Saturday, 30 January 2016

వేతన సవరణ తో ముడి పెట్టకుండా పెన్షన్ సవరణ జరగాలనటం ఏ మేరకు ఉపయోగకరం?

బి ఎస్ ఎన్ ఎల్ నష్టాలలో వున్నది  కాబట్టి 1.1.2017 న జరగాల్సిన వేతన సవరణ జరుగుతుందా లేదా? ఒక వేళ వేతన సవరణ సాధ్యం కాకపోతే పెన్షన్ సవరణ అదే తేదీ నుండి సాధ్యమవుతుందా? ఈ ప్రశ్న లేవనెత్తి కొందరు ఇప్పుడే దానికి జవాబు ను ఇస్తున్నారు. వేతన సవరణతో సంబంధం లేకుండా పెన్షన్ సవరణ జరగాలని అంటున్నారు. అతిగా ఆలోచిస్తే నష్టం జరుగుతుందనేడానికి వీరు  ఒక ఉదాహరణ. బి ఎస్ ఎన్ ఎల్ లో  ఐ డి ఏ  పే స్కేల్సు అమలులో వున్నాయి. ఈ స్కేల్సు ప్రకారం వచ్చే బేసిక్ పే కేంద్ర ప్రభుత్వోద్యోగులకు సి డి ఏ పే స్కేల్సు పై వచ్చే బేసిక్ పే కన్నా ఎక్కువగా వుంటుంది. కాబట్టి ఐ డి ఏ పే స్కేల్సు ప్రకారం పెన్షన్ కూడా ఎక్కువ. కాబట్టి ఐ డి ఏ పే స్కేల్సు ప్రకారం వేతన సవరణ జరిగి దాని పై పెన్షన్ సవరణ జరిగితే పెన్షన్ ఎక్కువ వస్తుంది. అలా కాకుండా ఐ డి ఏ వేతన సవరణ తో సంబంధం లేకుండా పెన్షన్ సవరణ జరగాలనటం లో అర్థం సి డి ఏ పే స్కేల్సు ప్రకారం  కేంద్ర ప్రభుత్వోద్యోగులకు  వేతన సవరణ జరిగినప్పుడే బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సు కు పెన్షన్ సవరణ జరగాలని కోరటమే. అది జరగాలంటే ముందుగా బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సుకు ఐ డి ఏ పే స్కేల్సు పై ఇస్తున్న పెన్షన్ ను తగ్గించి 1.10.2000 నుండి సి డి ఏ పే స్కేల్సు లో వున్నట్లుగా భావించి ఆ ప్రకారం తక్కువ పెన్షన్ ను నిర్ణయించి ఆ తరువాత కేంద్ర ప్రభుత్వోద్యోగులతోపాటు 1.1.2006నుండి సి డి ఏ పే స్కేల్సు లో వునంట్లుగా భావించి మళ్ళీ దాని ప్రకారం తక్కువ పెన్షన్ నిర్ణయించి ఆ తరువాత 1.1.2016 నుండి కేంద్ర ప్రభుత్వోద్యోగులతో పాటు సి డి ఏ స్కేల్సు, పెన్షన్ రివిజను నిర్ణయించాలి. ఈ విధముగా ఇప్పుడొస్తున్న పెన్షన్ ను సి డి ఏ పే స్కేల్సు ప్రకారం రెండు సార్లు తగ్గించాలి. (1.10.2000 న, 1.1.2007న.). ఒక సారి పెంచాలి(1.1.2016న). దీని వలన నష్టమే జరుగుతుంది. కాబట్టి 1.1.2017 నుండి సర్వీసులో వున్న బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు ఐ డి ఏ పే స్కేల్సు పై పే రివిజను, దాని ప్రకారం పెన్షనర్స్సుకు పెన్షన్ రివిజను జరగాలని  పోరాడాలి. మరో మార్గం లేదు.
కానీ గతం లోనే ఐ డి ఏ పే స్కేల్సు పై కాకుండా పెన్షన్ ను తగ్గించి సి డి ఏ పే స్కేల్సు పై ఇవ్వాలని కోరిన గుప్తా గ్రూపు వారు రిటరయిన తరువాత కూడా ఆ తప్పుడు ఆలోచనను వదిలి పెట్టకుండా ఇప్పటికీ బి ఎస్ ఎన్ ఎల్ వేతన సవరణ తో బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సు పెన్షన్ సవరణను ముడి పెట్టకుండా కేంద్ర ప్రభుత్వోద్యోగుల వేతన సవరణ తో ముడి పెట్టాలని కోరుతున్నారు. వీరి కోరిక ప్రకారం అయితే 1.10.2000 న, 1.1.2007న ఐ డి ఏ పే స్కేల్సు లో జరిగిన వేతన సవరణను  సి డి ఏ స్కేల్సు స్థాయికి   తగ్గించాలి. ఆ తరువాత 2006 లో మరియు 2016 లో సి డి ఏ పే స్కేల్సు ప్రకారం రివైజ్ చేయాలి. ఇదంతా గందరగోళానికి, వస్తున్న పెన్షన్ తగ్గింపుకు, ఇప్పటి వరకు ఐ డి ఏ పే స్కేల్సు పై చెల్లించబడిన ఎక్కువ పెన్షన్ ను రికవరీ చేయటానికి దారి తీస్తుంది.
కాబట్టి ఇటువంటి తప్పుడు సిద్ధాంతాలను పెన్షనర్లు వ్యతిరేకించాలి. 1.1.2017 నుండి బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు వేతన సవరణ, దాని ప్రకారం పెన్షనర్సు కు పెన్షన్ సవరణ జరిగే విధముగా పోరాడాలి. 

