బి ఎస్ ఎన్ ఎల్ నష్టాలలో వున్నది కాబట్టి 1.1.2017 న జరగాల్సిన వేతన సవరణ జరుగుతుందా లేదా? ఒక వేళ వేతన సవరణ సాధ్యం కాకపోతే పెన్షన్ సవరణ అదే తేదీ నుండి సాధ్యమవుతుందా? ఈ ప్రశ్న లేవనెత్తి కొందరు ఇప్పుడే దానికి జవాబు ను ఇస్తున్నారు. వేతన సవరణతో సంబంధం లేకుండా పెన్షన్ సవరణ జరగాలని అంటున్నారు. అతిగా ఆలోచిస్తే నష్టం జరుగుతుందనేడానికి వీరు ఒక ఉదాహరణ. బి ఎస్ ఎన్ ఎల్ లో ఐ డి ఏ పే స్కేల్సు అమలులో వున్నాయి. ఈ స్కేల్సు ప్రకారం వచ్చే బేసిక్ పే కేంద్ర ప్రభుత్వోద్యోగులకు సి డి ఏ పే స్కేల్సు పై వచ్చే బేసిక్ పే కన్నా ఎక్కువగా వుంటుంది. కాబట్టి ఐ డి ఏ పే స్కేల్సు ప్రకారం పెన్షన్ కూడా ఎక్కువ. కాబట్టి ఐ డి ఏ పే స్కేల్సు ప్రకారం వేతన సవరణ జరిగి దాని పై పెన్షన్ సవరణ జరిగితే పెన్షన్ ఎక్కువ వస్తుంది. అలా కాకుండా ఐ డి ఏ వేతన సవరణ తో సంబంధం లేకుండా పెన్షన్ సవరణ జరగాలనటం లో అర్థం సి డి ఏ పే స్కేల్సు ప్రకారం కేంద్ర ప్రభుత్వోద్యోగులకు వేతన సవరణ జరిగినప్పుడే బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సు కు పెన్షన్ సవరణ జరగాలని కోరటమే. అది జరగాలంటే ముందుగా బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సుకు ఐ డి ఏ పే స్కేల్సు పై ఇస్తున్న పెన్షన్ ను తగ్గించి 1.10.2000 నుండి సి డి ఏ పే స్కేల్సు లో వున్నట్లుగా భావించి ఆ ప్రకారం తక్కువ పెన్షన్ ను నిర్ణయించి ఆ తరువాత కేంద్ర ప్రభుత్వోద్యోగులతోపాటు 1.1.2006నుండి సి డి ఏ పే స్కేల్సు లో వునంట్లుగా భావించి మళ్ళీ దాని ప్రకారం తక్కువ పెన్షన్ నిర్ణయించి ఆ తరువాత 1.1.2016 నుండి కేంద్ర ప్రభుత్వోద్యోగులతో పాటు సి డి ఏ స్కేల్సు, పెన్షన్ రివిజను నిర్ణయించాలి. ఈ విధముగా ఇప్పుడొస్తున్న పెన్షన్ ను సి డి ఏ పే స్కేల్సు ప్రకారం రెండు సార్లు తగ్గించాలి. (1.10.2000 న, 1.1.2007న.). ఒక సారి పెంచాలి(1.1.2016న). దీని వలన నష్టమే జరుగుతుంది. కాబట్టి 1.1.2017 నుండి సర్వీసులో వున్న బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు ఐ డి ఏ పే స్కేల్సు పై పే రివిజను, దాని ప్రకారం పెన్షనర్స్సుకు పెన్షన్ రివిజను జరగాలని పోరాడాలి. మరో మార్గం లేదు.
కానీ గతం లోనే ఐ డి ఏ పే స్కేల్సు పై కాకుండా పెన్షన్ ను తగ్గించి సి డి ఏ పే స్కేల్సు పై ఇవ్వాలని కోరిన గుప్తా గ్రూపు వారు రిటరయిన తరువాత కూడా ఆ తప్పుడు ఆలోచనను వదిలి పెట్టకుండా ఇప్పటికీ బి ఎస్ ఎన్ ఎల్ వేతన సవరణ తో బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సు పెన్షన్ సవరణను ముడి పెట్టకుండా కేంద్ర ప్రభుత్వోద్యోగుల వేతన సవరణ తో ముడి పెట్టాలని కోరుతున్నారు. వీరి కోరిక ప్రకారం అయితే 1.10.2000 న, 1.1.2007న ఐ డి ఏ పే స్కేల్సు లో జరిగిన వేతన సవరణను సి డి ఏ స్కేల్సు స్థాయికి తగ్గించాలి. ఆ తరువాత 2006 లో మరియు 2016 లో సి డి ఏ పే స్కేల్సు ప్రకారం రివైజ్ చేయాలి. ఇదంతా గందరగోళానికి, వస్తున్న పెన్షన్ తగ్గింపుకు, ఇప్పటి వరకు ఐ డి ఏ పే స్కేల్సు పై చెల్లించబడిన ఎక్కువ పెన్షన్ ను రికవరీ చేయటానికి దారి తీస్తుంది.
కాబట్టి ఇటువంటి తప్పుడు సిద్ధాంతాలను పెన్షనర్లు వ్యతిరేకించాలి. 1.1.2017 నుండి బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు వేతన సవరణ, దాని ప్రకారం పెన్షనర్సు కు పెన్షన్ సవరణ జరిగే విధముగా పోరాడాలి.

No comments:
Post a Comment