1.1.2007 నుండి 9.6.2013వరకు రిటైరయిన బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సుకు
78.2% డిఏ మెర్జర్ పై పెన్షన్ రివిజన్ కు
తమని అనుమతించాలని ఎక్స్పెండీచర్ డిపార్ట్మెంటు(ఫైనాన్స్ మినిస్ట్రీ) ను కోరుతూ డి
ఓ టి 11.7.2014న లెటరు రాసిన సంగతి మనకు తెలిసినదే. 1.10.2000 నుండి 1.1.2007 లోగా
రిటైరయిన వారికి డి ఏ మెర్జర్ జరగనందున వారి విషయములో 78.2% డి
ఏ మెర్జరు ప్రకారం పపెన్షన్ రివిజన్ కు కేబినెట్
అనుమతి అవసరమని, ఈ ప్రక్రియని విడిగా చేపడతామని ఈ లెటరులో డి
ఓ టి తెలియజేసింది.
కానీ ఇప్పుడు 1.1.2007 నుండి 9.6.2013 లోగా రిటైరయిన వారి విషయములో కూడా కేబినెట్ అనుమతి అవసరమని
ఎక్స్పెండీచర్ డిపార్ట్మెంటు ప్రతిపాదించినట్లు, ఏఐబీడీపీ ప్రధానకార్యదర్శి
కా.కె.జి.జయరాజ్ 31.7.2014న ఎక్స్పెండీచర్ డిపార్ట్మెంటును సంప్రదించిన సందర్భముగా
తెలిసింది. డి ఓటి మరియు బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లకు అయ్యే పెన్షన్ చెల్లింపుకు పెన్షన్
ఖర్చు ప్రభుత్వానికి డివిడెండు,లైసెన్సు ఫీజు, పన్నులు తదితర రూపాలలో బిఎస్ ఎన్ఎల్
నుండి వచ్చే ఆదాయములో ఇప్పటికే 60 శాతం మించినందున ఇప్పుడు 78.2 శాతం పై పెన్షన్ రివిజన్
కు కేబినెట్ ఆమోదం అవసరమని ఎక్స్పెండీచర్ డిపార్ట్మెంటు భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
కానీ ఇది అర్థములేని ఆలోచన. 10.6.2013 నుండి రిటైరయిన వారికి ఇప్పటికే
78.2% డీఏ మెర్జర్ ప్రకారం పెన్షన్ రివిజన్ అమలులో వున్నది. కాబట్టి అంతకు ముందే రిటైరయిన
వారికి తప్పనిసరిగా ఈ పెన్షన్ రివిజన్ రాజ్యాంగములోని సమానత్వ అధికరణం ప్రకారం తప్పనిసరిగా
అమలు జరగాలి.
ఎక్స్పెండీచర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులను కలిసి కేబినెట్ అనుమతికి
పంపించాల్సిన అవసరము లేకుండా 78.2% డీఏ మెర్జర్ పై పెన్షన్ రివిజన్ కు ఆమోదింపజేసేందుకు
ఏఐబీడీపీ ప్రయత్నిస్తుంది.
No comments:
Post a Comment