ఏఐబిడిపిఏ జనరల్ సెక్రెటరీ కా. కె.జి.జయరాజ్ 21.4.2016 న డి ఓ టి లో డిడిజి ఎస్టాబ్లిష్మెంట్ శ్రీ ఎస్.కె.జైన్ ను కలిసి 78.2% డి ఎ మెర్జర్ పై చర్చించారు. మంత్రి నుండి కేబినెట్ నోట్ ఫైలు తిరిగి వచ్చిందని , ఆ కేబినెట్ నోట్ కు అనుబంధంగా పంపించాల్సిన పత్రాలను ( కేబినెట్ నోట్ కు హిందీ అనువాదం మరియు సంబంధిత డాక్యుమెంట్లుఒక్కొక్కటి 50 కాపీలు) తయారు చేస్తున్నామని, డి ఓ టి లో వున్న పెన్షన్ సెక్షన్ ఈ పనిచేస్తున్నదని శ్రీ జైన్ అన్నారు. హిందీ అనువాదాన్ని హిందీ సెక్షన్ చేస్తున్నదని అన్నారు.
కేబినెట్ నోట్ తయారీ మొదటినుండీ చూస్తున్న డైరెక్టర్ ( ఎస్టాబ్లిష్మెంట్) శ్రీ ప్రాచిస్ ఖన్నా సెలవులో వున్నారు. 28.4.2016 న జాయిన్ అవుతారు. కాబట్టి కా. జయరాజ్, ఏడిజి పెన్షన్ ను కలిసి కేబినెట్ నోట్ ను త్వరగా పంపించామని కోరారు. పని ఇప్పటికే ప్రారంభించామని, కొద్ది రోజులలో పూర్తి అవుతుందని అన్నారు. అనంతరం కా.జయరాజ్, హిందీ అధికారులను కలిశారు. హిందీ అనువాదం 25 వ తేదీ నాటికి పూర్తి కావచ్చని వారు తెలియజేశారు.
కాబట్టి ఏఐబిడిపిఏ కృషి వలన కొద్ది రోజులలోనే కేబినెట్ నోట్ ను డి ఓ టి ఆమోదానికిపంపించే పరిస్థితి ఏర్పడింది.