Thursday, 4 February 2016

దిగ్విజయంగా జరిగిన ఏ ఐ బి డి పి ఏ 2వ అఖిల భారత మహాసభ

తిరుపతి లో కా. ఎస్.కె.వ్యాస్ నగర్ (రామ తులసి కళ్యాణ మండపం) లో 2016 ఫిబ్రవరి 2,3 తేదీలలో ఆల్ ఇండియా బి ఎస్ ఎన్ ఎల్- డి ఓ టి పెన్షనర్సు అసోసియేషన్ 2వ అఖిలా భారత మహాసభ దిగ్విజయముగా జరిగింది. బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు సర్కిల్ కార్యదర్శి కా.జె.సంపత్ రావు మరియు ఏ ఐ బి డి పి ఏ సర్కిల్ కార్యదర్శి కా. రామచంద్రుడు మార్గదర్శకత్వం లో బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు చిత్తూరు జిల్లా కార్యదర్శి కా. వై.ఎస్.రాజు ప్రధాన కార్యదర్శిగా , చిత్తూరు జిల్లా ఏ ఐ బి డి పి ఏ జిల్లా కార్యదర్శి కా. రాజారెడ్డి ఉప ప్రధాన కార్యదర్శి గా ఏర్పడిన ఆహ్వాన సంఘం మహాసభ నిర్వహణకు ప్రశంసనీయమయిన ఏర్పాట్లు చేసింది. మహాసభకు ఏ ఐ బి డి పి ఏ జాతీయ అధ్యక్షులు కా.ఏ.కె.భాత్తాచార్జీ అధ్యక్షత వహించారు. దేశ వ్యాపితముగా అన్నీ సరిల్సు నుండి 1500 మండి ప్రతినిధులు హాజరయ్యారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు మరియు ఏం ఎల్ సి కా.వై.శ్రీనివాసులు రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం పార్లమెంటు సభ్యులు మరియు సి ఐ టి యు జాతీయ ఉపాధ్యక్షులు కా. టి.కె.రంగరాజన్ మహాసభను ప్రారంభించారు. కా. పి.అభిమన్యు (బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు ప్రధాన కార్యదర్శి), కా. వి.ఏ.ఎన్.నంబూదిరి (అడ్వైజర్, ఏ ఐ బి డి పి ఏ), కా.పి.విచంద్రశేఖరన్ (ప్యాట్రన్ , ఏ ఐ బి డి పి ఏ) కా. అనిమేష్ మిత్రా (సెక్రెటరీ జనరల్, బి ఎస్ ఎన్ ఎల్ క్యాజువల్/కాంట్రాక్ట్ వర్కర్స్ ఫెడరేషన్), కా. కె.రాఘవేంద్రన్ ( ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా పోస్టల్ & ఆర్ ఏం ఎస్ పెన్షనర్స్ అసోసియేషన్), కా.ఏం.ఎన్.రెడ్డి ( సీనియర్ టెలికాం నాయకులు మరియు ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి) మరియు కా. జె.సంపత్ రావు సహాయ ప్రధాన కార్యదర్శి మరియు సర్కిల్ సెక్రెటరీ, బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు) బహిరంగ సభలో ఉపన్యసించారు. ఆహ్వానసంఘం ప్రధాన కార్యదర్శి కా. వై.ఎస్.రాజు వందన సమర్పణ చేశారు.
అనంతరం ప్రతినిధుల సభ ప్రారంభమయింది. కా.ఏ.కె.భట్టాచార్జీ అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి కా.కె.జి.జయరాజ్ సమర్పించిన నివేదికను, కోశాధికారి కా.కుంజనందన్ సమర్పించిన ఆదాయ వ్యయాల పట్టికను మహాసభ ఏకగ్రీవముగా ఆమోదించింది. అన్నీ సర్కిల్సు నుండి ప్రతినిధులు చర్చలలో పాల్గొన్నారు. ఈ చర్చలపై ప్రధాన కార్యదర్శి కా. కె.జి.జయరాజ్ జవాబు ఇచ్చారు.
