Tuesday, 29 July 2014

కోయంబత్తూరు లో ఏఐబిడిపిఏ కేంద్ర కార్యవర్గ సమావేశం

ఆల్ ఇండియా బిఎస్ ఎన్ ఎల్/డి ఓ టి పెన్స్హనర్స్ అసోసియేషన్ కేంద్ర కార్యవర్గ సమావేశం కోయంబత్తూరు లో ఈ రోజు (29.7.2014) ప్రారంభమయింది. ఏఐ బి డి పి ఏ అధ్యక్షులు కా. ఏ.కె.భట్టాచార్జీ అధ్యక్షత వహించారు. 

నివేదిక సమర్పిస్తున్న ప్రధాన కార్యదర్శి కా.కె.జి.జయరాజ్, వేదికపై కా.నంబూదిరి, కా. ఎ.కె.భట్టచార్జీ

Sunday, 27 July 2014

10.6.2013 లోగా రిటైరయిన బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లకు 78.2% డి ఏ మెర్జర్ ప్రకారం పెన్షన్ చెల్లింపు విషయములో డి ఓ టి 11.7.2014న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ (ఫైనాన్స్ మినిస్ట్రీ) కు రాసిన వివరణల సారాంశం

* 78.2% డి ఏ మెర్జర్ ప్రకారం పెన్షన్ రివిజన్ చేసే విషయములో కేబినెట్ అనుమతి కి సంబంధించి: 1.1.2007 నాటికి సర్వీసులో వున్నవారికి డి పి ఈ గైడ్ లైన్స్ తేదీ 2.4.2009 ప్రకారం 78.2% డి ఈ మెర్జర్ అమలులోకి వచ్చింది. అందుకు అనుగుణముగా డి ఓ టి 10.6.2013 న ప్రెసిడెన్షియల్ ఆర్డర్సు ఇచ్చింది. కాబట్టి 1.1.2007 తరువాత మరియు 10.6.2013 లోగా రిటైరయిన వారికి 78.2% డి ఏ మెర్జర్ ప్రకారం పెన్షన్ రివిజన్ చేసేందుకు కేబినెట్ అనుమతి అవసరం లేదు. కానీ 1.1.2007 కు ముందు రిటైరయిన వారికి 50% డి ఏ మెర్జర్ అమలు కాలేదు కాబట్టి అది జరిగితేనే వారికి కూడా 78.2% డి ఏ ప్రకారం పెన్షన్ రివిజన్ సాధ్యమవుతుంది కాబట్టి అందుకు కేబినెట్ అనుమతి అవసరం అవుతుంది.
* బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపుకు ప్రభుత్వానికి అవుతున్న ఖర్చు : కేబినెట్ నిర్ణయం ప్రకారం డి ఓ టి లో రిటైరయిన వారికి మరియు బి ఎస్ ఎన్ ఎల్ లో విలీనమయిన తరువాత రిటైరయిన వారికి పెన్షన్ చెల్లింపుకు అయ్యే ఖర్చు విషయములో  బి ఎస్ ఎన్ ఎల్/మరియు లైసెన్సు ఫీజు మరియు బి ఎస్ ఎన్ ఎల్ ప్రభుత్వానికి చెల్లించే కార్పొరేట్ పన్ను/ఎక్సైజ్ డ్యూటీ/సర్వీస్ పన్ను-వీటన్నింటి మొత్తం లో 60% వరకు మాత్రమే  ప్రభుత్వము భరిస్తుంది. అంతకు మించితే మించిన భాగాన్ని బి ఎస్ ఎన్ ఎల్ భరించాలి. డి ఓ టి పెన్షన్ ఖర్చు (డిఓటి లో రిటైరయిన వారికి మరియు బి ఎస్ ఎన్ ఎల్ లో విలీనమయిన తరువాత రిటైరయిన వారికి) 1.10.2000 నుండి 31.3.2010 వరకూ చూస్తే ప్రతి సంవత్సరం ఈ 60% లోపే వున్నది. కానీ ఒక వంక పెన్షన్ ఖర్చు పెరిగి మరో వంకా  బి ఎస్ ఎన్ ఎల్ ఆదాయం పడిపోయినందున 2011-12 నుండి పెన్షన్ ఖర్చు ఈ 60 శాతం పరిమితిని మించిపోయింది. కానీ 1.10.2000 నుండి 31.3.2013 వరకూ ప్రభుత్వానికి పైన తెలియజేసిన అంశాల వచ్చిన మొత్తం ఆదాయం లో 60 శాతం సొమ్ము, ఇదే కాలములో అయిన పెన్షన్ ఖర్చు కన్నా ఎక్కువగానే వున్నది. అయితే ఇతర పెన్షన్ చెల్లింపులకు( 1.10.2000 తరువాత రిటైరయిన డి ఓ టి ఉద్యోగులకు  చెల్లించే  సి డి ఏ పెన్షన్/1.1.2004 తరువాత రిక్రూటయిన డి ఓ టి ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానం ప్రకారం పెన్షన్ కు అయ్యే ఖర్చు/వి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్ల పెన్షన్ చెల్లింపు/ఏం తి ఎన్ ఎల్ లో రిటైరయిన వారికి ప్రొ-రేటా పెన్షన్ / ఇటీవల కేబినేట్ ఆమోదించినడాని ప్రకారం ఏం టి ఎన్ ఎల్ లో రిటైరయిన వారికి రెగ్యులర్ పెన్షన్) ఎంత ఖర్చు అవుతున్నది అనే దానికి సంబంధించిన వివరాల విశ్లేషణ జరుగుతున్నది.
