Sunday, 26 October 2014

78.2 శాతం డి ఏ మెర్జర్ ప్రాతిపదికగా పెన్షన్ రివిజన్ కు కేబినెట్ నోట్ వెంటనే తయారు చేయాలి--డి ఓ టి సెక్రెటరీకి కా.నంబూదిరి విజ్ఞప్తి

ఏ ఐ బి డి పి ఏ అడ్వైజర్, బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు అధ్యక్షుడు  మరియు బి ఎస్ ఎన్ ఎల్ నాన్-ఎగ్జిక్యూటివ్/ఎగ్జిక్యూటివ్ యూనియన్ల ఫోరం కన్వీనర్ అయిన కా.నంబూదిరి 24.10.2014న డి ఓ టి సెక్రెటరీ శ్రీ రాకేశ్ గార్గ్ ను కలిసి చర్చించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ చెప్పిన ప్రకారం 78.2శాతం డి ఈ మెర్జర్ ప్రాతిపదికన 1.10.2000 నుండి 9.6.2013 వరకు రిటైరయిన బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లకు పెన్షన్ రివిజన్ కు కేబినెట్ ఆమోదాన్ని పొందేందుకు కేబినెట్ నోట్ ను వెంటనే తయారు చేసి పంపించాలని విజ్ఞప్తి చేశారు. దీనిని వెంటనే పరిశీలించి తగు చర్య తీసుకుంటామని డి ఓ టి సెక్రెటరీ అన్నారు. 

బి ఎస్ ఎన్ ఎల్ పునరుద్ధరణకు ఆవసరమయిన సహాయాన్ని ప్రభుత్వము అందించాలని కా. నంబూదిరి డి ఓ టి సెక్రెటరీకి విజ్ఞప్తి చేశారు. సర్వీసుల ఆధునికీకరణ మరియు విస్తరణకు అవసరమయిన ఎక్విప్మెంటు కొనుగోలుకు అవసరమయిన ఆర్థిక మద్దతును ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ కు అందించాలని కోరారు. బి ఎస్ ఎన్ ఎల్ కు స్పెక్ట్రమ్ చార్జీల రీయింబర్స్మెంటుకు ఇచ్చేందుకు అంగీకరించిన రు. 6000 కోట్ల పైగా వున్న మొత్తాన్ని వెంటనే చెల్లించాలని కోరారు. ల్యాండ్ లైన్ సేవలపై వచ్చిన అంష్టానికి పరిహారముగా గతములో ఇచ్చుటకు అంగీకరించిన రు. 1250 కోట్లు బి ఎస్ ఎన్ ఎల్ కు వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కోరికలను పరిశీలించి తగు చర్య తీసుకుంటామని డి ఓ టి సెక్రెటరీ అన్నారు. 

Friday, 24 October 2014

78.2 డి ఏ మెర్జర్ ఫైలును కేబినెట్ అనుమతికి ప్రతిపాదన తయారు చేయాల్సినదిగా కోరుతూ డి ఓ టి కి తిరిగి పంపిన డి ఓ ఇ

15.10.2014న ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్(డి ఓ ఈ), డి ఓ టి కి 78.2 శాతం డి ఈ మెర్జర్ పై ఈ క్రింది విధముగా రాసింది:

* 1.10.2000 నుండి 9.6.2013 వరకు బి ఎస్ ఎన్ ఎల్ లో రిటైరయిన వారందరికి 78.2 శాతం డి‌ఏ ప్రాతిపదికగా పెన్షన్ రివిజన్ కు డి ఓ ఈ  మద్దతునిస్తున్నది. కానీ దీనికి కేబినెట్ ఆమోదం కావాలి. కేబినెట్ ఆమోదాన్ని కోరుతూ డి ఓ టి ఒక ప్రతిపాదన ను తయారు చేసి కేబినెట్ కు పంపాలి. 

* 1.1.2007 నుండి 9.6.2013 కాలానికి 78.2 డి ఏ ప్రాతిపదికగా వేతన సవరణ నోషనల్ గా జరిగి ఎరియర్సు చెల్లింపు లేనందున పెన్షన్ పెరుగుదల ఎరియర్సు కూడా ఈ కాలానికి చెల్లించటం జరగదు. ఇదే విధముగా డి సి ఆర్ జి కానీ పెన్షన్ కమ్యూటేషన్ కానీ పెరగవు

 10.6.2013 కు ముందు రిటైరయిన బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్సు కు కూడా 78.2 శాతం డి ఏ మెర్జర్ ప్రాతిపదికగా పెన్షన్ రివిజన్ కు డిఓఈ ఈ విధముగా సూత్ర ప్రాయముగా తన మద్దతు తెలియజేసింది. అయితే 2011-12 నుండి డి ఓ టి మరియు బి ఎస్ ఎన్ ఎల్ పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపుకు అవుతున్న ఖర్చు ప్రభుత్వానికి బి ఎస్ ఎన్ ఎల్ మరియు ఏం టి ఎన్ ఎల్ లు చెల్లించే లైసెన్సు ఫీజు మరియు డివిడెండు, బి ఎస్ ఎన్ ఎల్ చెల్లించే కార్పొరేట్ పన్ను, ఎక్సైజ్ డ్యూటీ మరియు సర్వీసు టాక్స్-వీటన్నింటి మొత్తములో 60 శాతం దాటినందున ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం అవసరమని డి ఓ ఈ భావించింది. అందుకనే కేబినెట్ ఆమోదానికి ప్రతిపాదన తయారు చేసి కేబినెట్ కు పంపించాలని డిఓటి ని కోరింది.

