కేంద్ర
ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పెన్షన్ సవరణ పై నియమించబడిన 7వ పే
కమిషన్, 19.11.2015న తన నివేదికను ప్రభుత్వానికి
సమర్పించింది.
ఈ
నివేదిక ప్రకారం:
1.
వేతన
సవరణ,
పెన్షన్ సవరణ 1.1.2016 నుండి అమలులోకి
వస్తుంది. (ఉద్యోగుల సంఘాలు వేతన సవరణ 1.1.2014 నుండి జరగాలని డిమాండ్ చేశాయి)
2.
కనీస
వేతనం ఋ.18000/- సిఫార్సు చేసింది.(ఉద్యోగుల సంఘాలు ఋ.26000/- డిమాండ్ చేశాయి).
3.
బేసిక్
పే ని 2.57 రేట్లు పెంచి దానినే 1.1.2016 నుండి కొత్త బేసిక్ పే గా నిర్ణయించాలని
సిఫార్సు చేసింది. ఉనికిలో వున్న కనీస బేసిక్ పే ఋ.7000 ను 1.1.2016 నుండి 2.57
రేట్లు చేసి ఋ.18000 గా నిర్ణయించినందున ఇదే పద్ధతిలో అందరి బేసిక్ పే ని 2.57
రేట్లు పెంచాలని సిఫార్సు చేసింది. ఈ ఫిట్మెంట్ ఫార్ములా ప్రకారం 1.1.2016 నాటి
బేసిక్ మరియు డి ఏ పై పెరుగుదల 14.29 శాతమే. 6వ పే కమిషను ( ఉద్యోగుల సంఘాలు
ఋ.7000 కనీస బేసిక్ ని ఋ.26000 చేయాలని, అనగా ఫిట్మెంట్ 3.7 రేట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాయి)
4.
పెన్షనర్సు
విషయం లో ఈ క్రింది సిఫార్సులు చేసింది:
అ)
ప్రస్తుత పెన్షనర్సు తో సమంగా గత పెన్షనర్సుకు పెన్షన్ పెంచాలి. పే కమిషన్
సిఫార్సుల అమలు తేదీకి ముందు రిటైరయిన వారి పెన్షన్ ను తరువాత రిటైరయిన వారి
పెన్షన్ తో సమంగా పెంచాలనే డిమాండ్ ను పే కమిషన్ అంగీకరించింది.1.1.2016 నాటి
బేసిక్ పెన్షన్ను 2.57 రేట్లు పెంచాలని సిఫార్సు చేసింది.
ఆ)
గ్రాట్యుటీ సిలింగును ఋ.10 లక్షలనుండి ఋ.20 లక్షలకు పెంచింది.
ఇతర
మార్పులు ఏమి లేవు.
కేంద్ర
ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల సంఘాలు
పెన్షనర్సు విషయములో 7 వ పే కమిషన్ సిఫార్సులలో కొన్ని మార్పులను డిమాండ్ చేస్తున్నాయి:
1. బేసిక్ పే ని 2.57 రేట్లకు బదులు 3.7 రేట్లు
పెంచాలి. బేసిక్ పెన్షన్ ను కూడా ఇదే విధముగా
3.7 రేట్లు పెంచాలి.
2.
బేసిక్ పే పై 50 శాతం కు బదులు పెన్షన్ 60 శాతం ఇవ్వాలి.
3.
ఫ్యామిలీ పెన్షన్ 50 శాతం ఇవ్వాలి
4.
పెన్షన్ మఱియు ఫ్యామిలీ పెన్షన్ లను ప్రతి 5 సంవత్సరాలకొక సారి 5 శాతం పెంచాలి. 85
సంవత్సరాల వయసు వచ్చిన అనంతరం 10 శాతం, 90 సంవత్సరాల వయసు అనంతరం 20 శాతం పెంచాలి.
5.
కమ్యూటెడ్ పెన్షన్ ను 10 సంవత్సరాల అనంతరం, లేదా పెన్షనర్ కు 70 సంవత్సరాల వయసు నిండిన అనతరం,
ఏది ముందయితే అప్పుడు పునరుద్ధరించాలి.
6.
గ్రాట్యుటీ లెక్కను నెలకి 30 రోజుల ప్రకారం కాకుండా గ్రాట్యుటీ చట్టం లో వున్న
ప్రకారం నెలకి 25 రోజుల లెక్కన చేయాలి.
కేంద్ర
ప్రభూత్వా ఉద్యోగుల సంఘాలు 7 వ పే కమిషన్ సిఫార్సులలో అనేక మార్పులను కోరుతూ, అందులో భాగముగా పెన్షన్
కు సంబంధించి పైన తెలియజేసిన మార్పులను కోరుతూ జనవరి 19,20,21 తేదీలలో అన్నీ రాష్ట్రాల రాజధానులలో ధర్నాలు చేయాలని, మార్చి మొదటి వారం నుండి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించాయి.
జనవరి
19-21 తేదీలలో జరుగు ధర్నాలలో బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి
చేస్తున్నాము.
No comments:
Post a Comment