*  పూర్వ ఉదాహరణలు: (అ) ఆహారము మరియు  వ్యవసాయ శాఖ నుండి ఎఫ్ సి ఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) లో విలీనమయిన వారికి ఐ డి ఏ పే స్కేల్సు 1.1.1997 నుండి అమలు జరిగాయి. అయితే ఈ పే రివిజన్ తేదీ నుండి పది నెలల లోగా రిటైరయిన వారికి ఆఖరు పది నెలలలో కొన్ని నెలలు సి డి ఏ మరి కొన్ని నెలలు ఐ డి ఏ పే వున్నందున సి డి ఏ పే కాలం లో కూడా నోషనాల్ గా ఐ డి ఏ పే తీసుకున్నట్లుగా చూపించి ఆ విధముగా పెంస్షన్ చెల్లింపులో అనామలీ లేకుండా చేయటం జరిగింది. (ఆ) 1.1.1996 నుండి 30.9.1996 వరకూ రిటైరయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని నెలలు నాల్గవ వేతన సంఘం పే స్కేల్సులో, కొన్ని నెలలు 5వ వేతన సంఘం పే స్కేలు లో వున్నారు. పెన్షన్  విషయములో వారికి ఏర్పడే అనామలీ ని తొలగించేందుకు వారి ఫ్రే-రివైజ్డ్ పే ని నోషనల్ గా రివైజ్డ్ పే గా అమార్చటం జరిగింది. (ఇ) ఆర్గనైస్డ్ ఏకవుంట్స్ కేడర్ నుండి రిటైరయిన వారికి 1.1.1996 నుండి నోషనల్ గా జరిగిన పే అప్గ్రేడేషన్ ను పెన్షన్ రివిజన్ కొరకు పే గా పరిగణించటం జరిగింది.
* డి ఓ టి విజ్ఞప్తి: కాబట్టి ఈ‌ ఉదాహరణలను దృష్టిలో వుంచుకుని 1.1.2007 నుండి 9.9.2013 లోగా రిటైరయిన బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సు కు నోషనల్ ఫిక్సేషన్ ప్రాతిపదికగా 78.2% డి ఏ మెర్జర్ పై పెన్షన్ చెల్లింపుకు తనని అనుమతించాలని డి ఓ టి,  ఫైనాన్స్ మినిస్ట్రీ ని కోరింది. 1.1.2007 కు ముందు రిటైరయిన బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సుకు 78.2% డి ఏ మెర్జర్ అమలుకు కేబినెట్ ఆమోదం అవసరం కాబట్టి అందుకు తగిన నోట్ ను తయారు చేసి డి ఓ టి, కేబినెట్ కు పంపిస్తుంది.
ఏ ఐ బి డి పి ఏ కృషి
ఈ లెటరు ఎక్స్పెండీచర్ డిపార్ట్మెంటుకు 23.7.2014 న అందింది. 24.7.2014న ఏఐబిడీపిఏ అడ్వైజర్ కా. నంబూదిరి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ (ఫైనాన్స్ మినిస్ట్రీ) లో డైరెక్టర్(ఎడ్మిన్) శ్రీ విజయ్ సింగ్ మరియు అండర్ సెక్రెటరీ శ్రీ వివేక్ ఆశీస్ లను 24.7.2014 న కలిసి ఈ లెటరు కాపీని ఇచ్చి 1.1.2007 తరువాత 9.6.2013 లోగా రిటైరయిన వారికి 78.2% మెర్జర్ ప్రకారం పెన్షన్ రివిజన్ కు వెంటనే ఆర్డర్సు ఇచ్చేందుకు చర్య తీసుకోవాలని కోరారు. ఆర్డర్సు సాధ్యమయినంత త్వరలో ఇప్పించేందుకు ఏ ఐ బి డి పి ఏ కృషి చేస్తున్నది. ఇదే విధముగా 1.1.2007 కు ముందు రిటైరయిన బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సు కు కూడా 78.2% డి ఏ మెర్జరుకు కేబినెట్ అనుమతి  సాధించేందుకు ఏ ఐ బి డి పి ఏ కృషి చేస్తున్నది.






