకరించింది కాబట్టి ఈ
ఇబ్బందులుండవు. బి ఎస్ ఎన్ ఎల్ పై పెన్షన్ ఖర్చులో కొంత భరించాల్సిన బాధ్యత కూడా
వుండదు. పెన్షన్ ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది.
ఈ విధముగా 78.2 శాతం డి ఎ మెర్జర్ పై పెన్షన్ రివిజను
మరియు పెన్షన్ కు ఇబ్బంది కలిగించే 60 శాతం ఆర్డరు రద్దు—ఈ రెండు ఘన విజయాలు
సాధించాము. అయితే ఈ ఘన విజయాలు ఉద్యోగుల, పెన్షనర్ల ఐక్య పోరాటం సాధించిన
ఘన విజయాలు. ఇందులో బి ఎస్ ఎన్ ఎల్
ఎంప్లాయీస్ యూనియన్ మరియు ఎ ఐ బి డి పి ఎ (ఆల్ ఇండియా బి ఎస్ ఎన్ ఎల్/డి ఓ టి
పెన్షనర్స్ అసోసియేషన్) కీలక పాత్ర వహించాయి.
ఇతర యూనియన్లు కలిసి రానప్పటికి 2009 ఆగస్టు 19,20 తేదీలలో బి ఎస్ ఎన్
ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ రెండు రోజులు సమ్మె చేసి నాన్-ఎగ్జిక్యూటివ్సు మరియు
ఎగ్జిక్యూటివ్సు కు 78.2% డి ఎ మెర్జర్ ప్రకారం వేతన సవరణ జరిపే విషయం సానుకూలముగా
పరిశీలించేందుకు మేనేజిమెంటునుండి ఒక హామీని వేతన సవరణ ఒప్పందం లో సాధించింది. ఆ
తరువాత ఫోరం ఆద్వర్యం లో నిరవధిక సమ్మెకు నాన్-ఎగ్జిక్యూటివ్ మరియు ఎగ్జిక్యూటివ్
యూనియన్లు సమైక్యముగా నోటీసునిచ్చిన
అనంతరం 2012 లో మేనేజిమెంటు 78.2 శాతం డి ఎ మెర్జర్ పై వేతన సవరణకు ఇచ్చిన హామీని
అమలు చేసేందుకు అంగీకరించింది. చివరికి 10.6.2013 నుండి సర్వీసులో వున్న
ఉద్యోగులకు ఎరియర్సు చెల్లించే విధముగా 78.2 శాతం డి ఎ మెర్జర్ ప్రకారం వేతన సవరణకు
ప్రభుత్వము ఆర్డర్సు ఇచ్చింది. వెంటనే బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ మరియు ఎ
ఐ బి డి పి ఎ లు 10.6.2013 లోగా రిటైరయిన పెన్షనర్లకు కూడా 78.2 శాతం డి ఎ మెరర్జర్ పై పెన్షన్ రివైజ్ చేయాలని డిమాండ్ చేశాయి. 60
శాతం ఆర్డరు రద్దుకు డిమాండ్ చేశాయి. బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగుల అధికారుల సంఘాల ఐక్య
వేదిక ఫోరం కూడా ఈ డిమాండ్స్ ను లేవనెత్తింది. ఇంతేగాక బి ఎస్ ఎన్ ఎల్ నాన్
ఎగ్జిక్యూటివ్ యూనియన్ల జె ఎ సి 27.11.2014 న చేసిన సమ్మె డిమాండ్స్ లో కూడా 78.2
శాతం డి ఏ మెర్జర్ పై పెన్షన్ చెల్లించాలనే డిమాండ్ వున్నది. . ఫోరం ఆధ్వర్యం లో
బి ఎస్ ఎన్ ఎల్ పరిరక్షణకు 21,22 ఏప్రిల్ 2015న చేసిన మహత్తరమయిన
రెండు రోజుల సమ్మె కి సంబంధించిన డిమాండ్స్ లో పెన్షన్ కు సంబంధించిన ఈ రెండు
డిమాండ్స్ కూడా వున్నాయి. ఈ సమ్మెకి మద్దతుగా ఏ ఐ బి డి పి ఏ ప్రదర్శనలు నిర్వహించింది.
