Blog of All India BSNL/DoT Pensioners Association, Andhra Pradesh Circle Maintained by: Com P.Asokababu, Vice President, AIBDPA(CHQ) mobile 9440750111 AIBDPA Andhra Pradesh Circle Circle President: Com V.Sambasiva Rao(mobile 9441265544) Circle Secretary:Com Ramachandrudu (mobile 9440774433) Circle Treasurer: Com K.Narasimha Rao (mobile 9441091386)
Monday, 20 June 2016
78.2 శాతం డి ఏ మెర్జర్ - కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపించబడిన కేబినెట్ నోట్
Tuesday, 14 June 2016
జోహార్ కా.ఎం.పి.కున్హనందన్
Monday, 13 June 2016
78.2 శాతం డి ఎ మెర్జర్- కేబినెట్ నోట్ పై సంతకం చేసిన డి ఓ టి సెక్రెటరీ- కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపించేందుకు జరుగుతున్న సన్నాహం
ఈ రోజు ( 13.6.2016) ఏఐబిడిపిఏ జనరల్ సెక్రెటరీ కా.కె.జి.జయరాజ్ , డి ఓ టి లో డిడిజి ఎస్టాబ్లిష్మెంట్ శ్రీ ఎస్.కె.జైన్ తో 78.2 శాతం డి ఎ మెర్జర్ విషయం మాట్లాడారు.
కేబినెట్ సెక్రెటేరియట్ సూచన మేరకు మార్పు చేయబడిన కేబినెట్ నోట్ ను డి ఓ టి సెక్రెటరీ శ్రీ జె.ఎస్.దీపక్ ఈ రోజు ఆమోదించారని శ్రీ జైన్ తెలియజేశారు. మార్చబడిన ఈ కేబినెట్ నోట్ కు హిందీ అనువాదం, అదనంగా పంపించాల్సిన కాపీలు తదితరాలను తయారు చేస్తున్నామని, ఈ పని అయినతరువాత కవరింగ్ లెటరు సంతకానికి డి ఓ టి సెక్రెటరీకి పంపిస్తామని, ఆ తరువాత కేబినెట్ సెక్రెటేరియట్ కు పంపిస్తామని శ్రీ జైన్ అన్నారు.
ఇప్పటికే 3 సంవత్సరాలయిందని, కొంతమంది పెన్షనర్లు ఈ బెనిఫిట్ లభించకుండానే చనిపోవటం కూడా జరిగిందని, కాబట్టి ఇంకా ఆలస్యం జరగకుండా చూడాలని కా. జయరాజ్, శ్రీ జైన్ కు విజ్ఞప్తి చేశారు. పని త్వరగాఅయ్యేందుకు సాధ్యమయినదంతా చేస్తామని శ్రీ జైన్ హామీ యిచ్చారు.
Wednesday, 8 June 2016
సెక్రెటరీ డి ఓ టి ఢిల్లీలో లేనందున ఆగిన 78.2 శాతం డి ఏ ఫైలు
Wednesday, 1 June 2016
7వ వేతన సంఘం సిఫార్సులపై ప్రభుత్వ వైఖరి-పెన్షనర్లు
26.5.2016 న కేబినెట్ సెక్రెటరీని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు ( కా. శివ గోపాల్ మిశ్రా, కా. గుమన్ సింగ్, కా.కె.కె.ఎన్.కుట్టి) కలిశారు. కేబినెట్ సెక్రెటరీ తో జరిపిన ఈ చర్చలు నిరాశాజనకముగా వున్నాయి. ప్రభుత్వము కనీస వేతనం ను రు.18000 నుండి స్వల్పముగా పెంచేందుకు సిద్ధముగా వున్నది. కానీ ఫిట్మెంట్ ఫార్ములాని 2.57 నుండి పెంచేందుకు సిద్ధముగా లేదు.
ఇంతేగాక 7 వ వేతన సంఘం పాత పెన్షనర్ల పెన్షన్ కొత్త పెన్షనర్లతో సమముగా వుండాలని సిఫార్సు చేసినప్పటికీ ఇందుకు అంగీకరించేందుకు ప్రభుత్వము సిద్ధముగా లేదు. ఈ సిఫార్సు అమలు చేయటం సాధ్యం కాదని, పాత పెన్షనర్ల రికార్డులు దొరకటం కష్టం కాబట్టి సాధ్యము కాదని పెన్షన్ డిపార్ట్మెంటు మరియు రక్షణ శాఖ అన్నట్లు కేబినెట్ సెక్రెటరీ అన్నారు. కానీ ఇది అర్థం లేని వాదన. పెన్షనర్ల రికార్డులు సంబంధిత డిపార్ట్మెంట్సు వద్ద వుంటాయి. ఇంతే గాక పెన్షనర్ల వద్ద కూడా చాలా వరకు వుంటాయి. రికార్డులు దొరకటం కష్టమనే పేరుతో పెన్షన్ సమానతను నిరాకరించే ప్రయత్నం ను మనం ఆమోదించ కూడదు.
ప్రభుత్వ వైఖరి సానుకూలముగా లేనందున డిమాండ్స్ పై కూలంకషముగా చర్చించేందుకు స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు కోరారు. పాత పెన్షనర్లకు కొత్త పెన్షనర్లతో సమానత వుండాలని 7వ వేతన సంఘం సిఫార్సు చేసినా అంగీకరించకపోవటం సమంజసం కాదని ఉద్యోగుల ప్రతినిధులన్నారు. తాను ఈ విషయములో పునఃపరిశీలనకు సిద్ధమేనని, ఒక సారి పెన్షన్ డిపార్ట్మెంటు మరియు రక్షణ శాఖ అధికారులతో చర్చించండని కేబినెట్ సెక్రెటరీ సలహా యిచ్చారు.
3.6.2016 న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఢిల్లీ లో సమావేశమై పరిస్థితిని సమీక్షించి తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తుంది.
పెన్షనర్లకు ఈ విషయాలు తెలియ జెసి అవసరమయిన సందర్భములో పోరాటానికి సంసిద్ధం చేయాలని ఎన్ సి సి పి ఏ (నేషనల్ కొ ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్) సెక్రెటరీ జనరల్ కా. కె.కె.ఎన్.కుట్టి పిలుపునిచ్చారు. ఎన్ సి సి పి ఏ లో ఏ ఐ బి డి పి ఏ భాగస్వామి. కాబట్టి ఈ పిలుపుననుసరించి ఈ విషయాలు పెన్షనర్ల దృష్టికి తీసుకెళ్లాలి.