రేపు 1.2.2016(1.2.2016) తిరుపతి లో ఏ ఐ బి డి పి ఏ జాతీయ కార్యవర్గ సమావేశం

ఆల్ ఇండియా బి ఎస్ ఎన్ ఎల్ -డి ఓ టి పెన్షనర్స్ అసోసియేషన్ (ఏ ఐ బి డి పి ఏ) అఖిలా భారత మహాసభలు 2,3 ఫిబ్రవై 2016 న తిరుపతి లో జరుగుతున్నాయి. ఈ సందర్భముగా రేపు(1.2.2016) తిరుపతి లో ఏ ఐ బి డి పి ఏ జాతీయ కార్య వర్గ సమావేశం జరుగుతుంది. ఇప్పటికే జనరల్ సెక్రెటరీ కా.కె.జి.జయరాజ్ తిరుపతికి చేరుకున్నారు.

డి ఓ టి సెక్రెటరీ గా శ్రీ జె.ఎస్.దీపక్ నియామకం

డి ఓ టి సెక్రెటరిగా వున్న శ్రీ రాకేశ్ గార్గ్ ను ప్రభుత్వము మైనారిటీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమించింది. ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ శాఖ కార్యదర్శిగా వున్న శ్రీ జె.ఎస్.దీపక్ ను డి ఓ టి సెక్రెటరిగా నియమించింది. శ్రీ దీపక్ గతం లో డి ఓ టి లో జాయింట్ సెక్రెటరిగా పని చేశారు. 

బిఎస్ఎన్ఎల్ కు లాభం వస్తేనే వేతన సవరణ అని సిఎండి చేసిన ప్రకటనను వ్యతిరేకించండి

1.1.2017 నుండి జరగాల్సిన వేతన సవరణ బిఎస్ఎన్ఎల్ కు లాభం వస్తేనే జరుగుతుందని సిఎండి ప్రకటించారు. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, పెన్షన్లు ఈ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వము మరియు మేనేజిమెంటు అనుసరిస్తున్న తప్పుడువిధానాలే నష్టాలకు కారణం. దీనిని సాకుగా చూపించి వేతన సవరణ ని మరియు పెన్షన్ సవరణను నిరాకరిస్తే ఉద్యోగులు, పెన్షన్లు సహించరు. పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు. కాబట్టి ప్రభుత్వము, బిఎస్ఎన్ఎల్ మేనేజిమెంటు తమ తప్పుడు వైఖరిని విరమించాలని వేతన సవరణ మరియు పెన్షన్ సవరణలకు ఆమోదించేవారు. ఇందుకు తగిన మార్గదర్శక సూత్రాలను డిపిఇ (డిపార్టుమెంటు ఆఫ్ పబ్లిక్  సెక్టర్ ఎంటర్ప్రైజెస్)ప్రకటించాలి 