ఈ సమ్మె అనంతరం 1.5.2015న డి ఓ టి సెక్రెటరీ ఫోరం నాయకులతో జరిపిన చర్చలలో 78.2
శాతం డి ఎ మెర్జర్ పై పెన్షన్ రివిజన్ కు కేబినెట్ నోట్ త్వరలో ఫైనలైజ్ చేసి
ప్రభుత్వానికి పంపిస్తామని, 60 శాతం ఆర్డరు రద్దు చేయాలనే
డిమాండ్ ను కూడా సానుకూలముగా పరిష్కరిస్తామని హామీ యిచ్చారు. ఆ తరువాత బి ఎస్ ఎన్
ఎల్ ఎంప్లాయీస్ యూనియను, ఫోరం నాయకులు మరియు ఏ ఐ బి డి పి ఏ
నాయకులు అనేక సార్లు డి ఓ టి అధికారులను, మంత్రిని కలిసి ఈ
డిమాండ్స్ త్వరగా పరిష్కరించాలని ఒత్తిడి చేశారు. చివరికి ఈ రెండు డిమాండ్స్ ను
5.7.2016 న జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఆమోదించింది. ఈ విధముగా 78.2 శాతం
డి ఎ మెర్జర్ కు హామీని ఒంటరిగా పోరాడి బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్
సాధించింది. ఆ తరువాత ఫోరం ఆద్వర్యం లో ఈ డిమాండ్స్ సాధనకు జరిగిన పోరాటం లో కీలక
పాత్ర వహించింది.
ఫోరం చేసిన
పోరాటాలలో ఎ ఐ బి డి పి ఎ కూడా
పాల్గొన్నది. ఇంతేగాక ఏ ఐ బి డి పి ఏ స్వతంత్రముగా అనేక పోరాటాలు నిర్వహించింది.
29.8.2013న ధర్నాలు, 25.10.2013న నిరసన దినం తో పాటు మంత్రికి టెలిగ్రాములు, 20.11.2014 న మార్చ్ టు సంచార్ భవన్ మరియు డి ఓ టి సెక్రెటరీకి మెమోరాండం, మే 2014న ప్రధాన మంత్రికి పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్, 21,22 జులై 2015న సి జి ఏం ఆఫీస్/సీసీఏ ఆఫీసుల వద్ద
రిలే నిరాహార దీక్షలు, 10.3.2016న ధర్నాలు తదితర
కార్యక్రమాలు నిర్వహించింది. 7వ పే కమిషన్ కు పెన్షనర్ల సమస్యలపై సమర్పించిన మెమోరాండం
లో ఏ ఐ బి డి పి ఏ, ఇతర అనేక డిమాండ్స్ తో పాటు ఈ రెండు డిమాండ్స్ ను కూడా సమర్పించింది.
ఈ విధముగా ఉద్యోగులు అధికారులు మరియు పెన్షనర్ల ఐక్య
పోరాటాల వలన ఈ రెండు ఘనవిజయాలు సాధించగలిగాము.ఈ సందర్భముగా 27.7.2016న సమావేశాలు
జరిపి ఈ ఘన విజయం ప్రాముఖ్యతని వివరించటం, మిఠాయిలు పంచతం తదితర
రూపాలలో విజయోత్సవం నిర్వహించాలని బి ఎస్ ఎన్
ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ తో పాటు ఏ ఐ బి డి పి ఏ కూడా పిలుపునిచ్చింది. కాబట్టి
27.7.2016 న అన్ని జిల్లాలలో ఈ విజయోత్సవాన్ని బి ఎస్ ఎన్ ఎల్
ఎంప్లాయీస్ యూనియన్ తో కలిసి ఘనముగా
నిర్వహించాలని ఏ ఐ బి డి పి ఏ జిల్లా కార్యదర్శులందరికి విజ్ఞప్తి చేస్తున్నాము.
రామ చంద్ర్రుడు, సర్కిల్ కార్యదర్శి, ఏ ఐ బి డి పి ఏ ఆంధ్రప్రదేశ్ సర్కిల్
No comments:
Post a Comment