Monday, 11 August 2014

విజయవాడలో 9.8.2014న జరిగిన ఏ ఐ బి డి పి ఏ కృష్ణా జిల్లా సర్వ సభ్య సమావేశం

ఏ ఐ బి డి పి ఏ కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశం విజయవాడలో 9.8.2014న జిల్లా అధ్యక్షులు కా.ఆర్.మాధవరావు అధ్యక్షతన జరిగింది. 250 మంది పైగా సభ్యులు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి కా.సిహెచ్.బాలరాజు, జిల్లా కోశాధికారి కా.బి.మోహన్ రావు తమ నివేదికలు సమర్పించారు. సర్కిల్ అధ్యక్షులు కా.వి.సాంబశివరావు దేశ రాజకీయ పరిస్థితిలో మంచి మార్పు తెచ్చేందుకు ఉద్యోగులు, పెన్షనర్సు పని చేయాల్సిన అవసరం వుందని అన్నారు. కా.ఎల్.రమేష్ బాబు (బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు జిల్లా కార్యదర్శి), కా.కె వి ఆర్ ఆర్ ప్రసాద్( బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు ఎస్ టి ఎస్ ఆర్ కార్యదర్శి), కా.ఏనోక్ (ఏ ఐ బి ది పి ఏ గుంటూరు జిల్లా కార్యదర్శి తమ సందేశాలు ఇచ్చారు. సి ఐ టి యు నగర అధ్యక్షులు కా.ఆర్.అజయకుమార్ బ్యాంకింగు, ఇన్సూరెన్సు, పెన్షన్ రంగాలతో సహా మన దేశ ద్రవ్యరంగాన్ని ప్రయివేటు పరం చేసి విదేశీ ఆధిపత్యం మన ద్రవ్యరంగములో పెరిగే విధముగా మోడి ప్రభుత్వము అనుసరిస్తున్న వినాశాక్ర విధానాలను, అందు వలన పెన్షన్ కు వచ్చే ప్రమాదాన్ని వివరించారు. మన ద్రవ్య వ్యవస్థను, మన పెన్షన్ ను కాపాడుకునేందుకు పోరాడాలన్నారు.

ముఖ్య అతిథిగా కా.పి.అశోకబాబు(అఖిల భారత ఉపాధ్యక్షులు, ఏ ఐ బి డి పి ఏ) ఈ సమావేశానికి హాజరై ప్రసంగించారు. 78.2% డి ఏ మెర్జర్ పై 1.10.2000 నుండి 9.6.2013 వరకు రిటైరయిన బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సుకు పెన్షన్ రివిజన్ అమలు జరిగే విషయములో ఏఐబిడిపిఏ చేస్తున్న కృషిని వివరించారు. సాధ్యమంత త్వరలో ఈ సమస్య పరిష్కారానికి అన్నీ విధాలా ప్రయత్నిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల డిమాండ్స్ పై బి సి పి సి (భారత్ సెంట్రల్ పెన్షనర్స్ కాన్ఫేడరేషన్- దీనికి ఏ ఐ బి డి పి ఏ అనుబంధ సంస్థ) సమర్పించిన మెమోరాండం లో వున్న అమృయు బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్ల డిమాండ్స్ పై 7వ పే కమిషన్ కు సమర్పించిన మెమోరాండం లో వున్న అంశాలను, బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సుకు ప్రత్యేకముగా వున్న సమస్యలపై ఏఐబిడీపీ 7వ పే కమిషన్ కు సమర్పించిన మెమోరాండం లో వున్న డిమాండ్స్ ను వివరించారు. ఈ డిమాండ్సును విస్తృతముగా ప్రచారం చేసేందుకు ఏ ఐ బి డి పి ఏ జిల్లా శాఖలన్నీ సెప్టెంబరు ఆఖరులో సదస్సులు నిర్వహించాలని కోయంబత్తూరులో జరిగిన ఏ ఐ బి డి పి ఏ కేంద్ర కార్యవర్గ సమావేశం పిలుపునిచ్చిందని అన్నారు. ఈ సమావేశం ఇచ్చిన పిలుపుననుసరించి బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సు  డిమాండ్సు పరిష్కారం కోసం 20.11.2014న ఢిల్లీ లో సంచార్ భవన్/బిఎసెనెల్ భవన్ వద్ద జరుగు ప్రదర్శనలో పెన్షనార్లు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రక్షణ, రైల్వే, ఇన్సూరెన్సు, బ్యాంకింగు, పెన్షన్ రంగాలలో పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి మన దేశ ఆర్థిక వ్యవస్థను స్వదేశీ విదేశీ బడా పెట్టుబడిదారుల స్వాధీనం చేసి ప్రజా ప్రయోజనాలకు, ఉద్యోగుల మరియు పెన్షనర్ల ప్రయోజనాలకు, దేశ రక్షణకు మోడి ప్రభుత్వము ముప్పు టెస్టునందని, ఈ విధానాలకు వ్యతిరేకముగా అజృగే పోరాటాలలో పెన్షనర్లు కూడా పాల్గొనాలని అన్నారు. బి ఎస్ ఎన్ ఎల్ ను పునరుద్ధరించే పేరుతో ఉద్యోగులలో అత్యధికులను సర్ప్లస్ గా ప్రకటించేందుకు డిలాయిట్ కన్సల్టెన్సీ ఇచ్చిన సిఫార్సులకు వ్యతిరేకముగా 12.8.2014న బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగుల, అధికారుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యములో జరుగు ప్రదర్శనలలో బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లు కూడా పాల్గొనాలని ఏ ఐ బి డి పి ఏ పిలుపునిచ్చిందని అన్నారు.

కా.ఎన్.శ్యాంప్రసాద్ (ఉపాధ్యక్షులు, ఏ ఐ బి డి పి ఏ కృష్ణా జిల్లా) వందన సమర్పణతో సమావేశం ముగిసింది
ఈ సమావేశం దృశ్యాలు కొన్ని:


హాజరయిన సభ్యులు


కా.పి.అశోకబాబు ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు



కా.వి.సాంబశివరావు సర్కిల్ అధ్యక్షులు

కా.ఆర్.మాధవరావు జిల్లా అధ్యక్షులు






కా.సిహెచ్.బాలరాజు జిల్లా కార్యదర్శి

కా.బి.మోహన రావు, జిల్లా కోశాధికారి


కా.ఎల్.రమేష్ బాబు జిల్లా కార్యదర్శి 




కా.ఆర్.అజయకుమార్ సి ఐ టి యు
 నగర అధ్యక్షులు 






ధన్యవాదాలు తెలియజేస్తున్న కా.ఎన్.శ్యాంప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షులు 





No comments:

Post a Comment