శాంతి కాలంగా పరిగణించబడుతున్న గత ఏడు దశాబ్దాల్లో ఒక లెక్క ప్రకారం ఇంత వరకు జరిగిన 248 సాయుధ చర్యల్లో మూడు కోట్ల మందికి పైగా మరణించినట్లు వాషింగ్టన్ బ్లాగ్లో డేవిడ్ స్వాన్సన్ పేర్కొన్నారు. వాటిలో 201 దురాగతాలు అమెరికన్లు ప్రారంభించినవే. మరణించిన మూడు కోట్ల మందిలో అమాయక పిల్లలు, వృద్ధులు, సాధారణ పౌరులు 90 శాతం మంది ఉన్నారు. అంటే హిట్లర్ నాజీల కంటే అమెరికన్లు ఎక్కువ మందిని చంపారు. ఈ సాయుధ చర్యలకు వారు చెప్పినవన్నీ తప్పుడు సాకులు తప్ప మరొకటి కాదు. ఇవన్నీ అక్కడి సమాజంలో ఉన్న ఒక శాతం కార్పొరేట్ శక్తుల లాభాల కోసమే. ఇదే సమయంలో ఈ సాయుధ చర్యల్లో అమెరికాకు మద్దతుగా ఇతర సామ్రాజ్యవాదులు, వారిని అనుసరించే దేశాల భాగస్వామ్యం కూడా ఉంది.
(ప్రజాశక్తి 5.8.2014 సంచికలో ఎం. కోటేశ్వరరావు వ్యాసం " వందేళ్ళ తొలి ప్రపంచ యుద్ధం, పునరావృతంఅవుతుందా?" నుండి)
No comments:
Post a Comment