Friday, 29 January 2016

7వ వేతన సంఘం సిఫార్సుల అమలు పై సాధికారిక కమిటీ

7వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పెన్షన్ సవరణలపై ఇచ్చిన సిఫార్సుల అమలుపై కేబినెట్ సెక్రెటరీ అధ్యక్షతన వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఒక సాధికారిక కమిటీని ప్రభుత్వము 27.1.2016 న నియమించింది. ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వోద్యోగుల సంఘాలు సమర్పించే అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ సిఫార్సుల ప్రకారం కేంద్ర మంత్రివర్గం  నిర్ణయం తీసుకుంటుంది. 

Thursday, 28 January 2016

ఏ ఐ బి డి పి ఏ అఖిల భారత మహాసభ (తిరుపతి, ఫిబ్రవరి 2,3 ) కార్యక్రమం

ఆల్ ఇండియా బి ఎస్ ఎన్ ఎల్-డి ఓ టి పెన్షనర్స్ అసోసియేషన్ (ఏ ఐ బి డి పి ఏ) 2వత్రైవార్షిక అఖిల భారత మహాసభ తిరుపతి లో 2016 ఫిబ్రవరి 2,3 న జరుగుతుంది. మహాసభ కార్యక్రమం ఈ క్రింది విధముగా వుంటుంది:
బహిరంగ సభ 2.2.2016 ఉదయం 10.00 గం.కు 
స్వాగతోపన్యాసం : శ్రీ వై.శ్రీనివాసులు రెడ్డి ఏం ఎల్ సి, ఆహ్వాన సంఘం అధ్యక్షులు
అధ్యక్షోపన్యాసం: కా. ఏ.కె.భట్టాచార్జీ అధ్యక్షులు ఏ ఐ బి డి పి ఏ
ప్రారంభోపన్యాసం : కా. టి.కె.రంగరాజన్  పార్లమెంటు సభ్యులు, సి ఐ టి యు అఖిల భారత ఉపాధ్యక్షులు
ముఖ్య అతిథులు :
1. శ్రీమతి అన్నీ మోరిస్, మెంబర్(ఫైనాన్స్) డి ఓ టి
2. శ్రీ అనుపమ్ శ్రీవాస్తవ సి ఏం డి, బి ఎస్ ఎన్ ఎల్
3. శ్రీమతి సుజాతా రాయ్ డైరెక్టర్ (హెచ్ ఆర్ డి) బి ఎస్ ఎన్ ఎల్
విశిష్ట అతిథులు :
1. శ్రీ పి.వి.మురళీధర్ సి జి ఏం టి బి ఎస్ ఎన్ ఎల్ ఏ పి సర్కిల్
2. శ్రీ పి.కె.సిన్హా  సి సి ఏ, డి ఓ టి,  ఏ.పి సర్కిల్
3. శ్రీ ఏం.ఎస్.ఏ. న్యూటన్ , జి‌ ఏం టి డి , బి ఎస్ ఎన్ ఎల్, తిరుపతి
వక్తలు
1. కా.కె.కె.ఎన్.కుట్టి సెక్రెటరీ జనరల్, నేషనల్ కొ-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్ సి సి పి ఏ)
2. కా. పి.అభిమన్యు జనరల్ సెక్రెటరీ, బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్
3. కా. వి.ఏ.ఎన్.నంబూదిరి ,  ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్ (పెన్షనర్స్ & రిటైరీస్)
4. కా.అనిమేష్ మిత్రా సెక్రెటరీ జనరల్, బి ఎస్ ఎన్ ఎల్ క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఫెడరేషన్
5. కా. కె.రాఘవేంద్రన్ , జనరల్ సెక్రెటరీ, ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్
6. కా. కె.జి.జయరాజ్ , జనరల్ సెక్రెటరీ, ఏ ఐ బి డి పి ఏ
7. కా.పి.వి.చంద్రశేఖరన్, ప్యాట్రన్, ఏ ఐ బి డి పి ఏ
8. కా.జె.సంపత్ రావు ఏ జి ఎస్ & సర్కిల్ సెక్రెటరీ బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు
వందన సమర్పణ : కా. వై.ఎస్.రాజు ప్రధాన కార్యదర్శి,  ఆహ్వాన సంఘం
ప్రతినిధుల సభ::
2.2.2016 మధ్యాహ్నం 2 గం. నుండి రాత్రి 8 గం. వరకు
3.2.2016 ఉదయం 9గం. నుండి 1 గం. వరకు, మధ్యాహ్నం 2 గం. నుండి సాయంత్రం 5 గం. వరకు


