ఏ ఐ బి డి పి ఏ అడ్వైజర్, బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు అధ్యక్షుడు మరియు బి ఎస్ ఎన్ ఎల్ నాన్-ఎగ్జిక్యూటివ్/ఎగ్జిక్యూటివ్ యూనియన్ల ఫోరం కన్వీనర్ అయిన కా.నంబూదిరి 24.10.2014న డి ఓ టి సెక్రెటరీ శ్రీ రాకేశ్ గార్గ్ ను కలిసి చర్చించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ చెప్పిన ప్రకారం 78.2శాతం డి ఈ మెర్జర్ ప్రాతిపదికన 1.10.2000 నుండి 9.6.2013 వరకు రిటైరయిన బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లకు పెన్షన్ రివిజన్ కు కేబినెట్ ఆమోదాన్ని పొందేందుకు కేబినెట్ నోట్ ను వెంటనే తయారు చేసి పంపించాలని విజ్ఞప్తి చేశారు. దీనిని వెంటనే పరిశీలించి తగు చర్య తీసుకుంటామని డి ఓ టి సెక్రెటరీ అన్నారు.
బి ఎస్ ఎన్ ఎల్ పునరుద్ధరణకు ఆవసరమయిన సహాయాన్ని ప్రభుత్వము అందించాలని కా. నంబూదిరి డి ఓ టి సెక్రెటరీకి విజ్ఞప్తి చేశారు. సర్వీసుల ఆధునికీకరణ మరియు విస్తరణకు అవసరమయిన ఎక్విప్మెంటు కొనుగోలుకు అవసరమయిన ఆర్థిక మద్దతును ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ కు అందించాలని కోరారు. బి ఎస్ ఎన్ ఎల్ కు స్పెక్ట్రమ్ చార్జీల రీయింబర్స్మెంటుకు ఇచ్చేందుకు అంగీకరించిన రు. 6000 కోట్ల పైగా వున్న మొత్తాన్ని వెంటనే చెల్లించాలని కోరారు. ల్యాండ్ లైన్ సేవలపై వచ్చిన అంష్టానికి పరిహారముగా గతములో ఇచ్చుటకు అంగీకరించిన రు. 1250 కోట్లు బి ఎస్ ఎన్ ఎల్ కు వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కోరికలను పరిశీలించి తగు చర్య తీసుకుంటామని డి ఓ టి సెక్రెటరీ అన్నారు.
No comments:
Post a Comment