కోయంబత్తూరులో ఏ ఐ బి డి పి ఏ ( ఆల్ ఇండియా బి ఎస్ ఎన్ ఎల్/డి ఓ టి పెన్షనర్స్ అసోసియేషన్) కేంద్ర కార్యవర్గ సమావేశం 2014 జులై 29,30 తేదీలలో

 ఈ నెల 29,30 తేదీలలో ఏ ఐ బి డి పి ఏ కేంద్ర కార్యవర్గ సమావేశం కోయంబత్తూరు లో రైల్వే స్టేషన్ వద్దగల జీవన్ జ్యోతి ఆశ్రమం లో జరుగుతుంది. బి ఎస్ ఎన్ ఎల్ లో 1.10.2000 నుండి 9.6.2013 లోగా రిటైరయిన వారందరికి 78.2% ఐ డి ఈ మెర్జర్ పై పెన్షన్ చెల్లింపు విషయం లో సాధించిన ప్రగతి మరియు ఈ విషయములో భవిష్యత్ కార్యక్రమం, బి ఎస్ ఎన్ ఎల్ ఏర్పడిన పది నెలలలోగా అంటే 1.10.2000 నుండి 30.6.2001 వరకూ రిటైరయిన వారి పెన్షన్ విషయం లో ఏర్పడిన అనామలీ, 1.10.2000 న ఐ డి  పే ఫిక్సేషన్ సందర్భముగా సీనియర్లకు జూనియర్లకన్నా తక్కువ పే ఫిక్సేషన్ జరిగినందున ఏర్పడిన అనామలీ, క్వార్టర్లీ మెడికల్ అలవెన్స్ పునరుద్ధరణ, 7వ పే కమిషన్ కు పెన్షనర్ల సమస్యలపై ఇచ్చిన మెమోరాండం, బి ఎస్ ఎన్ ఎల్ ఆర్థిక పటిష్టత, పెన్షనర్ల ఇతర సమస్యలు తదితర ముఖ్యమయిన విషయాలపై ఈ కార్యవర్గ సమావేశం చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఈ సమావేశానికి ఏ ఐ బి డి పి ఏ అఖిల భారత అధ్యక్షులు కా. ఏ.కె.భట్టాచార్జీ అధ్యక్షత వహిస్తారు. అఖిలా భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షులు కా. ఆర్. ముత్తుసుందరం సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఏ ఐ బి డి పి ఏ అడ్వైజర్ కా. వి.ఏ.ఎన్.నంబూదిరి హాజరవుతారు. మన సర్కిల్ నుండి ఏఐబిడిపిఏ అఖిలా భారత ఉపాధ్యక్షులు కా. పి.అశోకబాబు, ఏఐబిడిపిఏ రాష్ట్ర కార్యదర్శి కా.రామచంద్రుడు హాజరవుతున్నారు.  