78.2 % డి ఏ మెర్జర్ పై డి ఓ టి మెంబర్ ఫైనాన్స్ తో 28.1.2016 న కా. నంబూదిరి సమావేశం

78.2 శాతం డి ఏ మెర్జర్ పై ఏఐబిడిపిఏ ఎడ్వైజర్ కా. నంబూదిరి 28.1.2016న డి ఓ టి మెంబర్ ఫైనాన్స్ శ్రీమతి అన్నీ మొరేస్ ను కలిసి చర్చించారు. న్యాయ మంత్రిత్వ  శాఖ నుండి కేబినెట్ నోట్ పై వచ్చిన కామెంట్స్ ను పరిశీలిస్తున్నామని, దీనిపై డి ఓ టి సెక్రెటరీ ఆ తరువాత కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి ఆమోదం  లభించిన అనంతరం కేబినెట్ ఆమోదానికి పంపిస్తామని అన్నారు. కేబినెట్ ఆమోదిస్తే 78.2% డి ఏ మెర్జర్ అమలులోకి వస్తుంది. సాధ్యమంత త్వరగా ఇది జరిగేందుకు ఏ ఐ బి డి పి ఏ ప్రయత్నిస్తున్నది. 

Saturday, 9 January 2016

7వ పే కమిషన్ రిపోర్టు- పెన్షనర్స్


కేంద్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలు, పెన్షన్ సవరణ పై నియమించబడిన 7వ పే  కమిషన్, 19.11.2015న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
ఈ నివేదిక ప్రకారం:
1.     వేతన సవరణ, పెన్షన్ సవరణ  1.1.2016 నుండి అమలులోకి వస్తుంది. (ఉద్యోగుల సంఘాలు వేతన సవరణ 1.1.2014 నుండి జరగాలని డిమాండ్ చేశాయి)
2.       కనీస వేతనం ఋ.18000/- సిఫార్సు చేసింది.(ఉద్యోగుల సంఘాలు ఋ.26000/- డిమాండ్ చేశాయి).
3.       బేసిక్ పే ని 2.57 రేట్లు పెంచి దానినే 1.1.2016 నుండి కొత్త బేసిక్ పే గా నిర్ణయించాలని సిఫార్సు చేసింది. ఉనికిలో వున్న కనీస బేసిక్ పే ఋ.7000 ను 1.1.2016 నుండి 2.57 రేట్లు చేసి ఋ.18000 గా నిర్ణయించినందున ఇదే పద్ధతిలో అందరి బేసిక్ పే ని 2.57 రేట్లు పెంచాలని సిఫార్సు చేసింది. ఈ ఫిట్మెంట్ ఫార్ములా ప్రకారం 1.1.2016 నాటి బేసిక్ మరియు డి ఏ పై పెరుగుదల 14.29 శాతమే. 6వ పే కమిషను ( ఉద్యోగుల సంఘాలు ఋ.7000 కనీస బేసిక్ ని ఋ.26000 చేయాలని, అనగా ఫిట్మెంట్ 3.7 రేట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాయి)
4.       పెన్షనర్సు విషయం లో ఈ క్రింది సిఫార్సులు చేసింది:
అ) ప్రస్తుత పెన్షనర్సు తో సమంగా గత పెన్షనర్సుకు పెన్షన్ పెంచాలి. పే కమిషన్ సిఫార్సుల అమలు తేదీకి ముందు రిటైరయిన వారి పెన్షన్ ను తరువాత రిటైరయిన వారి పెన్షన్ తో సమంగా పెంచాలనే డిమాండ్ ను పే కమిషన్ అంగీకరించింది.1.1.2016 నాటి బేసిక్ పెన్షన్ను 2.57 రేట్లు పెంచాలని సిఫార్సు చేసింది.
ఆ) గ్రాట్యుటీ సిలింగును ఋ.10 లక్షలనుండి ఋ.20 లక్షలకు పెంచింది.
ఇతర మార్పులు ఏమి లేవు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మరియు  పెన్షనర్ల సంఘాలు పెన్షనర్సు విషయములో 7 వ పే కమిషన్ సిఫార్సులలో కొన్ని మార్పులను డిమాండ్ చేస్తున్నాయి:
1.  బేసిక్ పే ని 2.57 రేట్లకు బదులు 3.7 రేట్లు పెంచాలి.  బేసిక్ పెన్షన్ ను కూడా ఇదే విధముగా 3.7 రేట్లు పెంచాలి.
2. బేసిక్ పే పై 50 శాతం కు బదులు పెన్షన్ 60 శాతం ఇవ్వాలి.
3. ఫ్యామిలీ పెన్షన్ 50 శాతం ఇవ్వాలి
4. పెన్షన్ మఱియు ఫ్యామిలీ పెన్షన్ లను ప్రతి 5 సంవత్సరాలకొక సారి 5 శాతం పెంచాలి. 85 సంవత్సరాల వయసు వచ్చిన అనంతరం 10 శాతం, 90 సంవత్సరాల వయసు అనంతరం 20 శాతం పెంచాలి.
5. కమ్యూటెడ్ పెన్షన్ ను 10 సంవత్సరాల అనంతరం, లేదా పెన్షనర్ కు 70 సంవత్సరాల వయసు నిండిన అనతరం, ఏది ముందయితే అప్పుడు పునరుద్ధరించాలి.
6. గ్రాట్యుటీ లెక్కను నెలకి 30 రోజుల ప్రకారం కాకుండా గ్రాట్యుటీ చట్టం లో వున్న ప్రకారం నెలకి 25 రోజుల లెక్కన చేయాలి.
కేంద్ర ప్రభూత్వా ఉద్యోగుల సంఘాలు 7 వ పే కమిషన్ సిఫార్సులలో అనేక మార్పులను కోరుతూ, అందులో భాగముగా పెన్షన్ కు సంబంధించి పైన తెలియజేసిన మార్పులను కోరుతూ జనవరి 19,20,21 తేదీలలో అన్నీ రాష్ట్రాల రాజధానులలో ధర్నాలు చేయాలని, మార్చి మొదటి వారం నుండి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించాయి.

జనవరి 19-21 తేదీలలో జరుగు ధర్నాలలో బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

