పిడికిలి బిగించిన కార్మిక సంఘాలు
ఏథెన్స్: సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రీకు దేశ వ్యాప్తంగా 24 గంటల పాటు మంగళవారం సమ్మె జరిగింది. పామె కమ్యూనిస్టు కార్యకర్తలు నేతృత్వంలో సాగిన ఈ సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. గతంలో గ్రీకులో తలెత్తిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు యూరోపియన్ కమిషన్, అంతర్జాతీయ ద్రవ్య నిధితో మూడో బెయిలవుట్ ఒప్పందం జరిగింది. అందులోని అంశాల్లో ఒకటైన వృద్ధాప్య పించనుకు హామీ ఇవ్వాలని అలెక్సిస్ సిఫ్రాస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్లెక్కారు. అనేక ప్రాంతాల్లో గ్రూపులుగా ఏర్పడిన రైతులు జాతీయ రహదారులపై ట్రాక్టర్లను నిలిపేశారు. దీంతో టర్కీ, బల్గేరియాలతో రోడ్డు రవాణా పూర్తిగా స్తంభించింది. దేశ వ్యాప్తంగా ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. దీవులను అనుసంధానం చేసే జల రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. పలు విమానాలు నిలిచిపోయాయి. అత్యవసర రోగులకు మాత్రమే ఆసుపత్రుల్లో వైద్యమందించారు. గ్యాస్ స్టేషన్లను మూసేశారు. న్యాయవాదులు, రైతులు, నావికులు, ఇంజినీర్లు ఈ సమ్మెలో భాగమయ్యారు. గతంలో రెండు సార్లు ఇదే తరహాలో ఇదే డిమాండ్‌తో సమ్మె జరిగింది. ఒప్పందంలోని నిబంధలను అనుసరించి ఇది వరకే ఇస్తున్న 2,700 యూరోల పించన్లో 400 యూరోలు కోత విధించారు. అంతేగాక 384 యూరోల సాధారణ తప్పనిసరి పించనును ఇస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రజలు దీనిపై సంతృప్తిగా లేరు. వామపక్ష ప్రధాని సిప్రాస్ కూడా పించను నిధిని పెంచి కార్మికులకు సామాజిక భద్రత పెంచాలని భావిస్తున్నారు. ఈ బిల్లులో మార్పులు తీసుకురాకపోతే పించన్ వ్యవస్థ నీరుగారుతుందని గతంలోనే ఆయన హెచ్చరించారు. అయితే దీని కోసం ఆ దేశం 1.8 బిలియన్ యూరోలు నిధిని కేటాయించాల్సి ఉంటుంది. వచ్చే నెల నాటికి పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

No comments:
Post a Comment