78.2% శాతం డి ఏ మెర్జర్ పై పెన్షన్ చెల్లింపు సమస్యపై 24.7.2014 న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ ను కలిసిన కా.నంబూదిరి

ఏఐబిడీపిఏ అడ్వైజర్ కా. నంబూదిరి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ (ఫైనాన్స్ మినిస్ట్రీ) లో డైరెక్టర్(ఎడ్మిన్) శ్రీ విజయ్ సింగ్ మరియు అండర్ సెక్రెటరీ శ్రీ వివేక్ ఆశీస్ లను 24.7.2014 న కలిసి వారికి 78.2 శాతం డి ఏ మెర్జర్ పై పెన్షన్ చెల్లింపు విషయం లో డి ఓ టి 11.7.2014 న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్(డి ఓ ఈ) కు పంపిన క్లారిఫికేషన్ లెటర్ కాపీని అందించారు. 22.7.2014 నాటికి కూడా ఈ క్లారిఫికేషన్ తమకి రాలేదని డి ఓ ఈ అధికారులు అన్నందున ఈ కాపీని వారికి ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈ కాపీ తమకి డి ఓ టి నుండి 23.7.2014 న అందిందని డి ఓ ఈ అధికారులు అన్నారు. డి ఓ టి క్లారిఫికేషన్ అందినందున 78.2% డి ఏ మెర్జర్ పై పెన్షన్ చెల్లింపుకు అంగీకరిస్తూ వెంటనే ఆర్డర్సు ఇవ్వాలని కా. నంబూదిరి విజ్ఞప్తి చేశారు. దీనిపై త్వరలో చర్య తీసుకుంటామని డి ఓ ఈ అధికారులు హామీ యిచ్చారు.


7వ సెంట్రల్ పే కమిషన్ తో పెన్షనర్స్ ప్రతినిధుల సమావేశం

7వ సెంట్రల్ పే కమిషన్ ఆహ్వానాన్ని అనుసరించి 23.7.2014న బి సి పి సి (భారత్ సెంట్రల్ పెన్షనర్స్ కాన్ఫెడరేషన్) నాయకులు కా. మహేశ్వరి(ప్రెసిడెంట్), కా.ఎస్.కె.వ్యాస్ (సెక్రెటరీ జనరల్), కా.వి ఏ ఎన్ నంబూదిరి (డిప్యూటీ సెక్రెటరీ జనరల్) లు 7వ పే కమిషన్ ను కలిసి పెన్షనర్ల సమస్యలపై చర్చించారు. 1.1.2004 తరువాత రిక్రూతయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు  నష్ట దాయకమయిన, వివక్షతతో కూడిన నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేయటం ఆపి వేసి ఆ విధానాన్ని రద్దు చేసి వారికి కూడా సి సి ఎస్(పెన్షన్) రూల్సు,1972 వర్తింపజేయాలని కోరారు. పెన్షన్ ఇప్పుడిస్తున్న విధముగా ఇమాల్యుమెంట్స్ లో 50 శాతం కాకుండా 67 శాతం ఇవ్వాలని కోరారు. డియర్నెస్ పే ని బేసిక్ పెన్షన్ లో మెర్జీ చేయాలని, పెన్షనర్లకు ఇంటరీమ్ రిలీఫ్ ఇవ్వాలని కోరారు. పెన్షనర్ల వివిధ డిమాండ్స్ పై మెమోరాండం సమర్పించారు. కా. నంబూదిరి, బి ఎస్ ఎన్ ఎల్ లో విలీనమయిన డి ఓ టి ఉద్యోగులకు పెన్షన్ రివిజన్ విషయం లో ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించారు. 78.2 శాతం ఐ డి ఏ మెర్జర్ ఆధారముగా బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్స్ కు పెన్షన్ రివిజన్ వెంటనే జరపాల్సిన అవసరాన్ని వివరించారు. బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సు కు ఎటువంటి అవరోధాలూ లేకుండా పెన్షన్ రివిజన్ కు ఏర్పాట్లు జరగాలని కోరారు. 7వ పే కమిషన్ ఛైర్మన్ జస్టిస్ శ్రీ అశోక్ కుమార్ మాథుర్ మరియు ఇతర పే కమిషన్ సభ్యులు అందరూ ఈ చర్చలలో పాల్గొన్నారు. సమావేశం సమయం 45 నిమిషాలని ముందుగా నిర్ణయించినా గంటన్నర కొనసాగింది. పే కమిషన్ సభ్యులు నాయకులు చెప్పింది శ్రద్ధగా విన్నారు.  అనేక ప్రశ్నలు అడిగారు. వాటన్నింటికి నాయకులు సమర్థవంతముగా జవాబులు ఇచ్చారు. 

పెన్షనర్ల సమస్యలపై 7వ పే కమిషన్ కు మెమోరాండం

పెన్షనర్ల సమస్యలపై 7వ పే కమిషన్ కు మెమోరాండం https://drive.google.com/file/d/0BztXX1SBCx0ta2xTcWVBd3JFOFU/edit?usp=sharing