Thursday, 7 January 2016

తిరుపతి లో 2,3 ఫిబ్రవరి 2016 న ఏ ఐ బి డి పి ఏ 2వ అఖిల భారత మహాసభలు


ఆల్ ఇండియా బి ఎస్ ఎన్ ఎల్-డి ఓ టి పెన్షనర్స్ అసోసియేషన్ (ఏ ఐ బి డి పి ఏ) 2వ అఖిల భారత మహాసభలు తిరుపతిలో  కా.ఎస్.కె.వ్యాస్ నగర్  (శ్రీరామ తులసి కళ్యాణమండపం, ఏ పి ఎస్ ఆర్ టి సి బస్ స్టాండ్ వద్ద) లో  జరగబోతున్నాయి. ఏ ఐ బి డి పి ఏ అభ్యర్థన మేరకు  ఈ మహాసభలు ఆంధ్ర ప్రదేశ్ లో నిర్వహించేందుకు బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ మరియు ఏఐబీడీపీఏ ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ శాఖలు నిర్ణయించాయి. కా. జె.సంపత్ రావు సర్కిల్ సెక్రెటరీ బిఎస్ ఎన్ ఎల్ ఈ యు మరియు కా.రామచంద్రుడు సర్కిల్ సెక్రెటరీ ఏ ఐ బి డి పి ఏ  నాయకత్వములో ఇందుకు తగిన ఏర్పాట్లను రెండు సర్కిల్ శాఖలు చేస్తున్నాయి. శాసన మండలి సభ్యులు  శ్రీ వై.శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షులుగా , బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు చిత్తూరు జిల్లా కార్యదర్శి కా.వై.ఎస్.రాజు జనరల్ సెక్రెటరిగా , ఏ ఐ బి డి పి ఏ చిత్తూరు జిల్లా కార్యదర్శి  కా. ఏం. రాజారెడ్డి జాయింట్ జనరల్ సెక్రెటరిగా మరియు కా. ఎస్.ఏం.షరీఫ్ ట్రెజరర్ గా  ఆహ్వాన సంఘం ఏర్పడి పని చేస్తున్నది.
1.2.2016 సాయంత్రం 4 గం.కు ఏ ఐ బి డి పి ఏ కేంద్ర కార్యవర్గ సమావేశం తిరుపతిలో జరుగుతుంది. ఫిబ్రవరి 2,3 తారీఖులలో మహాసభ జరుగుతుంది. మహాసభని పార్లమెంటు సభ్యులు మరియు సి ఐ టి యు ఉపాధ్యక్షులు అయిన శ్రీ టి.కె.రంగరాజన్ ప్రారంభిస్తారు.  మహాసభ ఎజెండా:
1. 4.2.2013 నుండి 1.2.2016 వరకు ఏ ఐ బి డి పి ఏ కార్యకలాపాలపై నివేదిక, దాని పై చర్చ, ఆమోదం
2. 2012-13, 2013-14 మరియు 2014-15 సంవత్సరాలకు సంబంధించిన ఆడిటెడ్ ఏకవుంట్స్ సమర్పణ, చర్చ, ఆమోదం
3. నిర్మాణ విషయాలు
అ) కేంద్రం/సర్కిల్సు/జిల్లా శాఖల పని విధానం
ఆ) ఎన్ సి సి పి ఏ (నేషనల్ కొ ఆర్డినాషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్)
ఇ) టి యు ఐ (పి & ఆర్) [ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్-పెన్షనర్స్ అండ్ రిటైర్డ్]