అనంతరం కా.పి.అశోకబాబు (జాతీయ ఉపాధ్యక్షులు, ఏ ఐ బి డి పి ఏ) కన్వీనరుగా ఏర్పడిన తీర్మానాల కమిటీ, ఈ క్రింది విషయాల పై సమర్పించిన తీర్మానాలను మహాసభ ఏకగ్రీవముగా ఆమోదించింది:
1.     బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సుకు 78.2శాతం డి ఏ మెర్జర్ పై పెన్షన్ రివిజన్ వెంటనే ఆమోదించి అమలు చేయాలి.
2.    బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు, పెన్షనర్సుకు 1.1.2017 నుండి వేతన సవరణ మరియు పెన్షన్ సవరణ చేసేందుకు తగిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. ఈ లోగా డి ఏ ని బేసిక్ పే/పెన్షన్ తో మెర్జీ చేయాలి.
3.    బి ఎస్ ఎన్ ఎల్ ఆర్థిక పటిష్టతకు బి ఎస్ ఎన్ ఎల్ యూనియన్ల ఫోరం చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వము ఆమోదించి బి ఎస్ ఎన్ ఎల్ ను నష్టాలనుండి కోలుకునేలా చేసి లాభాలు వచ్చేలా చేయాలి.
4.      (A) ఏడవ వ వేతన సంఘం పెన్షనర్సు విషయం లో చేసిన సిఫార్సులను ఈ క్రింది విధముగా మెరుగుపరచాలి:
అ) వేతన సవరణకి ముందు రిటైరయిన వారి పెన్షన్ ను వేతన సవరణకి తరువాత రిటరాయిన వారితో సమంగా చేసేందుకు 7వ వేతన సంఘం చేసిన సిఫార్సులను మరింత మెరుగు పరచాలి.
ఆ) పెన్షన్ బేసిక్ పే పై 50 శాతం కాకుండా 60 శాతం ఇవ్వాలి.
ఇ) పెన్షన్ కమ్యూటేషన్ విలువను 15 సంవత్సరాల తరువాత కాకుండా 10 సంవత్సరాల తరువాత పూర్తిగా పునరుద్ధరించాలి.
ఈ) ఫ్యామిలీ పెన్షన్ 50 శాతం ఇవ్వాలి.
ఉ) పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ లను ప్రతి 5 సంవత్సరాలకొక సారి 5 శాతం పెంచాలి. 85 సంవత్సరాల వయసు అనంతరం 10 శాతం, 90 సంవత్సరాల వయసు అనంతరం 20 శాతం పెంచాలి.
ఋ) గ్రాట్యుటి  లెక్కను నెలకి 30 రోజుల ప్రకారం కాకుండా గ్రాట్యుటీ చట్టం లో వున్న ప్రకారం నెలకి 25 రోజుల లెక్కన చేయాలి.
(B) బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సుకు సంబంధించిన ఈ క్రింది డిమాంద్సు పరిష్కరించాలి:
అ) కేంద్ర ప్రభుత్వ పెన్షనర్సు కు జరుగుతున్నా విధముగానే  బి  ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సుకు వేతన సవరణ తో పాటు పెన్షన్ సవరణ తప్పనిసరిగా జరిగే విధముగా ఆర్డర్సు ఇవ్వాలి.
ఆ) ప్రభుత్వానికి బి ఎస్ ఎన్ ఎల్, లైసెన్సు ఫీజు, డివిడెండు, సర్వీసు ఛార్జీలు తదితరాల రూపం లో చెల్లించేదానిలో పెన్షన్ ఖర్చు 60 శాతం దాటితే మిగతాది బి ఎస్ ఎన్ ఎల్ భరించాలనే ఆర్డరు రద్దు చేయాలి. ఇ) బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సుకు క్వార్టర్లి మెడికల్ అలవెన్సు ను పునరుద్ధరించాలి.
ఈ) బి ఎస్ ఎన్ ఎల్/డి ఓ టి పెన్షనర్సుకు నగదు చెల్లింపు అవసరం లేకుండా ఇన్ పేషెంట్ ట్రీట్మెంటుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వుండే విధముగా స్మార్ట్ కార్డ్స్ ఇవ్వాలి.