డిఓటి కేబినెట్ ఆమోదానికి ప్రతిపాదనను త్వరగా తయారు చేసి కేబినెట్ ఆమోదానికి పంపించేలా చేసేందుకు ఏ ఐ బి డి పి ఏ కృషి చేస్తున్నది. ఏమయినప్పటికి ఇది జరిగి అమలులోకి వచ్చేందుకు మరి కొద్ది నెలలు వేచి చూడాల్సి వుంటుంది.


ఏ ఐ బి డి పి ఏ హైదరాబాద్ జిల్లా మహాసభ

ఏ ఐ బి డి పి ఏ హైదారాబాద్ జిల్లా మహాసభ 19.10.2014న హైదారాబాద్ లో జరిగింది. 250 మంది హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా ఏ ఐ బి డి పి ఏ అఖిల భారత ఉపాధ్యక్షులు కా. పి.అశోకబాబు, బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు సర్కిల్ కార్యదర్శి కా. జె.సంపత్ రావు, ఏ ఐ బి డి పి ఏ సర్కిల్ కార్యదర్శి కా.రామచంద్రుడు, సి ఐ టి యు తెలంగాణా రాష్ట్ర నాయకులు కా. జె.వెంకటేశ్ హాజరయ్యారు. జిల్లా గౌరవాధ్యక్షులుగా కా. సి.కృష్ణ ప్రసాద్ (రిటైర్డ్ ఎస్ డి ఇ), అధ్యక్షులుగా కా. ఏ. బాల్ రెడ్డి (రిటైర్డ్ ఎస్ ఎస్ ఎస్), జిల్లా కార్యదర్శిగా కా. టి.శేషయ్య (రిటైర్డ్ ఎస్ ఎస్ ఎస్), జిల్లా కోశాధికారిగా కా. ఇ.యాదయ్య (రిటైర్డ్ టి ఎం), జిల్లా సహాయ కోశాధికారిగా కా. ఎం.ఏ.అజీజ్ లతో జిల్లా కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవముగా జరిగినది.

జిల్లా మహాసభ  దృశ్యాలు కొన్ని:


 కా.పి.అశోకబాబు, కా. జె..సంపత్ రావు




                                                                            కా. రామ చంద్రుడు హాజరయిన వారిలో ఒక భాగం 
కా.జె.వెంకటేశ్

ఏ ఐ బి డి పి ఏ చిత్తూరు జిల్లా మహాసభ

ఏ ఐ బి డి పి ఏ  చిత్తూరు జిల్లా మహాసభ 12.10.2014న తిరుపతి లో జరిగినది. మొత్తం 120 మంది పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా సర్కిల్  కార్యదర్శి  కా.రామచంద్రుడు, సర్కిల్ సహాయ కార్యదర్శి కా.కె.ఎస్.సి.బోస్ పాల్గొన్నారు. కా. వై.ఎన్.మూర్తి (రిటైర్డ్ ఏ జి ఏం) జిల్లా అధ్యక్షులుగా, కా. ఎం. రాజా రెడ్డి (రిటైర్డ్  సి ఎస్ ఎస్) జిల్లా కార్యదర్శిగా, కా. సి.మునిరత్నం (రిటైర్డ్ ఎస్ టి ఎస్) జిల్లా కోశాధికారిగా జిల్లా కార్యవర్గం ఏకగ్రీవముగా ఎన్నికయింది. 

ఏ ఐ బి డి పి ఏ ప్రకాశం జిల్లా మహాసభ

ఏ ఐ బి డి పి ఏ ప్రకాశం జిల్లా మహాసభ 20.9.2014న ఒంగోలు లో జరిగినది. ఈ మహాసభకు ఏ ఐ బి డి పి ఏ సర్కిల్ అధ్యక్షులు కా. వి.సాంబశివ రావు, సర్కిల్ కార్యదర్శి కా.రామచంద్రుడు, సర్కిల్ సహాయ కార్యదర్శి కా.కె.ఎస్.సి.బోస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొత్తం 100 మంది పాల్గొన్నారు. మహాసభలో జిల్లా అధ్యక్షులుగా కా.జి.వెంకటేశ్వర్లు (రిటైర్డ్ జె టి ఓ), జిల్లా కార్యదర్శిగా కా. షేక్ అజీజ్ (రిటైర్డ్ ఎస్ టి ఎస్), జిల్లా కోశాధికారిగా కా. కె.సుబ్బయ్య (రిటైర్డ్ ఎస్ టి ఎస్) తదితరులతో జిల్లా కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవముగా జరిగినది.