ఈ రోజు ( 13.6.2016) ఏఐబిడిపిఏ జనరల్ సెక్రెటరీ కా.కె.జి.జయరాజ్ , డి ఓ టి లో డిడిజి ఎస్టాబ్లిష్మెంట్ శ్రీ ఎస్.కె.జైన్ తో 78.2 శాతం డి ఎ మెర్జర్ విషయం మాట్లాడారు.
కేబినెట్ సెక్రెటేరియట్ సూచన మేరకు మార్పు చేయబడిన కేబినెట్ నోట్ ను డి ఓ టి సెక్రెటరీ శ్రీ జె.ఎస్.దీపక్ ఈ రోజు ఆమోదించారని శ్రీ జైన్ తెలియజేశారు. మార్చబడిన ఈ కేబినెట్ నోట్ కు హిందీ అనువాదం, అదనంగా పంపించాల్సిన కాపీలు తదితరాలను తయారు చేస్తున్నామని, ఈ పని అయినతరువాత కవరింగ్ లెటరు సంతకానికి డి ఓ టి సెక్రెటరీకి పంపిస్తామని, ఆ తరువాత కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపిస్తామని శ్రీ జైన్ అన్నారు.
ఇప్పటికే 3 సంవత్సరాలయిందని, కొంతమంది పెన్షనర్లు ఈ బెనిఫిట్ లభించకుండానే చనిపోవటం కూడా జరిగిందని, కాబట్టి ఇంకా ఆలస్యం జరగకుండా చూడాలని కా. జయరాజ్, శ్రీ జైన్ కు విజ్ఞప్తి చేశారు. పని త్వరగాఅయ్యేందుకు సాధ్యమయినదంతా చేస్తామని శ్రీ జైన్ హామీ యిచ్చారు.
No comments:
Post a Comment