7వ సెంట్రల్ పే కమిషన్ ఆహ్వానాన్ని అనుసరించి 23.7.2014న బి సి పి సి (భారత్ సెంట్రల్
పెన్షనర్స్ కాన్ఫెడరేషన్) నాయకులు కా. మహేశ్వరి(ప్రెసిడెంట్), కా.ఎస్.కె.వ్యాస్ (సెక్రెటరీ జనరల్), కా.వి ఏ ఎన్ నంబూదిరి (డిప్యూటీ సెక్రెటరీ జనరల్) లు
7వ పే కమిషన్ ను కలిసి పెన్షనర్ల సమస్యలపై చర్చించారు. 1.1.2004 తరువాత రిక్రూతయిన
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నష్ట దాయకమయిన, వివక్షతతో కూడిన నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేయటం ఆపి వేసి ఆ విధానాన్ని
రద్దు చేసి వారికి కూడా సి సి ఎస్(పెన్షన్) రూల్సు,1972 వర్తింపజేయాలని
కోరారు. పెన్షన్ ఇప్పుడిస్తున్న విధముగా ఇమాల్యుమెంట్స్ లో 50 శాతం కాకుండా 67 శాతం
ఇవ్వాలని కోరారు. డియర్నెస్ పే ని బేసిక్ పెన్షన్ లో మెర్జీ చేయాలని, పెన్షనర్లకు ఇంటరీమ్ రిలీఫ్ ఇవ్వాలని కోరారు. పెన్షనర్ల వివిధ డిమాండ్స్ పై
మెమోరాండం సమర్పించారు. కా. నంబూదిరి, బి ఎస్ ఎన్ ఎల్ లో విలీనమయిన
డి ఓ టి ఉద్యోగులకు పెన్షన్ రివిజన్ విషయం లో ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించారు.
78.2 శాతం ఐ డి ఏ మెర్జర్ ఆధారముగా బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్స్ కు పెన్షన్ రివిజన్ వెంటనే
జరపాల్సిన అవసరాన్ని వివరించారు. బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సు కు ఎటువంటి అవరోధాలూ లేకుండా
పెన్షన్ రివిజన్ కు ఏర్పాట్లు జరగాలని కోరారు. 7వ పే కమిషన్ ఛైర్మన్ జస్టిస్ శ్రీ అశోక్
కుమార్ మాథుర్ మరియు ఇతర పే కమిషన్ సభ్యులు అందరూ ఈ చర్చలలో పాల్గొన్నారు. సమావేశం
సమయం 45 నిమిషాలని ముందుగా నిర్ణయించినా గంటన్నర కొనసాగింది. పే కమిషన్ సభ్యులు నాయకులు
చెప్పింది శ్రద్ధగా విన్నారు. అనేక ప్రశ్నలు
అడిగారు. వాటన్నింటికి నాయకులు సమర్థవంతముగా జవాబులు ఇచ్చారు.
No comments:
Post a Comment