15.10.2014న ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్(డి ఓ ఈ), డి ఓ టి కి 78.2 శాతం డి ఈ మెర్జర్ పై ఈ క్రింది విధముగా రాసింది:
* 1.10.2000 నుండి 9.6.2013 వరకు బి ఎస్ ఎన్ ఎల్ లో రిటైరయిన వారందరికి 78.2 శాతం డిఏ ప్రాతిపదికగా పెన్షన్ రివిజన్ కు డి ఓ ఈ మద్దతునిస్తున్నది. కానీ దీనికి కేబినెట్ ఆమోదం కావాలి. కేబినెట్ ఆమోదాన్ని కోరుతూ డి ఓ టి ఒక ప్రతిపాదన ను తయారు చేసి కేబినెట్ కు పంపాలి.
* 1.1.2007 నుండి 9.6.2013 కాలానికి 78.2 డి ఏ ప్రాతిపదికగా వేతన సవరణ నోషనల్ గా జరిగి ఎరియర్సు చెల్లింపు లేనందున పెన్షన్ పెరుగుదల ఎరియర్సు కూడా ఈ కాలానికి చెల్లించటం జరగదు. ఇదే విధముగా డి సి ఆర్ జి కానీ పెన్షన్ కమ్యూటేషన్ కానీ పెరగవు
10.6.2013 కు ముందు రిటైరయిన బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సు కు కూడా 78.2 శాతం డి ఏ మెర్జర్ ప్రాతిపదికగా పెన్షన్ రివిజన్ కు డిఓఈ ఈ విధముగా సూత్ర ప్రాయముగా తన మద్దతు తెలియజేసింది. అయితే 2011-12 నుండి డి ఓ టి మరియు బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపుకు అవుతున్న ఖర్చు ప్రభుత్వానికి బి ఎస్ ఎన్ ఎల్ మరియు ఏం టి ఎన్ ఎల్ లు చెల్లించే లైసెన్సు ఫీజు మరియు డివిడెండు, బి ఎస్ ఎన్ ఎల్ చెల్లించే కార్పొరేట్ పన్ను, ఎక్సైజ్ డ్యూటీ మరియు సర్వీసు టాక్స్-వీటన్నింటి మొత్తములో 60 శాతం దాటినందున ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం అవసరమని డి ఓ ఈ భావించింది. అందుకనే కేబినెట్ ఆమోదానికి ప్రతిపాదన తయారు చేసి కేబినెట్ కు పంపించాలని డిఓటి ని కోరింది.
డిఓటి కేబినెట్ ఆమోదానికి ప్రతిపాదనను త్వరగా తయారు చేసి కేబినెట్ ఆమోదానికి పంపించేలా చేసేందుకు ఏ ఐ బి డి పి ఏ కృషి చేస్తున్నది. ఏమయినప్పటికి ఇది జరిగి అమలులోకి వచ్చేందుకు మరి కొద్ది నెలలు వేచి చూడాల్సి వుంటుంది.

No comments:
Post a Comment