Friday, 19 February 2016

బి ఎస్ ఎన్ ఎల్ ఇయు విస్తృత కేంద్ర కార్యవర్గ సమావేశం

అహమ్మద్ నగర్ ( మహరాష్ట్ర) లో ఈ రోజు ( 19.2.2016) బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ అఖిలభారత కార్యవర్గ విస్తృత సమావేశం ప్రారంభమయింది. ప్రారంభ సమావేశంలో కేంద్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాకార్యదర్శులతో పాటు మహారాష్ట్ర సర్కిల్ నుండి మొత్తం 1000 మంది పాల్గొన్నారు. మహారాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి కా.కరడ్ కార్మికవర్గమే దేశభక్తి యుత వర్గమని, మతం పేరుతో దేశాన్ని మత రాజ్యంగా మార్చాలని  హిందూత్వ శక్తులు మోడీ ప్రభుత్వ మద్దతుతో ప్రయత్నిస్తున్నాయని, మరో వంక మోడీ ప్రభుత్వము కాంగ్రెస్ అనుసరించిన కార్మిక వ్యతిరేక, ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల ఆర్థికవిధానాలనే మరింత ఉధృతంగా అనుసరిస్తున్నదని  అన్నారు. లౌకిక తత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని, కార్మిక హక్కులను కాపాడేందుకు, ప్రజానుకూల ఆర్థిక విధానాలకోసం కార్మిక వర్గ ఐక్య పోరాటాలు మరింత బలపడాలని, ఇందుకోసం బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ మరింత బలపడాలనిఅన్నారు. బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు కా. బల్బీర్ సింగ్ ప్రసంగీంచారు. బి ఎస్ ఎన్ ఎల్ ఇయు ప్యాట్రన్ కా.నంబూదిరి ప్రసంగీంచారు. 
బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కా.పి.అభిమన్యు, గత 3 సంవత్సరాలలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూనియన్ చేసిన కృషిని వివరించారు. మే 10న జరుగు యూనియన్ గుర్తింపు ఎన్నికలలో బి ఎస్ ఎన్ ఎల్ ఇ యు ని అత్యధిక శాతం ఓట్లతో గెలిపించాల్సిన అవసరాన్ని వివరించారు. 

No comments:

Post a Comment