21.12.2015న ఏ ఐ బి డి పి ఏ జనరల్
సెక్రెటరీ కా. కె.జయరాజ్, డి ఓ టి సెక్రెటరీ
శ్రీ రాకేశ్ గార్గ్ ను కలిసి 78.2% డి ఏ మెర్జర్ పై చర్చించారు. కేబినెట్ నోట్ పై
డి ఓ టి లీగల్ అడ్వైజర్ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తరని,
కాబట్టి వీటిని న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపించామని అన్నారు. (ఈ అభ్యంతరాలు
సమస్యతో ఏ మాత్రము సంబంధము లేనివి. బి ఎస్ ఎన్ ఎల్ సర్వీసులు బాగా లేవని, బి ఎస్ ఎన్ ఎల్ కు ఖాళీ స్థలాలు వున్నాయని తదితర అనవసరమయిన విషయాలు ఈ
అభ్యంతరాలు). డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ అడిగిన ప్రశ్నలకు జవాబు తయారు చేశామని, న్యాయ మంత్రిత్వ శాఖ నుండి ఫైల్ తిరిగి రాగానే కేబినెట్ ఆమోదానికి పంపిస్తామని
డి ఓ టి సెక్రెటరీ అన్నారు. ఈ సమస్య సాధ్యమయినంత త్వరలో పరిష్కారమయ్యేందుకు ఏ ఐ బి
డి పి ఏ మరియు బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు కృషి చేస్తున్నాయి.
No comments:
Post a Comment