4. పెండింగ్ సమస్యలు
* పి ఎఫ్ ఆర్ డి ఏ చట్టం రద్దు (పెన్షన్ చెల్లింపును ప్రయివేటు పరమ్ చేసే చట్టం రద్దు)
* బి ఎస్ ఎన్ ఎల్ పునరుద్ధరణ
* బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లకు 78.2% డి ఏ మెర్జర్
* పెన్షన్ అనామలి (1) బి ఎస్ ఎన్ ఎల్ ఏర్పడిన 10 నెలలలోపు రిటరాయిన వారి అనామలి (2) 1.10.2000 న జరిగిన పే రివిజన్ లో సీనియర్లకు తక్కువ జూనియర్లకు ఎక్కువ వచ్చిన కేసులు
* బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లకు క్వార్టర్లి మెడికల్ అలవెన్సు పునరుద్ధరణ
* పెన్షనర్లకు స్టాఫ్ క్వార్టర్సు అద్దె ను బేసిక్ పెన్షన్ లో 10 శాతానికి పరిమితం చేయటం
* డి ఓ టి పెన్షనర్లకు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ కన్సెషన్ వర్తింపు
* గ్రేడ్ 4 ప్రమోషన్ కు బదులు ఇవ్వాల్సిన ఇంక్రిమెంటు
* ఆఖరు ఇంక్రిమెంటు తరువాత సంవత్సర కాలం సర్వీసు చేసిన వారు తదుపరి  ఇంక్రిమెంటు తేదీ నాటికి సర్వీసులో లేకున్నా ఇంక్రిమెంటు ఇవ్వటం
5. 7వ వేతన సంఘం నివేదిక
6. పెన్షన్ కోసం 50% ఐ డి ఏ మెర్జర్
7. 1.1.2017 నుండి బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు జరిగే పే రివిజన్ తో పాటు పెన్షనర్లకు పెన్షన్ రివిజన్
8. అసోసియేషన్ బై లాస్ కు సవరణలు
* అసోసియేషన్ జీవిత కాల సభ్యత్వ రుసుము రు5000/- నుండి రు.1000 కి పెంచటం, సభ్యత్వ రుసుము సంవత్సరానికి రు.100 /- నుండి రు.200/- కి పెంచటం  
* అసోసియేటెడ్ సభ్యుల వార్షిక సభ్యత్వం రు.50/- నుండి రు. 100/- కి పెంచటం (ఫ్యామిలీ పెన్షనర్సు అసోసియేటెడ్ సభ్యులుగా వుండ వచ్చు) మరియు జీవిత కాల సభ్యత్వ రుసుము రు.250/- నుండి రు.500/- కు పెంచటం
* అనుబంధ సంఘాల (ఏ ఐ బి డి పి ఏ  ఏర్పడే నాటికే కొన్ని ప్రాంతాలలో ఉనికిలో వున్న పెన్షనర్ల సంఘాలు) రుసుము రు. 250/- నుండి రు.500/- కి పెంచటం
9. రానున్న 3 సంవత్సరాల కాలానికి ఆఫీసు బేరర్సు ఎన్నిక
10. విధానం, కార్యక్రమం తీర్మానం
11. తీర్మానాలు
12. తదుపరి 3 సంవత్సరాలకు బడ్జెట్ ప్రతిపాదనలు
13. అధ్యక్షుని అనుమతి తో ఇతర ఏ అంశమయినా

