78.2% డి ఏ మెర్జర్ పై పెన్షన్ రివిజన్, క్వార్టర్లీ మెడికల్ అలవెన్స్ పునరుద్ధరణ,పెన్షన్
అనామలీల పరిష్కారం, బేసిక్ పెన్షన్ తో 100% డి ఏ మెర్జర్, 25% ఇన్టెరిమ్ రిలీఫ్ తో సహా బి ఎస్ ఎన్ ఎల్/డి ఓ టి పెన్షనర్ల డిమాండ్స్
కోసం:
Ø సెప్టెంబరు
ఆఖరులో డిమాండ్స్ పై జిల్లా స్థాయిలో సదస్సులు
Ø సంచార్
భవన్/భారత్ సంచార్ భవన్ వద్ద ప్రదర్శన నవంబరులో (తేదీ తరువాత నిర్ణయించబడుతుంది)
ఏఐబీడీపీఏ కేంద్ర కార్యవర్గ సమావేశం 2014 జులై 29,30 తేదీలలో
అధ్యక్షులు కా.ఏ.కె.భట్టాచార్జీ అధ్యక్షతన కోయంబత్తూరు లో జరిగింది. ఏఐబీడీపిఏ
కోయంబత్తూరు జిల్లా కార్యదర్శి కా.ఎల్.ఉమాపతి అధ్వర్యములో ఏర్పడిన ఆహ్వానసంఘం ఈ
సమావేశం విజయవంతముగా జరిగేందుకు మంచి ఏర్పాట్లు చేసింది. సమావేశానికి, భోజన వసతులకు అన్నీ ఏర్పాట్లు రైల్వే స్టేషన్ కు అతి సమీపములో వున్న
జీవన్ జ్యోతి ఆశ్రమములో జరిగాయి.
29వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఏఐబీడీపిఏ తమిళనాడు సర్కిల్ సెక్రెటరీ
స్వాగతోపన్యాసం అనంతరం సమావేశాన్ని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సెక్రెటరీ
జనరల్ కా.ఆర్.ముత్తుసుందరం ప్రారంభించారు. ఈ ప్రారంభ సమావేశం లో ఏఐబీడీపిఏ అడ్వైజర్
కా.వీఏఎన్ నంబూదిరి, సిఐటియు తమిళనాడు కార్యదర్శి కా.ఎస్.కృష్ణమూర్తి,ఏఐబీడీపిఏ ప్రధాన కార్యదర్శి కా.కె.జి.జయరాజ్,
నివేదిక సమర్పిస్తున్న ప్రధాన కార్యదర్శి కా.కె.జి.జయరాజ్, వేదికపై కా.వీఏఎన్.నంబూదిరి, కా.ఏ.కె.భట్టాచార్జీ
బీఎస్ఎన్ఎల్ఈయు తమిళనాడు సర్కిల్ కార్యదర్శి కా.ఎస్.చెల్లప్ప, బీఎస్ఎన్ఎల్ఈయు చెన్నై సర్కిల్ కార్యదర్శి కా.కె.గోవిందరాజ్
ప్రసంగించారు. ఏ ఐ బి డి పి ఏ కార్యవర్గ సమావేశానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఏఐబీడీపిఏ చేస్తున్న కృషికి పూర్తి
మద్దతు తెలియజేస్తూ బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు ప్రధానకార్యదర్శి కా.పి.అభిమన్యు పంపిన
సందేశాన్ని కా.సి.కె.నరసింహన్ చదివి వినిపించారు.
ప్రసంగిస్తున్నకా.పి.అశోకబాబు (అఖిలభారత ఉపాధ్యక్షులు), కా.రామచంద్రుడు(సర్కిల్ కార్యదర్శి),
హాజరయిన కేంద్ర కార్యవర్గ సభ్యులు
కా.పి.అశోకబాబు (ఉపాధ్యక్షులు) కన్వీనరుగా, కా.సుశాంత ఘోష్ (ఉపాధ్యక్షులు) మరియు కా.ఏం.ఆర్.దాస్(
అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ) సభ్యులుగా ఏర్పడిన తీర్మానాల కమిటీ ప్రతిపాదించిన ఈ క్రింది
తీర్మానాలను సమావేశం ఏకగ్రీవముగా ఆమోదించింది:
1.
78.2 శాతం డీఏ మెర్జరు పై పెన్షన్ రివిజన్, క్వార్టర్లీ
మెడికల్ అలవెన్సు పునరుద్ధరణ, పెన్షన్ అనామలీలు, డి ఓ టి పెన్షనర్సుకు
రు.2500 ఎఫ్ ఏం ఏ (ఫిక్సెడ్ మెడికల్ అలవెన్స్) తదితర పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం
2.
7వ పే కమిషన్ కు బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సుతో సహా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల
ఉమ్మడి డిమాండ్స్ మరియు బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సుకు
ప్రత్యేకముగా వున్న సమస్యలపై సమర్పించిన మెమోరాండం పై
3.
1.1.2004 తరువాత రిక్రూటయిన కేంద్ర ప్రభుత్వోద్యోగులకు అమలులో వున్న
నష్టదాయకమయిన నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి వారికి కూడా సిసిఎస్(పెన్షన్) రూల్సు
ప్రకారం ప్రభుత్వమే పెన్షన్ చెల్లించాలని కోరుతూ
4.
పశ్చిమ బెంగాల్ లో బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు మరియు పెన్షనర్సుతో సహా
తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు మరియు నాయకులపై చేస్తున్న దాడికి
వ్యతిరేకముగా.
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు బి ఎస్ ఎన్ ఎల్/డి ఓ టి పెన్షనర్ల
సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని బలపరచేందుకు, ముందుకు తీసుకు వెళ్ళేందుకు
ఏఐబీడీపీఏ ని బలపరచాలనే దృఢ నిశ్చయముతో, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి
పటిష్టమయిన ఉద్యమాన్ని నిర్మించాలనే దృఢ నిశ్చయముతో సమావేశం ముగిసింది.

No comments:
Post a Comment