ఉ) బి ఎస్ ఎన్ ఎల్/డి ఓ టి పెన్షనర్సుకు సంబంధించిన ఇతర డిమాండ్స్ ( వివరాలు తరువాతి పోస్టింగ్ లో ఇవ్వబడును) పరిష్కరించాలి.
5. బి ఎస్ ఎన్ ఎల్ లో పని చేస్తున్న క్యాజువల్/టి ఎస్ ఏం/కాంట్రాక్టు వర్కర్సు డిమాంద్సు పరిష్కరించాలి. బి ఎస్ ఎన్ ఎల్ క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ను అది లేని చోట్ల ఏర్పాటు చేసేందుకు మరియు బలపరచేందుకు ఏ ఐ బి డి పి ఏ శాఖలు,  సభ్యులు సహకరించాలి.
6. మోడి ప్రభుత్వము అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకముగా 12 డిమాండ్స్ తో దేశ వ్యాపితముగా అన్నీ రంగాలలో జరిగిన సార్వత్రిక సమ్మేలో 15 కోట్ల మండి పాల్గొనటం పట్ల మహాసభ హర్షం ప్రకటించింది. కార్మిక వర్గ ఐక్య పోరాటాలను బలపరచాలని, 12 డిమాండ్స్ పై పెన్షనర్స్ లో విస్తృతముగా ప్రచారం చేయాలని తీర్మానించింది.
7. మతోన్మాదుల అసహన చర్యలను మహాసభ ఖండించింది. మతసామరస్యం వర్ధిళ్ళేందుకు ,  లౌకిక తత్వాన్ని కాపాడేందుకు సహకరించాలని తీర్మానించింది.
( తీర్మానాల పూర్తి పాఠాన్ని తరువాతి పోస్టింగులో ఇస్తాము)
అనంతరం మహాసభ రానున్న 3 సంవత్సరాల కాలానికి ఈ క్రింది వారిని ఆఫీసు బెర్రర్సుగా ఏక గ్రీవముగా ఎన్నుకున్నది:
అడ్వైజర్: కా.వి.ఏ.ఎన్.నంబూదిరి (న్యూ ఢిల్లీ)
ప్యాట్రన్ కా.పి.వి.చంద్రశేఖరన్ (కేరళ)
అధ్యక్షులు: కా.ఏ.కె.భట్టాచార్జీ (కలకత్తా)
ఉపాధ్యక్షులు:
1.     కా.పి.అశోకబాబు (ఏ పి)
2.    కా. సుశాంత కుమార్ ఘోష్ (బెంగాల్)
3.    కా. ఎస్.మోహన్ దాస్ (తమిళనాడు)
4.    కా.ప్రబీర్ దత్తా (నార్త్ ఈస్ట్ –II)
5.    కా.సుప్రియా మిత్రా (కలకత్తా)
6.    కా.ఎస్.సి.శ్రీవాస్తవ (మధ్యప్రదేశ్)
ప్రధానకార్యదర్శి : కా.కె.జి.జయరాజ్ (కేరళ)
సహాయ ప్రధాన కార్యదర్శి :
1.     కా.డి.బాసు (కలకత్తా)
2.    కా. ఏం.ఆర్.దాస్ (అస్సాం)
3.    కా.జి.జి.పాటిల్ (కర్ణాటక)
4.    కా.కె.గోవిందరాజ్ (చెన్నై)
కోశాధికారి : కా.ఆర్.అరవిందాక్షన్ నాయర్ (కేరళ)
ఆర్గనైజింగ్ సెక్రెటరీ
1.     కా.కె.పి.శర్మ (రాజస్తాన్)
2.    కా.స్వస్తికా దాస్ గుప్తా (కలకత్తా)
3.    కా. కాళి ప్రసాద్ (తమిళనాడు)
4.    కా.కుల్దిప్ సింగ్ (హర్యానా)
5.    కా.ఆర్.వి.సింగ్ (యు పి –వెస్ట్)
6.    కా.ఏం.బి.చనియారా(గుజరాత్)
మహాసభ జయప్రదముగా జరిగేందుకు తగిన ఏర్పాట్లను ప్రశంసనీయముగా చేసినా ఆహ్వాన సంఘానికి మహాసభ అభినందనలు తెలియజేసింది.




No comments:

Post a Comment