ఏ ఐ బి డి పి ఏ అఖిలా భారత అధ్యక్షులు కా.ఏ.కె.భట్టాచార్జీ, ప్రధాన కార్యదర్శి కా. కె.జయరాజ్, అడ్వైజర్ కా. వి.ఏ.ఎన్.నంబూదిరి, ఉపాధ్యక్షులు కా. పి.అశోకబాబు తదితర ఆఫీస్ బేరర్సు  తో పాటు అన్నీ సర్కిల్సు నుండి సర్కిల్ సెక్రెటరీలు మరియు ఎన్నికయిన ప్రతినిధులు పాల్గొంటారు. 

పెన్షనర్లకు 78.2% డి ఏ మెర్జర్ పై డి ఓ టి సెక్రెటరీ ని కలిసిన ఏ ఐ బి డి పి ఏ జనరల్ సెక్రెటరీ కా. కె.జయరాజ్



21.12.2015న ఏ ఐ బి డి పి ఏ జనరల్ సెక్రెటరీ  కా. కె.జయరాజ్, డి ఓ టి సెక్రెటరీ శ్రీ రాకేశ్ గార్గ్ ను కలిసి 78.2% డి ఏ మెర్జర్ పై చర్చించారు. కేబినెట్ నోట్ పై డి ఓ టి లీగల్ అడ్వైజర్ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తరని, కాబట్టి వీటిని న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపించామని అన్నారు. (ఈ అభ్యంతరాలు సమస్యతో ఏ మాత్రము సంబంధము లేనివి. బి ఎస్ ఎన్ ఎల్ సర్వీసులు బాగా లేవని, బి ఎస్ ఎన్ ఎల్ కు ఖాళీ స్థలాలు వున్నాయని తదితర అనవసరమయిన విషయాలు ఈ అభ్యంతరాలు). డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ అడిగిన ప్రశ్నలకు జవాబు తయారు చేశామని, న్యాయ మంత్రిత్వ శాఖ నుండి ఫైల్ తిరిగి రాగానే కేబినెట్ ఆమోదానికి పంపిస్తామని డి ఓ టి సెక్రెటరీ అన్నారు. ఈ సమస్య సాధ్యమయినంత త్వరలో పరిష్కారమయ్యేందుకు ఏ ఐ బి డి పి ఏ మరియు బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు కృషి చేస్తున్నాయి.  

1.1.2016 నుండి 4.5 శాతం పెరిగిన ఐ డి ఏ

బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 1.1.2016 నుండి ఐ డి ఏ 4.5.శాతం పెరిగింది. దీనితో 1.1.2016 నుండి మొత్తం ఐ డి ఏ 112.4 శాతం అయింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇందుకు సంబంధించిన ఆర్డరు ఇచ్చింది. బి ఎస్ ఎన్ ఎల్ దీనిని ఎండార్స్ చేయాల్సి వుంది. డి పి ఈ ఆర్డర్ కు క్లిక్ చేయండి >>>https://drive.google.com/file/d/0BztXX1SBCx0tYjh6RmFkazdBTzA/view?usp=sharing